Friday, November 25, 2011

దిశ నిర్దేశిస్తా ... దశ మారుస్తా

 
ఉదయిస్తున్న కిరణం  
అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఏడాది పాలనలో తనదైన ముద్ర వేయటంలో సఫలమయ్యారు. అధికారం పగ్గాలు చేపట్టిన ప్రారంభంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ బయటపడకుండా తనదైన శైలిలో పాలన సాగించిన కిరణ్‌ ఇప్పుడిప్పుడే పూర్తిగా కుదురుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నారు. అధిష్టానం వద్ద క్రమంగా తన పలుకుబడి పెంచుకుంటూ జటిలమైన సమస్యలను సైతం పరిష్కరించే స్థాయికి కిరణ్‌ ఎదిగారు. ఈ ఏడాది పాలనలో ఎక్కడా ఆయనపై అవినీతి ఆరోపణలు రాకపోవటం మరో విశేషం. kiran4
రాజకీయ ప్రత్యర్థులే కాకుండా విపక్షాలు సైతం ఈ విషయంలో ఆయనవైపు వేలెత్తి చూపలేకపోయారు. తెలంగాణ వాదం అతి బలంగా ఉన్న సమయంలోనూ 42 రోజులు సాగిన సకల జనుల సమ్మె సందర్భంగా సైతం కిరణ్‌ ఎక్కడా ఏ విషయంలోనూ రాజీ పడలేదు. ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ అన్ని కేసులనూ ఎత్తివేయటం సాధ్యం కాదని కరాఖండిగా తేల్చి చెప్పారు.

పెరుగుతున్న పలుకుబడి....
మొదట్లో బాలారిష్టాలు...


మొదట్లో మంత్రివర్గం కూర్పు వద్ద నుంచి ఉవ్వెత్తున ఎగిసిన సకల జనుల సమ్మె దాకా అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కిరణ్‌ మౌనంగా తన పని తాను చేసుకుపోయా రు. అనేక సందర్భాలలో ఢిల్లీ వద్ద తన పలుకుబడిని నిరూపించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆరు సంవత్సరాల పాలనలో ప్రారంభిం చిన పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకా లను అమలు చేయటంలో కిరణ్‌ విజయం సాధించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయ చాతుర్యం...
kiran 

వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా జగన్‌ వర్గానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినప్పటికీ కిరణ్‌ కంగారు పడలేదు. మౌనంగా అన్ని పరిణామాలను గమనిస్తూనే తన వ్యూహాన్ని అంతర్గతంగా అమలు చేయటం ప్రారంభించారు. ఫలితంగా జగన్‌ వైపు వెళ్ళిన కొందరు ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని మళ్ళీ కాంగ్రెస్‌ వైపు దృష్టి సారించారు. ఒకవైపు వ్యూహాలను అమలు పరుస్తూనే మరోవైపు తనదైన శైలిలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి అవసరమైన కార్యక్రమాలను ఆమోదింపజేసుకుంటున్నారు.
తొలి ఘన విజయం14ఎఫ్‌ రద్దు...
ఇక ఎన్నటికీ జరగదనుకున్న 14ఎఫ్‌ నిబంధనను కిరణ్‌ కేంద్రాన్ని ఒప్పించి రద్దు చేయించగలగటంతో ఆయన తొలి విజయం ప్రారంభమైంది. పోలీసు నియామకాలకు సంబంధించిన ఈ వివాదాస్పద నిబంధన తెలంగాణ ప్రాంతంలో చిచ్చు రేపింది. ఎసై్స అభ్యర్థులలో ఎంతో ఆందోళన కలిగించిన ఈ నిబంధన రద్దు కావాలని తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ ఫలితం లేకపోగా కిరణ్‌ దాన్ని రద్దు చేయించగలిగారు.

నీట్‌ వాయిదా...
తాజాగా విద్యార్థి లోకానికి ఎంతో ఆందోళన కలిగించిన నీట్‌ పరీక్షా విధానాన్ని రాష్ట్రానికి సంబంధించినంత వరకు రెండేళ్ళు వాయిదా వేయించటంలో కిరణ్‌ సఫలమయ్యారు. శుక్రవారం కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో టెలిఫోన్‌లో మాట్లాడి సానుకూలంగా వాయిదా వేయించగలిగారు. దీనివల్ల విద్యార్థి లోకానికి, వారి తల్లిదండ్రులకూ ఎంతో ఊరట చిక్కినట్టే లెక్క.
మద్దతు ధర...
kiran2 

అలాగే ధాన్యానికి రూ.80 హెచ్చించటంతో పాటు రూ.1,200 బోనస్‌ ప్రకటించటంతో రైతులకు ఊరట కలిగించినట్టయింది. ధాన్యం నిల్వల కోసం గోదాముల నిర్మాణానికి స్థలాలను కేటాయించాలన్న ఆదేశంతో కిరణ్‌ సర్కార్‌ రైతులకు మరో మేలు చేకూర్చి నట్టయింది.
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 1960, సెప్టెంబర్‌ 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన విధ్యాభ్యాసమంతి హైదరాబాద్‌లోనే కొనసాగింది. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాల యాలలో బీకాం, ఎల్‌ఎల్‌బీలను చదివారు.

వ్యక్తిగత జీవితం....
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 1960, సెప్టెంబర్‌ 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన విధ్యాభ్యాసమంతి హైదరాబాద్‌లోనే కొనసాగింది. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాల యాలలో బీకాం, ఎల్‌ఎల్‌బీలను చదివారు. నిజాం కళాశాల విద్యార్థి సంఘం నాయకునిగా పనిచేశారు. ఇక రాష్ట్రం తరపున రంజీ ట్రోఫీ క్రికెట్‌ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. కిరణ్‌కుమార్‌ రెడ్డి కెప్టెన్‌గా ఉన్నప్పు డు జట్టులోని ప్రముఖులలో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టె న్‌ అజారుద్దీన్‌, ప్రఖ్యాత క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షా భోగ్లే టీం సభ్యులుగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వివాహం రమణా రెఇ్డ కుమార్తె రాధికారెడ్డితో జరిగింది. ఈ దంపతలుకు కుమార్తె నీహారిక,కుమారుడు నిఖిలేష్‌ ఉన్నారు.

రాజకీయ ప్రస్ధానం...
kiran5 

తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత 1988లో వాయల్పాడుఉప ఎన్నికల్లో తల్లినల్లారి సరోజమ్మ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయింది. అనంతరం 1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్‌ పోటీ చేసి గెలిచారు.1994లో భారీ తేడాతో ఓటమి చవిచూసినా 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ నమోదుచేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇక రాజకీయంగా నేదురుమల్లిజనారద్నరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలతో సన్నిహితంగా ఉండేవారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డితో మొదట్లో విరోధమున్నా తర్వాత ఆయనకు సన్నిహితమయ్యారు. ఇక 2010 నవంబర్‌ 25న కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ 16వ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు.

పాత పధకాల కొనసాగింపు....
ఈ కొత్త పథకాలే కాకుండా గత ఏడు సంవత్సరాలుగా అమలవుతున్న రైతులకు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం, ఫీజు రీయంబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, పింఛన్లు, పావలా వడ్డీ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వంటి పథకాలను సైతం కొనసాగిస్తున్నారు. విమర్శలు ఎదురైనప్పుడు వెనుకడుగు వేయకుండా, ఇటు పాలనా పరంగా, అటు రాజకీయ ఇబ్బందులను సైతం తట్టుకుంటూ కిరణ్‌ తన పని తాను చేసుకుపోతున్నారన్న ప్రశంసలు ఇప్పుడు ఆయన వైరి వర్గాల నుంచి సైతం అందుతున్నాయి.

ఏడాదిపాలనలో ప్రవేశపెట్టిన పధకాలు....


 • దరల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ...ఇది మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో పని చేస్తుంది...
 • మీ సేవ...ఐటీ పరిజ్ఞానం ద్వారా సామాన్యుడికి పారదర్శకంగా, సులభంగా, వేగంగా సేవలందించే పథకం...12 సేవలతో ప్రారంభమైన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 50 సేవలను అందిస్తుంది.
 • రచ్చబండ 1, 2...ఎలాంటి అండ లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల దాదాపు కోటి మంది పేదలకు ప్రయోజనం కలుగుతుంది.
 • విద్యా పక్షోత్సవాలు...రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ధ్యేయంతో రూ.3,500 కోట్ల వ్యయంతో గత జూన్‌ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
 • రాజీవ్‌ యువ కిరణాలు (మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు)...2014 నాటికి 15 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించటం, పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాలతో అనుసంధానం చేసి ఉపాధి కల్పించటం, పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా పాఠ్యాంశాలను తీర్చిదిద్దటం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
 • ఇందిర జలప్రభ...రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావటానికి రూ.1,800 కోట్లతో అక్టోబర్‌ రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల కుటుంబాలను పేదరికానికి దూరం చేయాలన్నది సంకల్పం.
 • రూపాయికే కిలో బియ్యం...రాష్ట్రంలో నిరుపేదలందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 7.50 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా.
 • స్టేట్‌ మిల్క్‌ మిషన్‌...రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
 • సాగురైతుల రక్షణకు చట్టం...కౌలు రైతులకు మేలు చేకూరే విధంగా భూమి లైసెన్సు పొందిన సాగుదారుల ఆర్డినెన్స్‌ను చట్ట రూపంలోకి తెచ్చారు.
 • పంట రుణాలకు జీరో వడ్డీ...లక్ష రూపాయల దాకా రుణం తీసుకున్న రైతులు సకాలంలో దాన్ని చెల్లిస్తే జీరో వడ్డీ పథకం వర్తింపజేస్తారు. దీనివల్ల 95 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
 • 1.16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌...వచ్చేనెల చివరికల్లా 1,16,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను పూర్తిగా నోటిఫై చేస్తారు. ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఉపాధ్యాయుల డీఎస్సీ నియామక సంస్థ వంటివి ఉద్యోగాలను భర్తీ చేస్తాయి...
 • స్ర్తీనిధి మహిళా బ్యాంక్‌...మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయించకుండా తక్కువ వడ్డీతో 24 వాయిదాలలో తీర్చుకునే వెసులుబాటు కల్పించారు

Saturday, January 29, 2011

జిల్లాలకు సీఎం వరాలు * మీకు వీలుంటే సాయంచేయండి...లేదంటే ఇంట్లో కూర్చోండి... మీకు సత్తాలేదు... సాయం చేసేవాళ్లను చేయనివ్వండి... ప్రజ లకు మేలుచేస్తుంటే కడుపుమంటతో ఇబ్బందుల పాలు చేస్తే అభాసుపాలవుతారు...

 

2 సీట్లు.. 11 సీట్లున్న పార్టీలకు భయపడేది లేదు

 మీకు వీలుంటే సాయంచేయండి...లేదంటే ఇంట్లో కూర్చోండి... మీకు సత్తాలేదు... సాయం చేసేవాళ్లను చేయనివ్వండి... ప్రజ లకు మేలుచేస్తుంటే కడుపుమంటతో ఇబ్బందుల పాలు చేస్తే అభాసుపాలవుతారు... రెండు సీట్లున్న పార్టీకి... పదకొండు సీట్లున్న పార్టీకి భయపడేదిలేదు...125 ఏళ్ల చరిత్ర గల పార్టీ మాది...మీరు మారకపోతే మళ్లీ ఎన్నికల్లో అవే నెంబర్లు కొనసాగుతాయంటూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విపక్షాలకు చురకలం టించారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో శుక్రవారం ‘ఆధార్‌’ ఆధారంగా వినియోగదారులకు స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం కట్టుబడి వుంటుందని స్పష్టం చేశారు. ఇలా పదిమంది...యాభై మంది వచ్చి వేలాదిమందికి మేలుచేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తే భయపడేదిలేదని...ప్రజలే చూసుకుంటారన్నారు. తెలంగాణ నినాదాలతో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలను ఉద్దేశించి సీఎం 
పై విధంగా స్పందించారు.
 
‘ఆధార్‌’ఆధారంగా దేశంలోనే మొదటిసారిగా మహేశ్వరంలో స్మార్టకార్డుల ద్వారా వినియోగదారులకు రేషన్‌ సరుకులను పంపిణీ చేస్తున్నామని, ఈ కార్డు ద్వారా వినియోగదారులు ఎక్కడినుంచైనా రేషన్‌ తీసుకోవచ్చునని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని అర్హులైన ప్రజలందరికీ అందజేసేవరకు నిద్రపోవద్దన్న యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ల ఆదేశాలమేరకు రాష్ట్రంలో ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్లేందుకు ఈ రచ్చబండకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టబోయి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణించడం దురదృష్టకరమని, ఆయన చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు.

ఆర్థిక, అంగబలం, గొంతులేని నిరుపేదలకు, పూర్తిగా వెనకబడిన వారికి మేలుచేసేందుకే రచ్చబండను నిర్వహిస్తున్నామన్నారు. పదిహేనురోజుల్లో 26 లక్షల కుటుంబాలకు, 1.25 కోట్ల మందికి మేలుచేసేందుకు రూ.2005 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, 50 శాతం సబ్సిడీకి బదులుగా 90 శాతం సబ్సిడీ కావాలని కేంద్రంపై ఒత్తిడితెస్తున్నామని, ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.

త్వరలోనే పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తిచేస్తామని సీఎం వివరించారు. ఇరవై ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని, అప్పటికీ ఇప్పటికీ మహిళల పరిస్థితి పూర్తిగా మారిందని, ఇళ్లు, భూములు వారి పేర్లపైనే ఇస్తున్నామని...వారు ఎంతో అభివృద్దిని సాధించారని, నాడు అవసరాలకు డబ్బు తీసుకునే వారని...ఇప్పుడు పురుషులకే డబ్బులు ఇచ్చేస్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఆధిభట్లలో మరో పదిపదిహేను రోజుల్లో వెయ్యి కోట్లతో టాటా మూడు కంపెనీలను ప్రారంభించనున్నారని, దీంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనున్నదని తెలిపారు. జిల్లాలో కూరగాయల జోన్‌ ఏర్పాటుకుగాను ముందుగా ఐదువేల ఎకరాలను తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ సెంటిమెంట్‌గా ఏ కార్యక్రమమైనా రంగారెడ్డి జిల్లానుంచే ప్రారంభించారని, అదేవిధంగా తాను కూడా రంగారెడ్డి జిల్లానుంచే ‘ఆధార్‌’, స్మార్ట్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించానని పేర్కొన్నారు. ఇదిలావుండగా, సీఎం ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేయడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిరసన కారులను అరెస్టుచేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అంతకుముందు సుమారు రూ.110 కోట్లు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, మహిళా సంఘాలకు పావలావడ్డీ పథకం కింద రూ.35 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆధార్‌కార్డులను, స్మార్ట్‌కార్డులను సీఎం అందజేశారు. మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పి.సబితాఇంద్రారెడ్డి, కే.జానారెడ్డి, సునితాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బిక్షపతియాదవ్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సంజయ్‌జాజు, ఆధార్‌ డైరెక్టర్‌ విఎల్‌ భాస్కర్‌, జిల్లా కలెక్టర్‌ ఎం.దానకిశోర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పావలావడ్డీ రుణాలు అందజేసిన ముఖ్యమంత్రి

కొండమల్లేపల్లి రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పావలావడ్డీ రుణాలను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. 35 గ్రూపులకు 55వేల రూపాయలను అందజేశారు. మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రచ్చబండ కార్యక్రమానికి అనుమతించాలంటూ సీపీఐ నాయకులు హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్‌రెడ్డి, రవీంద్రకుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డిలను అనుమతించకపోవడంతో ధర్నా నిర్వహించారు. దీంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకొని సీపీఐ నాయకులను హెలిప్యాడ్ వద్దకు అనుమతించారు.
సీఎం సభలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు వినతులు అందజేశారు. డిండి ఎత్తిపోతల, శ్రీశైలం సొరంగమార్గానికి నిధు లు కేటాయించాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీపీఐ ఆధ్వర్యంలో పల్లా వెంకట్‌రెడ్డి, రవీంద్రకుమార్, ఎం.ఆదిరెడ్డి, పల్లా నర్సింహ్మారెడ్డి, కృష్ణాట్రిబ్యునల్ తీర్పుతో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని,
సుప్రీంకోర్టు లో రివ్యూ పిటిషన్ వేసి నికర జలాలు అందించాలని, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందజేయాలని టీడీపీ నియోజకవర్గవర్గ ఇన్‌చార్జి బీల్యానాయక్, జిల్లా కార్యదర్శి హన్మంతు వెంకటేష్‌గౌడ్, పట్టణ అభివృద్ధికి నిధులు అందజేయాలని కొండమల్లేపల్లి సర్పంచు తార, మంచినీటి సౌకర్యం కల్పించాలని కుందల్‌పహాడ్ సర్పంచు లక్ష్మీయాదగిరి, వికలాంగ యువతీ పెన్షన్ అందజేయాలని, నాయీ బ్రాహ్మణులకు ఇళ్లు మంజూరు చేయాలని సంఘం నాయకులు ఎన్.వెంకటయ్య ముఖ్యమంత్రికి వినతిపత్రాలు అందజేశారు.
ఏడుకోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం పాఠశాల గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. నూతన భవనాన్ని సద్వినియోగ పర్చుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి పాల్గొన్న రచ్చబండ, బహిరంగసభ భారీ పోలీసు బందోబస్తు మధ్య జరిగింది. సభ విజయవంతమైనప్పటికీ తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య జరిగిన రాళ్లదాడులలో పోలీసులతో పాటు తెలంగాణవాదులకు గాయాలయ్యాయి. ఐజీ రాజీవ్‌రతన్ ఆధ్వర్యంలో ఎస్పీ రాజేష్‌కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేసినప్పటికీ సభా సజావుగా కొనసాగగా బయట కొన్నిసంఘటనలు చోటుచేసుకున్నాయి.

రచ్చబండలో పాల్గొనడానికి కొండమల్లేపల్లి హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు జానారెడ్డి, వెంకట్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భారతీరాగ్యానాయక్, నేతి విద్యాసాగర్, జడ్పీచైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు నేనావత్ బాలూనాయక్, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ రిజ్వీ, ఐజీ రాజీవ్ రతన్, ఎస్పీ రాజేష్‌కుమార్, జేసీ నీతూప్రసాద్, చంపాలాల్, ఆర్డీవో సంజీవరెడ్డి, డీఎస్పీ అహ్మద్అలీ, సురేంద్రబాబుతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.

Click Here!

ఫ్లోరైడ్ సమస్యను అధిగమిస్తాం

'ఫ్లోరైడ్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చాలా నిధులను అందించింది. ప్రాజెక్టు పూర్తికి రూ.150 కోట్లు అవసరమని గుర్తించాము. జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలన్నింటికీ పూర్తి స్థాయిలో రక్షిత నీటిని అందించేందుకు కృషి చేస్తాం' అని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం దేవరకొండ మండలం కొండమల్లేపల్లిలో జరిగిన రచ్చబండలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అక్కడే జరిగిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.


జిల్లా ప్రజాప్రతినిధులు ఏకరువు పెట్టిన సమస్యలను విన్న సీఎం కొన్నింటి పరిష్కారానికి పూర్తి స్థాయిలో హామీలిచ్చారు. మరికొన్నింటి పరిష్కారానికి సానుకూలంగాస్పందించారు. జిల్లాలో వ్యవసాయం ముఖ్య ఆధారమని, నీరు ఉన్నా అది అందే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి ఆవేదన చెందారు. అందుకోసం చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేసి, పది లక్షల ఎకరాలకు సాగు నీరందించే వీలును కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల విద్యుత్ వ్యవసాయ పంపుసెట్లు ఉండగా ఒక్క నల్లగొండ జిల్లాలోనే 2.42లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రభుత్వం జిల్లా రైతులకు రూ.250 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీని గడిచిన ఆరు సంవత్సరాలుగా ఇస్తున్నదన్నారు. చేనేత సొసైటీలకు రూ.90 కోట్ల నిధులను విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. జిల్లాకు ఎంతో ఉపయోగకరమైన శ్రీశైలం సొరంగమార్గం పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో జిల్లాలోని 44 వేల మంది మహిళలకు అభయహస్తం పింఛను అందజేస్తామన్నారు. జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిపించిన ఘనత జిల్లా ప్రజలదని ప్రశంసించారు.

అందుకు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉందని, జిల్లా సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం జేశారు. ప్రాణహిత-చేవెళ్ల, ఎస్సారెస్పీ రెండో దశ పనులను సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు మాట్లాడిన జిల్లా ప్రజాప్రతినిధులు దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును నిలిపివేయాలని కోరారు.

ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం 70 టీఎంసీల కృష్ణాజలాలను ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Click Here!

జిల్లాకు సీఎం వరాలు

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా కు సీఎం వరాలు ప్రకటించారు. కూ రగాయల జోన్ కింద గుర్తించి మొదటి విడతగా ఐదువేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. మహేశ్వరం మండలం కేసీతండాలో శుక్రవారం ఆయన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మహేశ్వరంలో రూ.40 కోట్లతో 122 గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించే ప్రాజెక్టుకు, ఫ్యాబ్‌సిటీలో రూ.56 కోట్లతో ఏర్పాటు చేయనున్న 220/132/26 కేవీసబ్‌స్టేషన్‌కు, రూ.4.50 కోట్లతో బస్‌డిపో నిర్మాణానికి, రూ.1.45 కోట్లతో నిర్మించనున్న ఫైర్‌స్టేషన్లకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

ఇదే వేదికపై ఆధార్ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఒక్కరోజే రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. రంగారెడ్డి జిల్లా రాష్ట్రానికే కేంద్ర బిందువుగా ఉందని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా ఈ జిల్లా నుంచే ప్రారంభించారని, దేశానికే ఇది మార్గదర్శకం కావాలన్నారు. ఈ జిల్లా అంటే తనకు మక్కువేనని ముఖ్యమంత్రిగా రెండు నెలల కాలంలోనే ఆరుసార్లు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నానని అన్నారు. జిల్లాలో 1100 ఐటీ కంపెనీలున్నాయని వీటి లో రెండు లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు.

ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్‌లో మరో 15 రోజుల్లో వెయ్యి కోట్లతో టాటా కంపెనీ మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుందని, దీంట్లో వేయి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరిక మేరకు మహేశ్వరం ఆస్పత్రిని 30 నుంచి వంద పడకల స్థాయికి పెంచుతున్నామన్నారు. ఈ ప్రాంతంలోని భూములను అమ్ముకోకుండా, నమ్ము కుంటే కోటీశ్వరులవుతారన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం,ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టులతో జిల్లా రూపురేఖలే మారాయన్నారు.

ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుతో అన్ని చెరువులను నింపి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు గాను కేంద్రం అనుమతి ఇచ్చిందని, ప్రధానమంత్రి ప్యాకేజీ కింద 50 శాతం రాయితీ ప్రకటించారని దీనిని జాతీయ ప్రాజెక్టు కింద తీసుకుంటే 90 శాతం రాయితీ వస్తుందన్నారు. 30వేల కోట్లకు పైగా ఖర్చు కానున్న పోలవరం, ప్రాణహితలను పూర్తి చేస్తామని అన్నారు. పేద వర్గాలను వేధించవద్దని, వడ్డీ తగ్గించి మైక్రోఫైనాన్స్‌పై చట్టం చేసినట్లు ఆయన గుర్తు చేశారు.ప్రభుత్వం వెచ్చిస్తున్న ప్రతి పైసా పేదలకే చెందేటట్లు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు కుందూరు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, ఎమ్మెల్యేలు సు«ధీర్‌రెడ్డి, బిక్షపతి యాద వ్, శ్రీశైలం గౌడ్, ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వి.ఎస్.భాస్కర్, ఫౌరసరఫరాల కమిషనర్ సంజయ్ జాజు, ట్రాన్స్‌కో సీఎండీ అజయ్‌జైన్, జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ దానకిషోర్, జా యింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, డ్వామా పీడీ వీరాచారి, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి పాల్గొన్నారు. స్మార్టు కార్డులతో ఎంతో ఉపయోగం.. కందుకూరు: దేశంలోనే ప్రథమం గా మహేశ్వరంలో ప్రవేశపెట్టిన స్మా ర్టు కార్డులు క్షేత్రస్థాయిలో ఎంతో ఉపయోగపడుతాయని ఆ పథకం నాలు గు రాష్ట్రాల ఇన్‌చార్జి వి.ఎస్.భాస్కర్ అన్నారు.

మహేశ్వరంలో జరిగిన సీఎం రచ్చబండ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ సాంకేతిక పద్ధతి పరమైన సమస్యలను తట్టుకుని ప్రతి మనిషికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఆధార్ కార్డును ప్రవేశపెట్టామన్నారు. ఇక మీదట ఎక్కడున్నా తమ రేషన్‌ను తీసుకోవచ్చని అన్నారు. ఆధార్ కార్డును ప్రవేశపెట్టడం వల్ల మరోసారి రాష్ట్రంలో మహేశ్వరం కేం ద్ర బిందువుగా మారిందన్నారు. తీరనున్న తాగునీటి సమస్య.. హోంమంత్రి మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలోని 121 గ్రామాల్లో తాగునీటి సమస్య తీరనుందని, నలభై కోట్లతో కృష్ణా జలాలను ప్రతి గ్రామానికి సరఫరా చేసే పనులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రారంభించారని హోం మంత్రి సబితా ఇంద్రారె డ్డి తెలిపారు. శుక్రవారం మహేశ్వరం లో రచ్చబండ అనంతరం నిర్వహించి న బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ కృష్ణా జలాలతో ఇక ఫ్లోరైడ్ సమస్య ఉండదన్నారు.

తెలుగు దేశం హయాంలో శిలాఫలకానికే పరిమితమైన మహేశ్వరంలో బస్సు డిపోను నాలుగు కోట్లతో పూర్తి చేయడానికి సీఎం కిరణ్ ఒప్పుకున్నారని, ఇందులో భాగంగా నేడు శంకుస్థాపన చేశారని వివరించారు. రంగారెడ్డి జిల్లాను కూరగాయల జోన్‌గా ప్రకటించామని, పాడి పరిశ్రమకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. వై.ఎస్ ప్రవేశపెట్టిన రచ్చబండను ప్రస్తుత సీఎం కొనసాగించడం అభినందనీయమన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ విశిష్టమైన ఆధార్, స్మార్ట్ గుర్తింపు కార్డులను మహేశ్వరం నుంచి ప్రారంభించడం గర్వకారణమన్నారు.

ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉండాలని, ఆ గుర్తింపుతోనే ముందుకు పోవాలని ఆధార్ కార్డులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మహేశ్వరం మండలంలోని 11 వేల కుటుంబ సభ్యులకు ఆధార్ నమోదు కావడం దేశంలోనే మహేశ్వరం మైలు రాయిగా నిలిచిందన్నారు. రానున్న ఎనిమిది నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు ఆధార్ స్మార్ట్ కార్డులను అందజేస్తామని తెలిపారు. రూ.246 కోట్లతో నీటి సరఫరా.. మంత్రి జానారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జా నారెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా లో తాగునీటి కోసం కాంగ్రెస్ పభుత్వంలో రూ.246 కోట్లు కేటాయించి పనులు చేపట్టినట్లు తెలిపారు. రచ్చబండలో ఇచ్చిన అర్జీలను మూడు నెలల్లో పరిష్కారిస్తామన్నారు. రెండు సంవత్సరాల్లో 121 గ్రామాలకు కృ ష్ణా నీరు అందిస్తామన్నారు.

మహి ళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు రచ్చబండ ఓ పరిష్కార వేదిక అన్నారు. వ్యక్తిగత అభివృద్ధి, సంక్షేమ సమస్యల పరిష్కారం కోస మే రచ్చబండ అని, దీనిని ప్రతి ఒక్క రూ ఉపయోగించుకోవాలని కోరారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సంజయ్‌జాజు మాట్లాడుతూ ఆధార్ స్మార్ట్ కార్డులు పూర్తి చేసిన మహేశ్వరం మండలం దేశంలోనే మొదటిదన్నా రు.ఇందులో కలెక్టర్ దానకిశోర్, యూనిక్ ఐడీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీఎస్.భాస్కర్, సుధీర్‌రెడ్డి, శ్రీశైలంగౌడ్, భిక్షపతి యాదవ్, మహేశ్వరం ఎంపీపీ పాండునాయక్, సర్పంచ్ జ్యోతి శంకర్‌నాయక్, జడ్ పీటీసీ జంగయ్య, ఎంపీటీసీ శ్రీనివాసగౌడ్, శాంతి పాల్గొన్నారు.
Click Here!

Friday, January 28, 2011

అభివృద్ధి చూసి కొందరికి.. కడుపు కాలుతోంది అందుకే రచ్చబండకు ఆటంకాలు...

 

రహదారుల అభివృద్ధికి 20 వేల కోట్ల ప్యాకేజి
ఆగిన పనుల పూర్తికే సోనియా నన్ను నియమించారు!
వైఎస్ సలహాదారుల్లో నేనూ ఒకణ్ని

కర్నూలు, మహబూబ్‌నగర్ సభలలో కిరణ్
అభివృద్ధి చూసి కొందరికి.. కడుపు కాలుతోంది
అందుకే రచ్చబండకు ఆటంకాలు
వ్యతిరేకులపై సీఎం నిప్పులు 
 
"గొంతు లేని వారికి, కండ బలం లేనివారికి, ఆర్థిక, పార్టీల బలం లేని పేదల ఇంటి తలుపు తట్టి కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. రాష్ట్రంలో రూ. 2500 కోట్ల పథకాలను పేదలకు రచ్చబండ సందర్భంగా అందిస్తున్నాం. ఇది చూసి కొందరికి కడుపు కాలుతోంది. అందుకే ఆటంకాలు సృష్టిస్తున్నారు'' అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా, తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తుందని, ఇందుకోసం మరోసారి కూడా రచ్చబండను చేపడుతుందని ప్రకటించారు. 


దివంగత సీఎం వైఎస్ ప్రారంభించిన కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, వాటిని పూర్తిచేసేందుకే తనను సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ నియమించారని ఆయన చెప్పారు. గురువారం కర్నూలు ఏపీఎస్పీ మైదానంలోను, మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం సింగాయపల్లిలో నిర్వహించిన రచ్చబండ, బహిరంగ సభల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరోసారి చెప్పడంతో పాటు.. రచ్చబండను వ్యతిరేకించే పార్టీలపై నిప్పులు చెరిగారు. సింగాయపల్లి సభలో సంక్షేమ పథకాలను వివరించి.. చివరగా పేదలకు ఇన్ని పనులు చేస్తే పొరపాటా? అన్నారు. సభకు వచ్చిన మహిళలతో చేతులెత్తించి ఇదే వారికి సమాధానమన్నారు.

మహిళలు తెలివైనవారని సీఎం ప్రశంసించారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు వారి నియంత్రణలోనే ఉంటాయని, వృథా ఖర్చులు చేయబోరనే ఇళ్లు, భూములు వారిపేరుతో ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని, వచ్చే మూడేళ్లలో వీటిని చేపట్టేందుకు ప్రత్యేక ప్యాకేజీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ, జడ్పీ ఛైర్మన్ దామోదర్‌రెడ్డి, ఎంపీ మంద జగన్నాథం, కలెక్టర్ పురుషోత్తంరెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 


ఇక కర్నూలు సభలో మాట్లాడిన సీఎం.. 2009 ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే వైఎస్ రచ్చబండను రూపొందించారన్నారు. దీన్ని ప్రారంభించేలోపే ఆయన మృతిచెందడంతో.. తాను మొదలుపెట్టానన్నారు. పథకాల రూపకల్పనకు వైఎస్‌కు సలహాలిచ్చే కమిటీలో తానూ ఒకడిని చెబుతూ.. మహిళలకు పావలావడ్డీ ప్రవేశపెట్టడంలో తానూ ఒక సలహాదారుడినని వివరించారు. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్.. ఇలా అందరినీ అందించిన జిల్లా కర్నూలేనన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రికి నిధులు, ఒక మైనారిటీ కళాశాల, దివంగత సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి పేరుతో కల్చరల్ ఆడిటోరియం మంజూరు చేస్తానన్నారు.


సభలో మండలి చైర్మన్ చక్రపాణి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహనరెడ్డి పాల్గొన్నారు. కాగా.. వరద బాధితుల సహాయార్థం కర్నూలు శివారులోని జగన్నాథగట్టులో గృహనిర్మాణ శాఖ, టీవీ9 సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరద బాధితులకు మీడియా చేయూత అభినందనీయమన్నారు. 

మళ్లీ వస్తా...అభివృది చూస్తా!

"మరిచిపోలేని విధంగా కర్నూలు జిల్లా వాసులు నన్ను ఆహ్వానించారు. ఇక్కడ రూ. 7,444 కోట్లతో జలయజ్ఞం పనులు జరుగుతున్నాయి. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. మూడునెలల్లో హంద్రీనీవా సుజలస్రవంతి మొదటి దశ పనులు పూర్తి చేసి అనంతపురానికి నీరిస్తాం. ఆ తరువాత నేను మళ్లీ జిల్లాకు వస్తా. జరిగిన అభివృద్ధిని చూస్తా..''నని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

గురువారం జూపాడుబంగ్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకుని కర్నూలులోని ఏపీఎస్పీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాకు చెందిన మంత్రి టీజీ వెంకటేష్, ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అభ్యర్థన మేరకు సీఎం కర్నూలుకు వరాలు కురిపించారు. కర్నూలు పెద్దాసుపత్రి అభివృద్ధికోసం ఆయన తనవంతు కృషి చేస్తానన్నారు. భవనాల మరమ్మతులకోసం ప్రస్తుతం టీజీ అడిగిన రూ. 20 కోట్లను మంజూరు చేస్తామన్నారు. తెలుగుగంగ, గురురాఘవేంద్ర, సిద్దవరం, హంద్రీనీవా, గాలేరు నగరి, పులికనుమ వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వీటివల్ల జిల్లాలో అదనంగా మూడున్నర లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు.

జిల్లాలో నదులున్నా నీటిని వినియోగించుకునే పంపుసెట్లు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. జరిగిన ఆరేళ్ల కాలంలో ఉచిత కరెంటుకోసం రూ.29,500 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేశామన్నారు. ఉపాధి హామీ ద్వారా వచ్చే మార్చి నాటికి రూ. 7,500 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పావలా వడ్డీకింద కర్నూలు జిల్లాకు ఆరేళ్లలో రూ. 32కోట్ల 60 లక్షలు మంజూరు చేశామన్నారు. వచ్చే 15 రోజుల్లో మరో రూ. 22 కోట్లు ఇవ్వనున్నామన్నారు. ఈ యేడాది మార్చినాటికి రావాల్సిన నిధులను ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ పథకాన్ని రైతు పనులకు అనుసంధానంచేసే ఆలోచనలో ఉన్నామని, కేంద్రానికి ప్రతిపాదన పంపామని చెప్పారు. కేంద్రాలని ప్రధాని, రాష్ట్రపతి వంటి వారిని అందించిన జిల్లాను సీఎం పొగడ్తలతో ముంచెత్తారు.

మంత్రుల చేతుల్లోనే కర్నూలు అభివృద్ధి జిల్లా అభివృద్ధి మంత్రులిద్దరి చేతుల్లోనే ఉంద ని సీఎం కిరణ్ చమత్కరించారు. కర్నూలు ఆస్పత్రి గురించి ఆయన మాట్లాడుతూ మంత్రి టీజీ వెంకటేష్ ఫైలు ప్రభుత్వానికి పంపానని చెప్పడం ఏమిటన్నారు. ఆయనే ప్రభుత్వంలో కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్నారని, మంత్రులు టీజీ, ఏరాసు జిల్లా అభివృద్ధి ప్రణాలిక ఫైళ్లను నడిపించుకుని పనులు చేయించుకోవాలని సూచించారు.

గుర్తుంచుకునేలా చేయండి : టీజీవీ కర్నూలు జిల్లా ప్రజలు గుర్తుంచుకునేలా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ సీఎంను కోరారు. బహిరంగ సభకు అధ్యక్షత వహించిన ఆయన ముందుగా సీఎం దృష్టికి పలు సమస్యలను తెచ్చారు. రద్దుచేసిన రేషన్ కార్డుల్లో అర్హులైన వారికి పునరుద్దరించాలని కోరారు. ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేయాలని, ఇళ్లనిర్మాణాల విషయంలో ఉన్న కోర్టు కేసులు తొలగిపోయేలా చూడాలన్నారు.

వరదబాధితులకు పరిహారంకోసం నిధులు మంజూరు చేయాలని అడిగారు. కర్నూలు పెద్దాసుపత్రి ఆధునికీకరణకోసం రూ. 169 కోట్లతో మాస్టర్‌ప్లాన్ తయారు చేశామని అందుకు నిధులు సమకూర్చాలని కోరారు. ప్రస్తుతం భవనాల ఆధునికీకరణకోసం రూ. 20 కోట్లతో ఫైలు పంపించామని పరిశీలించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లలో ఒకటైన కర్నూలు ప్రెస్ భవనం శిథాలావస్థలో ఉందని, దానిని అభివృద్ధి పరచాలని కోరారు.

రైతులను కాపాడండి : ఎంపీ కోట్ల కర్నూల రైతులను కాపాడాలని ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సీఎంను కోరారు. ఎల్లెల్సీ కాలువపై ఆధారపడి సేద్యం చేస్తున్న రైతులు కర్నాటక రైతుల జల చౌర్యంతో కుదేలవుతున్నారన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కిరణ్‌ను కోరారు. రంగాపురం వద్ద 8 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మిస్తే లిఫ్టు ద్వారా రైతులకు కొంత ఊరట కలిగించవచ్చని చెప్పారు.

తన తండ్రి పేరుతో కల్చరల్ ఆడిటోరియం నిర్మాణ మంజూరును ప్రకటించాల్సిందిగా కోట్ల సీఎం చెవిలో చెప్పి ఒప్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్, ఇన్‌చార్జి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, కోట్ల సుజాతమ్మ, డీసీసీ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, జిల్లా నాయకులు ఎస్వీమోహనరెడ్డి, సుధాకరబాబు, కలెక్టర్ రాంశంకర్ నాయిక్, జేసీ బుద్ధప్రకాష్, డీఆర్వో సూర్యప్రకాష్, అదనపు ఎస్పీ రవీంద్ర నాయిక్, డీఆర్‌డీఏ పీడీ సోనీబాలాదేవి పాల్గొన్నారు.
Click Here!

జిల్లా పర్యటన ఆనందం కలిగించింది

రచ్చబండలో భాగంగా జిల్లాలో పాల్గొన్న కార్యక్రమాలు ఆనందాన్ని కల్గించాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం 10:35 గంటలకు జూపాడుబంగ్లా జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయన్ను ఆందోళనకారులు చుట్టుముట్టినా కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. 98 జీవో ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ ముంపు బాధితులకు ఉపాధి చూపాలని, 2008 డీఎస్సీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, బుడగ జంగాలకు జీవో నెం 144 చూపి ఎలాంటి అభివృద్ధి లేకుండా చూపుతున్నారంటూ నిరసనకు దిగారు.

అక్కడ నుంచి 11:45 గంటలకు అక్కడ నుంచి బయల్దేరి 12:05 గంటలకు కర్నూలు ఎస్ఏపీ క్యాంప్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుని టీజీవీ అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన సభ ద్వారా కర్నూలు నగరానికి వరాల జల్లులు ప్రకటించారు. సభ అంత హర్షధ్వానాల మధ్య సాగింది. పెద్దాసుపత్రికి ప్రత్యేక నిధులు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పేరుతో కల్చరల్ ఆడిటోరియం, మైనార్టీ కళాశాల, జిల్లాలో జలయజ్ఞం కింద చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేస్తాను. వాటి పురోగతి కోసం మరో మూడు నెలల్లో జిల్లాలో పర్యటిస్తానని చెప్పడంతో సభ వీలలకేకలతో మార్మోగింది. ఇద్దరు జిల్లా మంత్రులు జిల్లాకు అవసరమైన పనులకు సంబసందించి వారే నిర్ణయం తీసుకుని ఫైలు తనదాకా తీసుకుని వస్తే కళ్లుమూసుకుని సంతకం చేస్తానన్నారు.

ఈ సందర్బంగా గ్రామీణ, పట్టణ వికెపి సంఘాలకు బ్యాంకు రుణాలు, పావలా వడ్డి నిధులు రూ.42 కోట్లు ఆర్థిక సహాయాన్ని సీఎం పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుంచి 1:10 గంటలకు ఎస్ఏపీ క్యాంప్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా బయల్దేరి జగన్నాథగట్టు వద్ద ప్రభుత్వం, మరియు టీవీ 9 సంయుక్తంగా నిర్మించిన వరద పునరావాస కాలనీ చేరుకుని టీవీ9 ప్రజానగర్ కాలనీని ప్రారంభించారు.

అక్కడే భోజనం చేసుకుని 2:35 గంటలకు మహబూబ్‌నగర్‌లో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్ ద్వారా వెళ్లిపోయారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఏరాసు, విజయరామరాజు, టీజీ వెంకటేష్, శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్, ఎంపీ కోట్ల, జడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి వీడ్కోలు పలికారు.
Click Here!

వరద బాధితులకు మీడియా చేయుతఅభినందనీయం:సీఎం

వరద బా«ధితుల కోసం టీవీ-9 చానల్ పక్కా గృహాలను నిర్మించి ఇవ్వడం అభినందనీయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం నగర శివారులోని జగన్నాథగట్టులో టీవీ-9 ప్రజానగర్‌లో నిర్మించిన ఇళ్లను ప్రారంభించి బాధితులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఇళ్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాగునీరు, రోడ్లు, మురికి కాల్వలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాలనీ నిర్మాణం కోసం సహకరించిన కలెక్టర్ రాంశంకర్‌నాయక్‌ను వివిధ విభాగాల అ«ధికారులను ఆ సంస్థ సీఈవో రవిప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ రజనీకాంత్ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం మొక్కలను నాటి ఆ తర్వాత శిలాఫలకాన్ని ఆవిష్కరించి లబ్ధిదారులనుద్దేశించి కాసేపు మాట్లాడారు.


కొత్త కర్నూలు నేటితో జాతికి అంకితం - టీవీ9 సీఈవో రవిప్రకాష్ టీవీ-9 ప్రజానగర్ ద్వారా కొత్త కర్నూలు ఏర్పాటైందని టీవీ9 సీఈవో రవిప్రకాష్ అన్నారు. మోడల్ కర్నూలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. 400 ఇళ్లు పూర్తి చేయగలిగామని, రెండో విడతగా మరో 750 ఇళ్లను నిర్మించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

పాలమూరుకు వరాల జల్లు

రెండునెలల వ్యవధిలో జిల్లాకు రెండోసారి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రచ్చబండ సందర్భంగా వరాల జ ల్లు కురిపించారు. తాను సీఎంగా ఉ న్నంతకాలం, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తూ, జిల్లామంత్రులు ప్రస్తావించిన అన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించారు. గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు కోడేరు మండలం సింగాయిపల్లికి చేరుకున్న సీఎం, ఇక్కడ రెండు గంటల పాటు గడిపారు.
దాదాపు అరగంటపాటు రచ్చబండలో పాల్గొన్న ఆయన, మరో గంటపాటు బహిరంగసభలో పాల్గొన్నారు. ఇందులో, ఆయన ప్రసంగం పావుగంట సాగింది. రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ, ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. బహిరంగసభలో జిల్లా మంత్రులు, ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై సీఎం ప్రకటన చేశా రు. జిల్లా నాయకులు తనకు అత్యంత సన్నిహితులని పేర్కొంటూ, సీఎంగా, ఎంత అభివృద్ధి వీలయితే అంతమేర చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భం గా, మహిళా స్వయం సహాయక సం ఘాలకు రూ. 530 కోట్ల చెక్కును అందజేశారు

. అంతకుముందు, బహిరంగసభలో దేవాదాయశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, పేదలకు కొత్తగా 54వేల ఇళ్లు మంజూ రు చేసినట్లు చెప్పారు. వెనుకబడిన ప్రాంతమైన జిల్లాను గతంలో చంద్రబాబు దత్తత తీసుకున్నట్లు ప్రకటించినా, ఆయన మాటలు కోటలు దాటలేదని ఎద్దేవా చేశారు. జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు మరో 20శాతం మేర నిధులు వెచ్చిస్తే, 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనికోసం చర్యలు తీసుకోవాలని సీఎంను అభ్యర్థించారు.

సోమశిల-సిద్ధేశ్వరం బ్రిడ్జి పనులు సగంలో ఆగిపోయాయని, దీనిని పూర్తిచేయాలని, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా పానగల్, కోడే రు మండల ప్రాంతవాసులకు కూడా ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోడేరు, పి.కె.పల్లిలో జూనియర్ కాలేజీలు, నాగర్‌కర్నూలు-కొల్లాపూర్ రహదారి విస్తరణ, కొల్లాపూర్ ప్రాంతంలో పీజీ కాలేజీ మంజూ రు చేయాలని కోరారు. ఎంపీ మంద జగన్నాథ్ మాట్లాడుతూ, కరవు జి ల్లాకు సీఎం కిరణ్, నెలరోజుల్లో రెండోసారి రావడం అభినందనీయమన్నారు

. జిల్లాలో సాగునీటి అవశ్యకత దృష్ట్యా, పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలని, కొల్లాపూర్-నంద్యాల రైల్వే లైను కోసం అవసరమయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున వ్యయం భరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సీఆర్ఎఫ్, పీఎంజిఎస్‌వైల్లో జిల్లాకు అన్యాయం జరుగుతోందని, వీటికి పెద్దఎత్తున నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ, జిల్లాలో తొమ్మిది డిగ్రీ కాలేజీలు మంజూరు చేసినా, వాటికి భవనాలు లేవని అన్నారు. ఈ భవనాలు మంజూరు చేయాలని, జిల్లా ప్రభుత్వాసుపత్రిని 350 పడకలకు పెంచాలని సీఎంను అభ్యర్థించారు.

ఈ ప్రతిపాదన ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో రోడ్లు అధ్వానం గా మారాయని, ముఖ్యంగా వరదలతో భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వీటికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడు తూ, ప్రజా సమస్యల పరిష్కారానికే ర చ్చబండ చేపట్టామని అన్నారు. సమావేశంలో, జడ్పీ ఛైర్మన్ కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్.రాజేశ్వర్‌రెడ్డి, అబ్ర హాం, ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీ విఠల్‌రావు, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ వీరారెడ్డి, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, జిల్లా కలెక్టర్ ఎం.పురుషోత్తంరెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.చిరంజీవులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Thursday, January 27, 2011

.. అదే శ్రీరామ రక్ష

 
సాంకేతికంగా మైనార్టీలో కిరణ్ సర్కార్
అయినా మనుగడకు ముప్పు లేనట్టే

కాస్కో.. చూస్కో.. అన్నవాళ్లే కానీ..
(అ) విశ్వాసంపై సవాళ్ల అంతరార్థం ఇదే
ప్రత్యర్థుల అనైక్యతే పాలకపక్షం బలం
జగన్ శిబిరంలో తగ్గుతున్న ఎమ్మెల్యేలు
బల పరీక్షకు యువనేత వెనుకంజ
రాష్ట్ర రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి 
రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయంగా ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. సంఖ్యాపరంగా చూస్తే ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. కానీ ప్రభుత్వం పడిపోదు. కిరణ్ సర్కార్‌పై అటు ప్రధాన ప్రతిపక్షం .. ఇటు కాంగ్రెస్‌లోని ఓ వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. కానీ.. అవిశ్వాస తీర్మానం పెట్టవు. దమ్ముంటే విశ్వాస తీర్మానం పెట్టుకోండి అని జగన్ వర్గం.. చేతనైతే అవిశ్వాస తీర్మానం పెట్టండని ప్రభుత్వ వర్గం పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నాయి. కానీ ఎవరూ ఆ పని చేయరు.

కిరణ్ ప్రభుత్వాన్ని దించేయాలన్న కసి పీకలదాకా ఉన్నా జగన్ వర్గం ఆ సాహసం చేయలేకపోతోంది. తన వల్ల కాదని గట్టిగా నిర్ధారించుకుని చంద్రబాబును రెచ్చగొట్టే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. ప్రత్యర్ధుల బలహీనతలు కిరణ్ పాలిట వరాలుగా మారాయి. పిల్లి మెడలో గంట కొట్టేవారు కరువయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రెక్కల కష్టమని.. అందువల్ల దానిని 2014 వరకూ పడగొట్టబోమంటూ ఒకవైపు జగన్ వర్గ శాసనసభ్యులు ఘంటాపథంగా చెబుతూనే మరోపక్క దమ్ముంటే కిరణ్ సర్కారు విశ్వాస పరీక్షకు సిద్ధం కావాలని సవాల్ విసురుతున్నారు.

పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ ప్రకటనల నేపథ్యంలో విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనే ప్రశ్నకు .. తాము 2014 వరకూ ఈ ప్రభుత్వానికి కూల్చకూడదన్న నిర్ణయంతో ఉన్నందున తాము వ్యతిరేకంగా ఓటు వేయమని ఒకసారి, చూద్దాం.. అని మరోసారి చెప్పడం మినహా స్పష్టంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పలేకపోతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నమ్మకం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడం లేదన్న ప్రశ్నకు వైఎస్ కష్టంతో వచ్చిన ప్రభుత్వంపై ఆవిశ్వాసం ఎలా పెడతామని ప్రశ్నిస్తున్నారు.

కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయపార్టీని స్థాపించిన తర్వాతైనా కిరణ్ సర్కారును కూల్చేస్తారా అనే ప్రశ్నకు పార్టీ పెట్టాక జగన్ ఎలా అదేశిస్తే అలా చేస్తామని చెబుతున్నారు. ఒకే సమయంలో పరస్పర విరుద్ధంగా జగన్ వర్గ ఎమ్మెల్యేలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం జగన్ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం క్రమంగా తగ్గుతుండడమేనని అంటున్నారు. జగన్ విజయవాడలో జరిగిన లక్ష్య దీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలతో తన బల పరీక్ష చేశారు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు (పీఆర్పీ ఇద్దరు, టీడీపీ ఒకరు సహా) జగన్ వెంట నిలిచారు.

ఆ తదుపరి ఢిల్లీలో జరిగిన 'జల దీక్ష'లో ఆ సంఖ్య 24గా (పీఆర్పీ ఇద్దరు, టీడీపీ ఒకరు సహా) ఉంది. మొన్న పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. వైజాగ్‌లో జనదీక్ష చేశారు. ఆ దీక్షకు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. బుధవారం జగన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేవలం ఎనిమిది మందే పాల్గొన్నారు. మిగిలిన వారు వేర్వేరు కారణాల రీత్యా హాజరు కాలేక పోయారని జగన్ వర్గం చెబుతోంది. ఆ కారణాలేంటన్నది పక్కన పెడితే.. అటు జగన్ వర్గం ఎమ్మెల్యేలు సమావేశం అయిన రోజే.. ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ చేజారిపోయారు.

సీఎం కిరణ్‌కుమార్‌ను కలిసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావులు.. తాము కాంగ్రెస్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. వీరిద్దరినీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం వద్దకు తీసుకుపోయారు. అటు.. చిత్తూరు జిల్లాలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, పీ రవిలను బుజ్జగించే ప్రయత్నాలను మంత్రి రఘువీరారెడ్డి భుజాలకెత్తుకున్నారు. తనతో సీఎం నేరుగా మాట్లాడాలని కుతూహలమ్మ డిమాండ్ చేస్తే.. రవి మాత్రం మెత్తబడ్డారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రచ్చబండ కార్యక్రమంలో తొలి రోజు పలువురు జగన్ వర్గం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతితో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు కూడా.

ఇవన్నీ జగన్ బలం తగ్గుతున్నాయనేందుకు సంకేతాలుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా జగన్ వర్గం నుంచి రోజు రోజుకూ ఎమ్మెల్యేలు జారిపోతున్నారన్నది మాత్రం కనిపిస్తున్న వాస్తవం. అయితే.. బాహాటంగా 30 మంది వరకూ ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతు ఇస్తున్నారని, అంతర్గతంగా వారి సంఖ్య 50 వరకూ ఉంటుందని జగన్ వర్గం నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఆయన చెప్పినట్లు 50 మంది అవిశ్వాసం వ్యక్తం చేసినా కిరణ్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు టీడీపీ, టీఆర్ఎస్‌లు రాజకీయంగా అనుసరించే వ్యూహాలే ప్రధాన కారణం. రాజకీయంగా జగన్‌ను టీడీపీ వ్యతిరేకిస్తోంది.

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో జగన్‌కు టీఆర్ఎస్ సహకరించే పరిస్థితి లేదు. కిరణ్ సర్కార్‌పై పీకలవరకూ టీడీపీకి కోపం ఉన్నా.. జగన్ వర్గం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, అందుకు ఆ పార్టీ సహకరించదు. రాజకీయంగా జగన్‌కు టీడీపీ సహకరిస్తే భవిష్యత్‌లో జగన్‌పార్టీని విమర్శించే నైతిక హక్కును టీడీపీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పైగా దాని వల్ల రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. దీనికి తోడు జగన్ అక్రమాస్తులపై టీడీపీ పోరాటం చేస్తోంది. అందువల్ల జగన్ వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టినా అందుకు టీడీపీ ఏ మాత్రం సహకరించదు. ఇదే సమయంలో కిరణ్ సర్కారు కూలుతుందని.. మధ్యంతరం తప్పదని పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పరిస్థితీ ఇంచుమించు ఇదే విధంగా ఉంటుందని రాజకీయ వర్గాల ఉవాచ.

తెలంగాణ ఆకాంక్ష బలీయంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మధ్యంతరం వస్తే రాజకీయంగా టీఆర్ఎస్‌కు ఎంతో లాభిస్తుంది. అయితే.. కరడుగట్టిన సమైక్యవాదిగా ముద్ర పడ్డ జగన్‌వర్గం కిరణ్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడితే, ఆ తీర్మానానికి సానుకూలంగా ఓటు వేస్తే.. రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే వీలుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమైక్యరాష్ట్రాన్ని కోరుతూ రాసిన ప్లకార్డును లోక్‌సభలో టీడీపీ ఎంపీల చేతి నుంచి లాక్కొని మరీ ప్రదర్శించినందుకు జగన్‌ను తెలంగాణలో తిరగకుండా టీఆర్ఎస్ అడ్డుపడింది.

కాంగ్రెస్ నుంచి వేరుపడిన జగన్ సర్వ స్వతంత్రుడు. ఇదివరలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి అలా చేశానని చెప్పి జగన్ తప్పించుకునే వీలుంది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ నుంచి వేరుపడి సొంత పార్టీని పెడుతున్నందున జగన్ రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. తాను తెలంగాణకు సానుకూలమని బహిరంగంగా ప్రకటించనంతకాలం జగన్‌పై సమైక్య ముద్ర ప్రభావం గట్టిగా ఉంటుంది. సీమాంధ్ర ప్రాంతంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు అంగీకరించరు.

ఆయన అంగీకరించనంత కాలం టీఆర్ఎస్ బహిరంగంగా మద్దతును తెలిపేందుకు అవకాశం ఉండదు. జగన్‌వర్గం పెట్టే అవిశ్వాసానికి మద్దతును తెలిపితే.. గతంలో లోక్‌సభలో ప్లకార్డును ప్రదర్శించినందుకే.. తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వకుండా అడ్డుకుని, ఇప్పుడు ఎందుకు కలిసిపోయారో? లోపాయికారీ ఒప్పందం ఏమిటో? వివరించాలని తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు నిలదీసే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా కాస్త ఇబ్బందికరమైన పరిణామమే అయినందున టీఆర్ఎస్ కూడా మౌనం దాల్చే వీలుంది.

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు రాజకీయంగా తనకు సానుకూలంగా ఉండడంతో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నెత్తి కింద తడిగుడ్డ వేసుకుని హాయిగా ఉండే పరిస్థితులు కన్పిస్తున్నాయని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. అయినా సరే.. అంకెల పోరాటానికే పరిణామాలు దారి తీసినా.. పొరుగు రాష్ట్రాల అనుభవంతో గట్టెక్కే ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. అమీ తుమీకి సిద్ధమైనప్పుడు జగన్ వర్గంలోని కనీసం 20 మందిపై వేటు వేస్తే సభలో వాస్తవ బలం 273కు పడిపోతుంది. అంటే 137 అనేది మ్యాజిక్ ఫిగర్‌గా నిలుస్తుంది.

కాంగ్రెస్ బలం 135గా ఉంటుంది. అంటే మెజార్టీకి రెండు స్థానాలు తక్కువ. అయితే.. పీఆర్పీ నుంచి కనీసం 14 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు సర్కారును ఆదుకునేందుకు ఆస్కారం ఉంది. పైగా జగన్‌ను వ్యతిరేకించే విపక్షాలు సైతం కిరణ్ సర్కారును వ్యూహాత్మకంగా బయటపడేసినా ఆశ్చర్యం లేదు. ఈ లెక్కన చూస్తే బాలినేని చెప్పినట్లు 50 మంది ఎమ్మెల్యేలు జగన్ వర్గంలో చేరినా.. కిరణ్ కుర్చీలో ఏమాత్రం కదలికలు రావన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

కొసమెరుపు : సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తన సొంత బలంపైనే నిలబడుతుంది. కానీ రాష్ట్రంలో కిరణ్ సర్కారు విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంది. అసెంబ్లీలో సాంకేతికంగా జగన్ వర్గం ఎమ్మెల్యేల మద్దతుపైనా, రాజకీయంగా విపక్షాల పరోక్ష సహకారం మీద కిరణ్ సర్కార్ మనుగడ సాగిస్తుండటమే ఇక్కడ రాజకీయ వైచిత్రి!!
Click Here! 
(అ)విశ్వాసమా ? వినోదమా ?
assemblys
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస/విశ్వాస తీర్మాన వ్యవహారం చివరకు రాను రాను వినోదంగా మారేలా కని పిస్తోంది. దమ్ముంటే కిరణ్‌ తన ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాసం నిరూపించుకోవాలని జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సవాల్‌ చేశారు. దానికి స్పందించిన మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, పార్టీని సమర్థిస్తోన్న ఎమ్మెల్యేలు మాత్రం దమ్ముంటే మీరే అవిశ్వాస తీర్మానం పెట్టండని ప్రతి సవాల్‌ విసిరారు. వీటికంటే ముందు అసలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో ఉంటూ జగన్‌ను సమర్ధిస్తున్న ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేసి ఈ వివాదానికి తెరలేపారు.

తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అసలు పిల్లిమెడలో గంట కట్టేదెవరన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. తన తండ్రి ఏర్పాటుచేసిన ప్రభుత్వాన్ని తాను పడగొట్టనని, ఈ ప్రభుత్వం తన దయాభిక్షపైఆధారపడి పనిచేస్తుందని జగన్‌ చాలాకాలం క్రితమే ప్రకటించారు. జగన్‌ ప్రకటన అటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇటు మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. జగన్‌ వెంట తిరుగుతున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయకుండా , పార్టీని విమర్శించడం అనైతికమని ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యాఖ్యానించారు. మంత్రి డీఎల్‌ మరో అడుగు ముందుకేసి, జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని సవాల్‌ విసిరారు. తాము దేనినయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

తాజాగా బుధవారం జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎల్పీ సాక్షిగా.. సీఎం కిరణ్‌కు సరికొత్త సవాల్‌ విసిరారు. దమ్ముంటే కిరణ్‌ తన ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష పెట్టుకోవాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందని సీఎంకు నేరుగా సవాల్‌ విసిరారు. అసలు ఈ వివాదం అంతా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ అవగాహనా రాహిత్యం వల్ల మొదలయిందన్న భావన పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న సమయంలో, ఎమ్మెల్యేలు నిలువునా చీలిపోయిన వాస్తవం తెలిసి, తాను ఈ సంక్షోభాన్ని నివారించలేనని తెలిసినప్పటికీ ి రణ్‌ ఈవిధంగా జగన్‌ను, ఆయన వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం రాజకీయ అవగాహన, అనుభవ రాహిత్యమేనని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వివాదాన్ని చల్లార్చవలసిన బాధ్యత గల ముఖ్యమంత్రే దానిని మరింత పెద్దది చేయడం వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వానికే నష్టం వస్తుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని డిమాండ్‌ చేయడం, చేతులారా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్వాగతించడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. కిరణ్‌ ప్రకటనలు హాస్యాస్పదంగా, రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వారిలా ఉన్నాయంటున్నారు.

ఈ పరిణామాలను లోతుగా పరిశీలిస్తే.. అసలు పిల్లిమెడలో గంటకట్టేదెవరన్న ప్రశ్న తెరపైకొస్తోంది. జగన్‌ వర్గం దమ్ముంటే మీపై విశ్వాస పరీక్ష పెట్టుకోమని సవాల్‌ విసురుతుందే తప్ప, తమంతట తాము అవిశ్వాసం పెడతామని చెప్పడం లేదు. పైగా ఈ వ్యవహారంతో సంబంధం లేని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని తెరపైకి తెచ్చి దానిని ఇరికించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని నిలదీస్తోంది. దీన్ని బట్టి బాబు-కిరణ్‌ మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్‌ ఉందన్న ప్రచారం చేస్తోంది. ఈ వాదన అర్థరహితమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అటు కిరణ్‌, మంత్రులు కూడా దమ్ముంటే అవిశ్వాస పరీక్ష పెట్టమని సవాల్‌ విసురుతున్నారే గానీ, తాము విశ్వాస పరీక్ష కోరతామని ఎక్కడా చెప్పడం లేదు. ఒకవేళ జగన్‌ వర్గం అవిశ్వాసతీర్మానం పెడితే.. ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా అనర్హులవుతారు. పార్టీ విప్‌ను ధిక్కరిస్తే పదవి కోల్పోతారు. మరో మూడేళ్లు ఎమ్మెల్యే పదవులను వదులుకునేంత ధైర్యం జగన్‌ వర్గం ఎమ్మెల్యేలలో కనిపించడం లేదు. ప్రభుత్వం కూడా విశ్వాస పరీక్ష జరిపించుకుని, సమస్యలు కొని తెచ్చుకునే సాహసం చేయదు.మరికొద్దికాలం పాటు ఇలాగే ఇరు వర్గాలు సవాళ్లు, ప్రతి సవాళ్లతోనే కాలక్షేపం చేయడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జగన్‌ గట్టిగా భావించినప్పుడు మాత్రమే ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటాయి తప్ప, అప్పటివరకూ అంతా మీడియా హడావిడి తప్ప మరేమీ ఉండదని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. దీన్ని బట్టి.. ప్రభుత్వం గానీ, జగన్‌ వర్గం గానీ విశ్వాస/అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టబోరని స్పష్టంగా తేలిపోతుంది.

Wednesday, January 26, 2011

కిరణ్‌ టానిక్‌ !

kiran-rachha
వైఎస్‌ రాజశేఖర రెడ్డిని, ఆయన కుమారుడు, కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ ముఖ్య మంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏదో యథాలాపంగా చేస్తున్నవి కావని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వరుస దీక్షలతో కాంగ్రెస్‌ శిబరంలో కల్లోలం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న జగన్‌ను, ఆయన శిబిరాన్ని చూసి శ్రేణులు ఆందోళన, భయం చెందకుండా ఉండేందుకే కిరణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఎదుటి పక్షాన్ని ఆత్మ రక్షణలో పడవేయటం ద్వారా శ్రేణుల్లో స్థయిర్యం నింపే ప్రయత్నాలను కిరణ్‌ ప్రారంభించినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు మొట్ట మొదటిసారి జగన్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యక్ష వ్యాఖ్యలు చేసిన జగన్‌, రచ్చబండ కార్య క్రమం సందర్భంగా విశాఖ వెళ్ళినప్పుడు కార్యకర్తల పరిచయ కార్యక్రమ సమావేశంలో వాటిని మరింత తీవ్రతరం చేశారు. తాను బలహీనుడైన ముఖ్యమంత్రిని అని, అధి ష్ఠానం చెప్పినట్టు వినే కీలుబొమ్మనని జగన్‌ వర్గం నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకుఇక అన్ని అవకాశాలనూ అందిపుచ్చుకోవాలని కిరణ్‌ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ యాత్ర సందర్భంగా తన ప్రభుత్వం ఎవరి దయా దాక్షిణ్యాలపైనా ఆధారపడి లేదని, నైతి కత ఉంటే జగన్‌ నిర్వహించే కార్యక్రమాలకు హాజ రయ్యే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి వెళ్ళవచ్చునని కిరణ్‌ సవాల్‌ విసిరారు. జగన్‌ పార్టీకి ఏమి సేవ చేశారని ప్రశ్నించారు.

వైఎస్‌ కుటుంబం యావత్తూ పద వులు దక్కినందుకు పార్టీకే రుణపడి ఉండా లని మరో బాణం విసిరారు. ఈ సవాల్‌ను జగన్‌ వర్గం స్వీకరించలేక పోయింది. అందుకు బదులుగా చేతనైతే బహిష్కరించుకోవచ్చునని పెదవి చాటు మాటలు పలికింది తప్ప తమ వర్గానికి ఏదైనా చేయగల ధైర్యం ఉందని నిరూపించుకోలేక పోయింది. ఫలితం ఏదీ తేలక పోయినా తన ప్రభుత్వాన్ని పడవేయగలిగినంత సత్తా జగన్‌ వర్గం ఎమ్మెల్యేలకు లేదన్న వాస్తవం పార్టీ శ్రేణులకు వెళ్ళేలా చేయటంలో కిరణ్‌ విజయం సాధించగలిగారు. ఈ సవాల్‌ విసరటం ద్వారా జగన్‌ వర్గం ఎమ్మెల్యేలలో నైతికత లేదని, వారు రాజకీయ స్వార్థంతోనే అటువైపు వెళ్ళారన్న సంకేతాలను జనంలోకి తీసుకు వెళ్ళటంలోనూ కిరణ్‌ నెగ్గుకు రాగలిగారు.

తాజా వ్యాఖ్యల తీవ్రత అధికం...
ఇక తాజాగా కిరణ్‌ మరింత ముందుకు పోయి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన దివంగత వైఎస్‌తో పాటు జగన్‌ను సూటిగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు, వ్యాఖ్యలు వదిలారు. తాను 20 సంవత్సరాల పాటు కష్టపడితే తప్ప ముఖ్యమంత్రిని కాలేదంటూ జగన్‌లో ఆ ఓపిక లేదని, ఉన్నపళంగా గద్దె ఎక్కాలన్న ఆదుర్దా తప్ప ఆయనలో మరొకటి లేదన్న అభిప్రాయాన్ని కార్యకర్తల్లోకి చొప్పించే ప్రయత్నం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వద్ద తానే అపాయింట్‌మెంట్‌ ఇప్పించానని చెప్పటం వాస్తవం అయినా కాకపోయినా తమది ఆది నుంచీ రాజకీయాలతో, కాంగ్రెస్‌తో పెనవేసుకుపోయిన కుటుంబం అని, అంత తక్కువ అంచనా వేయటానికి వీలు లేదని చెప్పే ప్రయత్నం చేశారు.

ఉద్దేశ పూర్వకంగానే...
ఒక ఎమ్మెల్యే హత్య కేసులో ముద్దాయిగా పేర్కొన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ విమర్శల నుంచి రక్షించటానికి శాసనసభలో 60 రోజుల పాటు శ్రమించానన్నది కిరణ్‌ ప్రధాన వ్యాఖ్య. అప్పట్లో చీఫ్‌ విప్‌గా ఉన్న ఆయన జగన్‌ పక్షాన గట్టిగా వాదించిన మాట నిజమే...అయితే చీఫ్‌విప్‌గా అది తన బాధ్యత అయినప్పుడు దాన్ని ఇంతకాలం తర్వాత శ్రేణుల ముందు బయట పెట్టటం ద్వారా కిరణ్‌ ఉద్దేశ పూర్వకంగానే జగన్‌ను ఆత్మరక్షణలో పడవేసే ప్రయత్నం చేశారు. జగన్‌ను ముద్దాయి అని పేర్కొనటం ద్వారా విపక్షాలకు ఉప్పు అందించి ఆయా పార్టీల నాయకత్వాలు జగన్‌ను కడిగి పారేసేందుకు సహకరించటం సైతం కిరణ్‌ వ్యూహంలో భాగమే అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అంతా కిరణ్‌ అనుకున్నట్టే జరిగింది. ఈ వ్యాఖ్యలు పత్రికల్లో వెలువడ్డాయో లేదో టీడీపీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు, జగన్‌పై ఆరోపణలను తీవ్రం చేశారు. గుంటూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మాట్లా డుతూ కిరణ్‌ వ్యాఖ్యల ద్వారా పరిటాల రవి హత్య వెనుక జగన్‌ ప్రమేయం ఉన్నట్టు స్పష్టమైందని సంచలన వ్యాఖ్య చేశారు. కిరణ్‌ వ్యాఖ్య సహజంగానే జగన్‌ శిబిరంలో కలకలం సృష్టించింది. ఆయన వర్గం నేతలు అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు లాంటి వారు హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాటిని ఖండించేందుకు శతవిధాల ప్రయత్నించారు.

మరో సంచలన వ్యాఖ్య...
జగన్‌పై చేసిందే సంచలన వ్యాఖ్య అయితే కిరణ్‌ ఆ వెనువెంటనే మ రో బాంబు పేల్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రచ్చబండ బయ లుదేరే సందర్భంగా తనను ఏదో పని చేయమని అడిగారని, నిబంధన లు అంగీకరించవంటూ దాన్ని తాను తిరస్కరించానని చేసిన వ్యాఖ్య సహజంగానే సంచలనం రేకెత్తించింది. ఆ పని ఏమై ఉంటుందన్న చర్చ అంతటా ప్రారంభమైంది. దీనిపై సైతం జగన్‌ వర్గం స్పందించిం ది. కిరణ్‌ చెప్పిన మాటలను బట్టి వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై అను మానాలు వస్తున్నాయని, ఆయనను సైతం విచారించాలని డిమాండ్‌ చేసింది.

మరిన్ని సంచలనాలు?...
కిరణ్‌ వైఖరి చూస్తుంటే ఇక తాను సుతి మెత్తగా వ్యవహరిస్తే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టం అవుతున్నది. మున్ముందు పార్టీ కార్యకర్తల సమావేశాలలో మరిన్ని సంచలన వ్యాఖ్యలను సంధించటం ద్వారా శ్రేణుల్లో మనోబలం నింపటం, స్థయిర్యం చేకూర్చి పార్టీని అంటిపెట్టుకుని ఉంచే ప్రయత్నం చేయటాన్ని కిరణ్‌ తీవ్రతరం చేయనున్నారు. అదే సమయంలో జగన్‌ వర్గాన్ని పూర్తి ఆత్మరక్షణలో పడవేయటం ద్వారా వారి స్థయిర్యాన్ని దెబ్బ తీసే వ్యూహాన్ని సైతం కిరణ్‌ అమలు చేయనున్నట్టు విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశం స్పష్టం చేసిందని సీనియర్‌ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tuesday, January 25, 2011

మా రచ్చబండకు వైఎస్సే స్ఫూర్తి రూ. 2500 కోట్లతో 26 లక్షల కుటుంబాలకు లబ్ధి

నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం
రచ్చబండ సభావేదికపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించిన రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన స్ఫూర్తితోనే ప్రారంభించామని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆయన సోమవారం ఉదయం 11.45కు శ్రీకాకుళం జిల్లా రాజాం పరిధిలోని డోలపేట జడ్పీ హైస్కూలు వద్ద రచ్చబండను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ 90% లక్ష్యాలు సాధించామన్నారు.

మిగిలిన 10% మందికీ పథకాలు అందాలనే లక్ష్యంతోనే రచ్చబండ నిర్వహిస్తున్నామన్నారు. తన తండ్రి అమర్‌నాధ్‌రెడ్డి 1978 నుంచి 82 వరకు ఈ జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని, ఆ అనుబంధం తాను మరిచిపోలేనిదని.. అందుకే శ్రీకాకుళం జిల్లా నుంచే రచ్చబండ ప్రారంభించానని చెప్పారు. రాష్ట్రంలో 1.92 కోట్ల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉన్నాయని, రచ్చబండ ద్వారా 5.70 లక్షల కుటుంబాలకు కొత్తగా కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. 82 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటికి 51 లక్షలు పూర్తయ్యాయని, 14 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, ఇవిగాక రచ్చబండ ద్వారా 4.70 లక్షల ఇళ్లను మంజూరుచేస్తున్నామని చెప్పారు.

అభయహస్తంలో 43 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, మరో 14 లక్షల మంది సభ్యులుగా చేరనున్నారని తెలిపారు. రచ్చబండ ద్వారా రాష్ట్రంలోని 26 లక్షల కుటుంబాలకు రూ. 2500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. రాజాం బస్టాండ్ వద్ద జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ 2004కు ముందు వైఎస్ఆర్‌తో కలిపి తాను, ధర్మాన, శతృచర్ల వంటి నేతలంతా ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠతకు కృషిచేసి అధికారంలోకి తేగలిగామని చెప్పారు. వైఎస్ స్ఫూర్తి మేరకే రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదన్నారు.

ఈ కార్యక్రమాల్లో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కె.పార్థసారధి, శతృచర్ల విజయరామరాజు, ప్రభుత్వ విప్ కోండ్రు మురళీమోహన్, విజయనగరం, శ్రీకాకుళం ఎంపీలు బొత్స ఝాన్సీలక్ష్మి, కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీలు మజ్జి శారద, హరిబాబునాయుడు, శ్రీనివాసులునాయుడు, ఎమ్మెల్యేలు కొర్ల భారతి, జుత్తు జగన్నాయకులు, బొడ్డేపల్లి సత్యవతి, నిమ్మక సుగ్రీవులు, మీసాల నీలకంఠం, ధర్మాన కృష్ణదాస్, అధికారులు పాల్గొన్నారు.

పేదల కోసమే

"రచ్చబండను రాజకీయాల కోసం నిర్వహించడం లేదు. కండబలం లేని, నిస్సహాయులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందట్లేదని, వారింటికి వెళ్లి సంక్షేమ ఫలాలు అందించాలనే ప్రారంభించాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ప్రతిపక్షాలకూ ఉంది'' అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం గుసినిలో ఏర్పాటుచేసిన రచ్చబండను ఆయన ప్రారంభించారు. ఈ గ్రామాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందని, గ్రామంలో అమలైన పథకాల తీరు బాగా ఆకట్టుకుందని, ముఖ్యంగా గృహ లబ్ధిదారులు నిర్దేశించిన లక్ష్యానికి చేరువగా ఉన్నారని కొనియాడారు.

రచ్చబండ అంటే ఇలా ఉండాలన్నట్టు చెట్టు.. దాని చుట్టూ రచ్చబండ ఏర్పాటు బాగున్నాయని కితాబునిచ్చారు. రచ్చబండ, సభలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు అధ్యక్షత వహించగా, ఇన్‌చార్జి మంత్రి పినిపే విశ్వరూప్, బొత్స సత్యనారాయణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, అప్పలనరసయ్య, రాజన్నదొర, జయమణిలతోపాటు ఎమ్మెల్సీలు శ్రీనివాసులు నాయుడు, వాసిరెడ్డి వరదారామారావు, జడ్పీ చైర్మన్ చంద్రశేఖర్, డీసీసీ చైర్మన్ వీరభద్రస్వామి తదితరులు పాల్గొన్నారు.
Click Here!

రాజాంకు సీఎం వరాల జల్లు

రాజాం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోండ్రు మురళీమోహన్, విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలు సభావేదికగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే స్పందించిన సీఎం వాటిని పరిష్కరించేందుకు అంగీకరించి వరాల జల్లు కురిపించారు. స్థానిక మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటుకు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పార్థసారధి హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కూడా జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికి తాగునీరు అందేవిధంగా ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన రూ.39 కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేస్తానని చెప్పారు. రాజాం సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా స్థాయి పెంచేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. రూ.10 కోట్లు మంజూరు కూడా చేశారు. తోటపల్లి ప్రాజెక్టు 120 రోజుల్లోనే పూర్తయి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అవసరమైన రూ. 40 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పదివేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఎంపీ ఝాన్సీ కోరిక మేరకు మంజూరు చే సేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన సమస్యల జాబితాను పూర్తిస్థాయిలలో పరిశీలించి వీలైౖనంతమేరకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రూ.35 కోట్లుతో కలెక్టరేట్‌కు నూతన భవనం నిర్మించాలని కోరారని, అతను తన సొంత జిల్లా చిత్తూరుకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా వ్యవహరించి కలెక్టరేట్ భవనం నిర్మాణానికి కృషి చేశారని చెప్పారు.

ఆయన కోరిక మేరకు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ నూతన భవనానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే లైను, ఇతరత్రా సమస్యలను కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రచ్చబండ కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకారం చుట్టినందుకు అత్యధిక సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంద ని, అందరికి కృతజ్ఞతలని, ఈ ఉత్సాహంతో పనిచేస్తూ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నారు.
Click Here!
 వైఎస్‌కు మేమే వారసులం: విశాఖలో సీఎం
* వైఎస్ కుమారుడిపై ఖూనీ కేసు విషయంలో అసెంబ్లీలో టీడీపీకి సమాధానం చెప్పేందుకు 60 రోజులు చదివా..
*
ఎలా డిఫెండ్ చేస్తున్నావని వైఎస్ ఒక్క రోజు కూడా అడగలేదు.. నాపై ఆయనకు అంత నమ్మకం
*
వైఎస్ హెలికాప్టర్‌లో నేనూ వెళ్లాల్సి ఉంది.. ఆఖరి క్షణంలో నేను అందులో వెళ్లలేదు
*
ఢిల్లీతో నాకు సంబంధాలు లేవు.. నుదిటిపై రాసుంటేనే పదవులు
హత్యకేసునుంచి జగన్‌ను గట్టెక్కించా
rachaa
 ఓ హత్య కేసులో దివంగత వైఎస్సార్‌ తనయుడ్ని తాను గట్టెక్కించినట్టు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కు మార్‌రెడ్డి ప్రకటించి, సంచలనం సృష్టించారు. అసెంబ్లీలో తెలుగు దేశం పార్టీకి జవాబిచ్చేందుకు 60 రోజులు ప్రిపేరై ఎదురుదాడి చేసినట్టు ఆయన వివరించారు. హత్యకు సంబంధించిన సిబిఐ కేసుపై ఏ విధంగా ఆర్గనైజ్‌ చేస్తావంటూ, ఎలా డిఫెన్స్‌ చేస్తావనిగాని ఏ ఒక్కరోజూ కూడా వైఎస్సార్‌ అడగలేదని ఆయన గుర్తు చేశారు. అదేమంటే ప్రధాని తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వ లేదని జగన్‌ పదే పదే అంటూ దాన్నొక వివాదం చేస్తున్నారని, ముఖ్యమంత్రిగా వైఎస్‌కు, తనకు కూడా ప్రధాని అప్పాయింట్‌ మెంట్లు దొరకని సందర్భాలున్నాయని కిరణ్‌ అన్నారు.

సోమవారం సాయంత్రం అమ్‌కోసా హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తల సమా వేశంలో సిఎం మాట్లాడారు. ఐదేళ్ళు చీఫ్‌ విప్‌గా వున్న సమయంలో వైఎస్సార్‌పై ఈగ వాలి తే మాటల యుద్ధం చేశానన్నారు. దీంతో తాను శత్రుత్వం తెచ్చుకున్నానన్నారు. వైఎస్సార్‌ లాంటి నాయకుడ్ని, ఆయన కుటుంబంపై నమ్మకం పోగొడితే కాంగ్రెస్‌ పార్టీ బలహీ నపడుతుందని, తద్వారా దెబ్బతీయవచ్చన్న ప్రతిపక్షాల కుట్రను అసెంబ్లీలో బహిరంగంగా ఎదుర్కొన్నట్టు ఆయన వెల్లడించారు. రాజశేఖర్‌రెడ్డితో కలిసి 20 ఏళ్ళు పార్టీ అభివృద్ధికి అహోరాత్రులు కష్టపడిన తాము రాజకీయ వారసులమా? ఆయన కుటుంబమా? అని ప్రశ్నించారు.


1978 నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వైఎస్సార్‌ను ఇంత పెద్ద నాయ కుడ్ని చేసింది కాంగ్రెస్‌ పార్టీ, గాంధీ కుటుంబమేనని వివరించారు. అధిష్టానం మద్దతుతోనే వైఎస్సార్‌ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారన్న విషయాన్ని మరిచిపోకూ డదన్నారు. వేదికపై ఎమ్మెల్యేలుగా కూర్చొన్న అడ్రస్‌ పార్టీ ఇచ్చిందని, అటువంటి పార్టీని మరిచిపోతే అడ్రస్‌ లేకుండా పోతామన్నారు. ఇందిరాగాంధీ మృతి చెందాక కాంగ్రెస్‌ పని అ యిపోయిందన్నారని, అదే విధంగా రాజీవ్‌గాంధీ మృతి చెందాక అన్నారని, వైఎస్సార్‌ మృతి చెందాక కూడా కాంగ్రెస్‌ పని అయిపోయిందంటున్నారని, ఇది శోచనీయమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏ బూత్‌లో చూసినా 30 శాతం కాంగ్రెస్‌కు ఓటు వేసే వాళ్ళు వున్నార న్నారు. పార్టీపై వున్న అభిమానంతో ప్రజలు, కార్యకర్తలు ఓట్లు వేయడం వల్లే, కాంగ్రెస్‌ ఇం త బలంగా వుందన్నారు. పార్టీ దయతలచి తమకు టిక్కెట్‌ ఇస్తే ఎమ్మెల్యేలయ్యామని, మీరు కార్యకర్తలయ్యారన్నారు. నాయకుల వల్ల పార్టీ బతకడం లేదని, కార్యకర్తల వల్లే బతుకుతోం దని ఆయన వివరించారు. కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదని, నాయకులు లేకపోతే, మరో వందమంది కార్యకర్తలు నాయకులవుతారన్నారు. కొన్ని రోజులు పార్టీలో ఒడిదుడుకలుం టాయని, స్పీడ్‌ బ్రేకర్ల మాదిరిగా వస్తుంటాయని వాటిని త్వరలోనే దాటుతామని ఆయన అన్నారు.

 
 రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడిందనడం అపోహేనని, అలా ప్రచారం చేసి లాభపడాలని కొందరు చూస్తున్నారని.. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వారసులం తామేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకున్నారు. ‘‘వైఎస్ చనిపోయాక రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులేర్పడ్డాయి. వరదలు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అనిశ్చితితో పాటు వేర్పాటువాదం వంటి సమస్యలు తలెత్తాయి. పార్టీలో ఒడిదుడుకులు కొన్నాళ్లే.. స్పీడు బ్రేకర్ ఉన్నప్పుడు వేగంగా వెళ్తే ప్రమాదం. అందుకే నెమ్మదిగా దాటుతాం. పార్టీని కాపాడుకోలేకపోతే బొక్కబోర్లా పడతాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనటానికి విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి సోమవారం రాత్రి ఆంకోసా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిత్తూరు జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయల్దేరిన హెలికాప్టర్లో తానూ ప్రయాణించాల్సి ఉందని సీఎం తెలిపారు. ‘‘అదృష్టమో, దురదృష్టమో నేను ఆఖరి క్షణంలో ఆ హెలికాప్టర్‌లో వెళ్లలేదు. వైఎస్ నాకు ముందు రోజు రాత్రి ఫోన్ చేసి.. వీలుకాని ఒక పనిని అప్పగించారు. అది వ్యతిరేకమని భావించి నేను చేయలేనని చెప్పాను. దీంతో ఆ పని పెండింగ్‌లో పడింది. అందువల్ల ఆ హెలికాప్టర్లో వెళ్లలేకపోయాను’’ అని సుదీర్ఘంగా వివరించారు.


రాజీవ్, సోనియాగాంధీలకు వైఎస్ సన్నిహితంగా ఉన్నందువల్లే రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీతో తన శత్రుత్వం ఎవరికోసం అని కిరణ్ వ్యాఖ్యానించారు. ‘‘వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై, ఆయన కుటుంబంపై టీడీపీ ఇంత అభాండాలు వేస్తున్నారంటే.. వైఎస్ కుటుంబంపై ప్రజల్లో నమ్మకం పోగొడితే కాంగ్రెస్ వీకవుతుందని, కాంగ్రెస్‌ను దెబ్బతీయొచ్చని టీడీపీ, ఇతర పార్టీలు కుట్రపన్ని ఈ విధంగా చేస్తున్నాయని అసెంబ్లీలో బాహాటంగా చెప్పిన వ్యక్తిని నేను’’ అని వివరించారు. వైఎస్‌కు తనపై అపారమైన విశ్వాసం ఉండేదన్నారు.


‘‘రాజశేఖరరెడ్డి గారి కొడుకు ఒక ఖూనీ కేసులో ముద్దాయి అయితే.. అసెంబ్లీలో టీడీపీ వారికి సమాధానం ఇవ్వటం కోసం చదవటానికి నాకు 60 రోజులు పట్టింది. సీబీఐ ఎంక్వైరీ వేసి, అంత ప్రధానమైన కేసు ఆయన కొడుకుపై ఉంటే.. ‘ఆ కేసు విషయంలో సమాధానం చెప్పటానికి నువ్వు ఏవిధంగా రెడీ అవుతున్నావు?’ అని వైఎస్ నన్ను ఒక్క రోజు కూడా అడగలేదు. సొంత కొడుకు కేసు, సీబీఐ కేసు, మర్డర్ కేసు.. ఎలా డిఫెండ్ చేస్తున్నావని ఒక్క నిమిషం కూడా ఆయన నన్ను అడగలేదంటే నాపై ఎంత నమ్మకమో అర్థం చేసుకోండి’’ అని కార్యకర్తలను ఉద్దేశించి సీఎం పేర్కొన్నారు. అందువల్ల వైఎస్‌కు తామే వారసులమవుతామని చెప్పారు.


సీఎం కాకముందు సోనియాను 4 సార్లే కలిశా...

‘‘ఢిల్లీతో నాకు సంబంధాలు లేవు. సీఎం కాకముందు నేను సోనియాగాంధీని నాలుగు సార్లే కలిశాను. నా తండ్రికి పీవీ నర్సింహారావు, ఇందిరాగాంధీలతో సంబంధాలున్నాయి. దాంతో నేనే పీవీకి దగ్గరయ్యా. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వైఎస్‌కు కూడా నేనే అపాయింట్‌మెంట్ ఇప్పించా. అప్పట్లో ఎమ్మెల్యేగా ఎన్నికయిన నన్ను మంత్రివి అవుతావంటూ బెస్టాఫ్‌లక్ చెప్పారు. అలా చెప్పిన 20 ఏళ్లలో ఏనాడూ మంత్రిని కాలేకపోయాను. ఇప్పుడు ఏకంగా సీఎంనయ్యా. మంత్రి పదవినిచ్చి వుంటే నేను సీఎం అయ్యేవాణ్ణికాదేమో. వైఎస్ నన్ను స్పీకర్‌ను చేయడం వల్లే నేనీనాడు సీఎంనయ్యా. మన చేతుల్లో ఏమీ ఉండదు. నుదిటిపై ఏది రాసుంటే అదే అవుతుంది..’’ అని కిరణ్ వ్యాఖ్యానించారు. వైఎస్ దివంగతులయ్యాక రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడిందనడంలో వాస్తవం లేదన్నారు. గతంలో ఇందిరా, రాజీవ్‌గాంధీలు మరణించినప్పుడు కూడా అలాగే ప్రచారం చేశారన్నారు. తానెన్నటికీ వైఎస్ అభిమానినేనని చెప్పుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వట్టి వసంతకుమార్, ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్, తైనాల విజయకుమార్, మళ్ల విజయప్రసాద్, కన్నబాబు, ముత్యాల పాప, ఎమ్మెల్సీ సూరిబాబు, మేయర్ పులుసు జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.


Thursday, January 13, 2011

అస్థిరమే! అవును.. పరిస్థితి ఫ్లూయిడ్‌గా ఉంది.

ఎవరుంటారో, ఎవరు పోతారో? ఏం చేస్తే ఏమవుతుందో
ఆలోచించి అడుగు వేయాలి.. సరైన సమయంలో సరైన నిర్ణయం

ఎలా గెలిచారో వాళ్లు గుర్తుంచుకోవాలి
రాజకీయాలకే సరిపోతోంది
పాలనపై దృష్టి పెట్టలేకపోతున్నా
ఏం చేయాలో వంద రోజుల్లో నిర్ణయం
డీసీసీ అధ్యక్షుల భేటీలో సీఎం కిరణ్
మన కన్ను మనమే పొడుచుకోవద్దు
ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి
కర్తవ్య బోధ చేసిన డి. శ్రీనివాస్
హైదరాబాద్, జనవరి 12 : అవును... రాష్ట్ర కాంగ్రెస్‌లో అస్థిర పరిస్థితి ఉంది... ఎవరో కాదు! స్వయంగా ప్రభుత్వ సారథి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని అంగీకరించారు. వైఎస్ జగన్ వాడి, తెలంగాణ వేడి మధ్య పార్టీ నలిగిపోతున్నట్లు చెప్పకనే చెప్పారు. 'గీత దాటుతున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? జగన్‌కు బాహాటంగా మద్దతు ఇస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఎందుకు స్పందించడం లేదు?'' అని నిలదీసిన నేతలకు ముఖ్యమంత్రిగానీ, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌గానీ తగిన సమాధానమివ్వలేకపోయారు.

బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ), నగర కాంగ్రెస్ కమిటీ (సీసీసీ) అధ్యక్షుల సమావేశంలో కిరణ్, డీఎస్ పాల్గొన్నారు. వారికి పరిస్థితి వివరిస్తూ, కొంత ధైర్యం చెబుతూ, కర్తవ్య బోధ చేశారు. క్రమశిక్షణ చర్యలపై అధిష్ఠానం ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చెప్పారు. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఇవీ ఆ భేటీ వివరాలు... "ప్రస్తుతం కాంగ్రెస్‌లో అస్థిర పరిస్థితి (ఫ్లూయిడ్) ఉంది. ఎవరు ఉంటారో, ఎవరు వెళ్లిపోతారో తెలియడం లేదు'' అని ముఖ్యమంత్రి కిరణ్ పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీని ఎవరు వదిలి వెళ్లినా నష్టమేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 30 శాతం ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. పార్టీలో ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించి చేయాల్సి ఉంటుందని, ఎవరు ఎలా ఉంటారో చూడాల్సి ఉందని అన్నారు. జగన్ వైపు చూస్తున్న నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు. "ఎన్నికల సమయంలో టికెట్ ఇచ్చాకే వీరు ప్రజా ప్రతినిధులుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే జనం గెలిపించారని వీళ్లంతా గుర్తుంచు కోవాలి'' అని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలో వడపోత కార్యక్రమం ఉంటుందని కూడా తెలిపారు. ఊరూరా పార్టీకి కార్యకర్తలున్నారని, వారిని బలోపేతం చేసుకోవాలని సూచించారు.

"ఎమ్మెల్యేలు పోయినప్పటికీ... మేం కాంగ్రెస్‌లోనే ఉన్నామని జడ్పీటీసీ, ఎంపీటీసీలు చెబుతున్నారు. మన పార్టీని ఎవరూ దెబ్బతీయలేరు. విధానాలే ప్రజలను ప్రభావితం చేస్తాయి. వచ్చే వంద రోజుల్లో ఏం చేయాలో నిర్ణయిస్తాం. పార్టీ ద్వారా వాటిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్నది ఆలోచిస్తాం'' అని భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు. త్వరలో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఏదైనా లక్ష్యం సాధించడానికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు.

రాజకీయాలతోనే సరి...

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని, పరిపాలనపై పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నానని కిరణ్ పేర్కొన్నారు. "కొన్ని రోజుల్లోనే పరిస్థితులు చక్కబడతాయి. పరిపాలనలోకి వస్తా. పరిపాలనపై దృష్టి సారిస్తా. సోనియాగాంధీ పాలనలో పారదర్శకతను కోరుతున్నారు. కార్యకర్తలతో కలసి మెలసి ఉండాలని సూచించారు.

తొలుత... ఆలోచనల్లో స్పష్ట రావాలి. పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారో, పోయారో తెలియాలి. మన పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఎక్స్ పోతే వై .. వై పోతే జడ్ ఆ లోటును భర్తీ చేస్తారు'' అని వివరించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు నెలలో ఒకరోజు జిల్లా పార్టీ కార్యాలయానికి, నియోజకవర్గ కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు. "ఒకటి రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది. ఓపికతో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం' అని ముఖ్యమంత్రి తెలిపారు.

సీరియస్‌గా తీసుకోండి: డీస్

ముఖ్యమంత్రికంటే ముందు పీసీసీ చీఫ్ డీఎస్ మాట్లాడారు. పార్టీని బలహీనం చేసే ప్రయత్నాలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. "వాళ్లతో అయ్యేదేంటని ఊరుకోవద్దు. సీరియస్‌గా తీసుకోవాలి. పార్టీ పునాదులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. కార్యకర్తల కృషి కారణంగానే అధికారంలోకి వచ్చాం. దానిని కాపాడుకోవాలి. మన కంటిని మనమే పొడుచుకోవద్దు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వాడే నాయకుడు అవుతాడు. మనకు అంకిత భావం ఉంటే ఎదుగుతాం. లేకుంటే కనుమరుగై పోతాం. ఈ తరం రాజకీయ నాయకుల ఆకాంక్షలు, కోర్కెలు, అవరాలు ఏమిటో ముఖ్యమంత్రికి బాగా తెలుసు'' అని డీఎస్ తెలిపారు.

డీసీసీ అధ్యక్షులుగా పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. "కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే... మీరూ బలహీనపడతారు. అందరం కలసి పార్టీని బలోపేతం చేయాలి. పార్టీకి సంబంధించిన సమస్యలు ఉంటే నాకు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలుంటే ముఖ్యమంత్రికి చెప్పండి'' అని సూచించారు. వైఎస్ చేపట్టిన కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలేనన్నారు. "నేను రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిని అయినా... డీసీసీ అధ్యక్షుడిని కావాలన్న నా కోరిక నెరవేరలేదు. మీరు అదృష్టవంతులు. డీసీసీ, సీసీసీ అధ్యక్షులు అయ్యారు.

అందర్నీ సమన్వయ పరచాలి. అన్ని విభాగాలు, వర్గాలను కలుపుకొని ముందుకు తీసుకువెళ్లాలి. కాంగ్రెస్ అనే పదం ప్రజల నోటి మీద నానుతున్నా.. దానిని మనం ఇంకా విస్తృతం చేయాలి'' అని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును సమీక్షించాల్సి ఉందన్నారు. ఈ పథకాల అమలుపై 17-18 పాయింట్‌లు రూపొందించి .. జిల్లా వారీ పర్యవేక్షక కమిటీలను వేయాల్సి ఉందని... దీనికి సంబంధించి ఈనెల 25 లోగా జిల్లా కాంగ్రెస్ కమిటీల నుంచి పేర్లను పంపాలని డీఎస్ సూచించారు.

ప్రశ్నలు... నిలదీతలు...

ఈ భేటీలో ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్‌ను పలువురు నేతలు ప్రశ్నలతో నిలదీశారు. "జిల్లాల్లో పర్యవేక్షక కమిటీలు వేస్తామంటున్నారు. కానీ... మేం కాంగ్రెస్ పార్టీ నేతలమని చెబుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు'' అని గౌరీ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిమీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. "నేను యువజన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జాతీయస్థాయి యువజన కాంగ్రెస్ నాయకుడిని కొట్టాను. దీనిని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుని... నన్ను సస్పెండ్ చేసింది.

ఇప్పుడు బాహాటంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?'' అని గౌరీ శంకర్ ప్రశ్నించారు. మూడేళ్లుగా కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందని పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ అన్నారు. నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే ఇదిగో అదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్ రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందున, ఎవరి పని తీరు ఏమిటో బాగా తెలిసినందున, పదవులపై సీఎంకు పీసీసీ నుంచే పేర్లను పంపాలని నిరంజన్ కోరారు.

ఈ సమయంలో మంత్రి దానం నాగేందర్ జోక్యం చేసుకుని... పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ వెంట వెళ్తున్న ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నేతి విద్యాసాగర్ కూడా ప్రశ్నించారు. నిజమైన కార్యకర్తలకు భరోసా దక్కడం లేదని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ అన్నారు. ప్రధానంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ కార్యకర్తలకంటే బయటి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఎమ్మెల్యే ప్రసాద్ చేసిన సూచనలు పెడచెవిన పెట్టి రేషన్ షాపు డీలర్లతో సహా అన్ని అవకాశాలు, పదవులు బయటి వక్తులకే అప్పగించారు. పదవులు పొందిన మరుక్షణమే వారు జగన్ వెంట కన్పిస్తున్నారు'' అని ప్రతాప్ పేర్కొన్నారు. ఇలాంటివి సరిదిద్దేందుకే సమన్వయ కమిటీలను వేస్తామంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకూ మధ్య సమన్వయం లేదని.. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు ఈ విషయాన్ని చెబుతామని సీఎం హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి మాట!

పార్టీ నేతల్లో సమన్వయం కొరవడింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం లేక పోవడం నిజమే! నాయకునికి సెంటిమెంట్, కమిట్‌మెంట్ అనే అంశాలు ఉన్నాయి. మనతో ఎవరున్నారో, ఎవరు లేరో చూసుకోవాలి. ఏదైనా చేసినా (పదవుల వంటివి ఇస్తే) ఉంటారో, పోతారో తెలీదు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల, లేని చోట్ల కూడా ఇబ్బందులున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలకూ పడదు. మంత్రులకూ ఎమ్మెల్యేలకూ పడడం లేదు.
- డీసీసీ అధ్యక్షుల భేటీలో సీఎం కిరణ్
Click Here!

Sunday, January 9, 2011

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

cm
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహాకాలు అందిస్తుందని, పెట్టుబడులకు రాష్ట్రం అనుకూల ప్రదేశమని ఆర్‌బీఐ కీతాబిచ్చిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని మరో గుజరాత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో విద్యుత్‌ రేటు చాలా తక్కువగా ఉందని సీఎం స్పష్టంచేశారు. పరిశ్రమలు స్ధాపించేవారికి తక్షణ అను మతులు ఇస్తామని, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్విహ స్తున్నాయని ముఖ్యమంత్రి ప్రవాసాంధ్రులకు తెలిపారు.

గుజ రాత్‌ తరహా అభివృద్ధే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. నేడు ఢిలీ ్లలో జరగనున్న ప్రవాస భారతీయ దివస్‌-2011 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డిని పాల్గొనాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రి గీతారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి ఎస్‌.వీ.ప్రసాద్‌ ఇతర ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పలుఅంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. రాష్ట్రం లో పరిశ్రమలకు కావల్సిన ఆయా ముడిసరుకుతోపాటు, సుపరిపాలన, పెట్టుబడులకు అనుకూలంగా ఉండే విధానా లతోపాటు అన్నీంటికీ మించి వృత్తి నైపుణ్యం ఉన్నవారు అందు బాటులో ఉన్నారన్నారు. ముఖ్యంగా విద్యుతుత్పాదన రంగంలో రాష్ట్రం దేశం మొత్తంమీద రెండవస్ధానంలో నిలిచిందని 2010-11 ఆర్ధిక సంవత్సరానికి ఎపి ట్రాన్ప్‌కోకు పురస్కారం లభించిదాన్నరు.

ఈసందర్భంగా ముఖ్యమంత్రి ప్రవాసాం ధ్రులకు నూతన సంవత్సర, సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీల్లో 25 శాతం మంది రాష్ట్రానికి చెందినవారున్నారని, రాష్ట్రంనుంచి వైద్య విద్యను పూర్తిచేసుకున్న ఎంతోమంది డాక్టర్లు యుఎస్‌, యూ రోపియన్‌ దేశాలలో పనిచేస్తున్నారన్నారు. కాగా అంధ్రప్రదేశ్‌ ఐటీ, బయోటెక్నాలజీ, ఔషధ, ఎయిర్‌లైన్స్‌, ఉత్పాదక సంస్ధలతోపాటు ఇతర శిక్షణ సంస్ధల స్ధాపనలో ముందంజలో ఉన్నదని, అత్యున్నత టిఐఎఫ్‌ఆర్‌ సంస్ధను కూడా హైదరా బాద్‌లో ఏర్పాటు చేస్తారన్నారు.

వీటితోపాటు సహజ వాయువు సమృద్ధిగా లభిస్తుందని, ఆహార ఉద్పాదక, అనుబంధ పరిశ్ర మలు అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ రూపొందించారని, ఈ విధానంతో రాష్ట్ర ఆర్ధిక ప్రగతితోపాటు ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయని, దీంతో గ్రామీణులకు ఆర్ధికంగా వెసులుబాటు లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌, నీటి పారుదల ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రహదారుల వంటి అభివృద్దిలో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు.

ఇందుకు అనుగుణంగా రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నందున జాతీయ సా ్ధయిలో 3వ స్ధానంలో నిలిచిందని ముఖ్యమంత్రి తెలి పారు. అంతేకాకుండా భార త్‌లో వాణిజ్యానికి అనుకూలంగా హైదరాబాద్‌ రెండవ మెట్రో నగరంగా ప్రపంచబ్యాంకుచే గుర్తించబడిం దని, దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎపీలో ఎక్కువగా ఉత్పాదక రంగానికి చెందిన పరిశ్రమలు ఉన్నాయన్నారు. కా గా తిరుమల వెంకటేశ్వరుని ప్రతీ ఏటా మిలియన్ల సంఖ్యలో భక్తులు ప్రపంచం నుంచి వస్తున్నారని, ప్రవాసాంధ్రులు వెంకటేశ్వరుని ఆశీస్సులు అందు కోవాలని సీఎం ఈసందర్భంగా కో రారు.ప్రవాసాంధ్రుల నుంచి పెట్టుబ డులను ఆకర్షించే విధంగా ఉన్నతా ధికారులు నిరంతరంగా కొనసాగించాలని ఇందుకు ఓ ప్రత్యేక పానెల్‌ను ఏర్పాటుచే ేయాలని సీఎం అధికారులకు సూచించారు.

రాజకీయ సెగలు పొగలు

Jagana 
రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, జగన్‌ దూకుడును అణచివేస్తానన్న రెండు హామీలు ఇచ్చి, ఆ మేరకు ముఖ్యమంత్రి పదవి సాధించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సామర్థ్యానికి కాంగ్రెస్‌ అధి ష్ఠానం అగ్నిపరీక్ష పెట్టింది. ఈనెల 11న జగన్‌ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకాకుండా అడ్డుకోవాలన్నదే అధిష్ఠానం పెట్టిన పరీక్ష. ఇందులో ముఖ్యమంత్రి పాసవుతారో, ఫెయిలవుతారో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఒకవేళ ఎమ్మెల్యేలు ఆదివారం జగన్‌తో వెళ్లకపోయినా 11న ఉదయం వెళ్లే అవకాశం ఉంది. ఆ ఫలితం బట్టే కిరణ్‌కుమార్‌ రాజకీయ భవితవ్యం, ముఖ్యమంత్రి పదవి పదిలమా కాదా అన్నది కూడా స్పష్టం కానుంది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇప్పుడు ఆ పదవి ముళ్లకిరీటంలా మారింది.

వైఎస్‌ మృతి చెందిన తర్వాత రాష్ట్ర పార్టీ వ్యవహారాల నివేదికలు అందచేస్తూ అధిష్ఠానానికి దగ్గరయి, అదే సంబంధాన్ని విని యోగించుకుని సీఎం పదవి పొందిన కిరణ్‌కు సొంత పార్టీలోనే సెగ పెరిగి, చివరకు అది వ్యక్తిగతంగా తనకు, తన పదవికి ఎసరు తెచ్చే ప్రమాదం తెస్తోంది. అధిష్ఠానం హెచ్చరికల నేపథ్యంలో కిరణ్‌ జిల్లా మంత్రులను ఆశ్రయించవలసి వస్తోంది. తాను విఫలమయితే, మంత్రులుగా మీరు కూడా విఫలమయి నట్టేనని, ప్రభుత్వం కూలిపోతే మీ పదవులు కూడా పోతాయని హెచ్చరించవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నెల 11న జగన్‌ రైతాంగ సమస్యలపై ఢిల్లీలో జరపతలపెట్టిన ధర్నాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు సిద్ధమవుతుండటం కిరణ్‌కు కలవరం కలిగిస్తోంది.

speaking వారిని ఢిల్లీ వెళ్లకుండా నివారించి, సత్తాను చాటుకోవాలని అధిష్ఠానం ఆదేశించడంతో సీఎం సతమతమవుతున్నారు. నేరుగా వారితో సన్నిహిత సంబంధాలు లేకపోవడంతో ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులశక్తి సామర్థ్యాలపై ఆధారపడి వస్తోంది. జగన్‌ ధర్నాకు వెళితే తన పదవికే ముప్పు వస్తుందన్న ఆందోళనతో సీఎం గత రెండు రోజుల నుంచి మంత్రాంగం నడుపుతున్నారు. ఆ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రు లు, మంత్రులపై బాధ్యత పెట్టారు. ‘జగన్‌ వెంట ఎమ్మెల్యేలు వెళితే ప్రజల్లో పార్టీ-ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. మీరంతా మంత్రివర్గంలో ఉన్నారు. ప్రభుత్వం పడిపోకుండా ఉండే బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. మీ జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో మాట్లాడండి.

వారిని ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోండి. హై కమాండ్‌ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టండి’ అని సీనియర్లను అభ్యర్థిస్తున్నట్లు సమాచారం. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును పిలిపించి చర్చించారు.దాదాపు 31మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు ఢిల్లీకి బయలు దేరడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు కిరణ్‌కు ముచ్చెమటలు పోయిస్తున్నాయి. నిజంగా వారంతా ఢిల్లీకి వెళితే తనపై అధిష్ఠానం ఉంచిన విశ్వాసం, సీఎం పదవి తీసుకునే ముందు అధిష్ఠానానికి తానిచ్చిన భరోసా రెండూ తప్పినట్లేనని కిరణ్‌ భావిస్తున్నారు. అటు అధిష్ఠానం కూడా జగన్‌ ధర్నా వ్యవహారం తనకు సంబంధం లేనట్లు, అది పూర్తిగా కిరణ్‌ సామర్థ్యానికి సవాలు, పరీక్షగా భావిస్తోంది.

ఇదే భావన పార్టీ వర్గాల్లోనూ కనిపిస్తోంది. 11 నాటి జగన్‌ దీక్షకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరయితే, అధిష్ఠానం కిరణ్‌ను అసమర్థ ముఖ్యమంత్రిగా పరిగణించే అవకాశాలు లేకపోలేదని, ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగించుకుని, సత్తా చూపలేని వైఫల్య ముఖ్యమంత్రిగా భావిస్తే ఆయన పదవికే ప్రమాదం వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.ఒకవేళ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సూచనలు, అభ్యర్థలను బేఖాతరు చేసి ఢిల్లీ వెళితే కిరణ్‌ కూడా రోశయ్య బాటనే పయనించవలసి వస్తుందని సీనియర్లు చెబుతున్నారు. అప్పుడు అధిష్ఠానం మరొకరిని నియమించే పరిస్థితి తలెత్త కుండా తానే స్వయంగా రాజీనామా చేయవలసిన వస్తుందని చెబుతున్నారు.

‘మా పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళితే అది నిజంగా కిరణ్‌కుమార్‌కు అవమా నమే. సీఎంగా అవకాశం ఇచ్చినా వారిని నియంత్రిం చలే కపోయారన్న అపప్రధను మూటకట్టుకోవలసి ఉంటుంది. ఇది కిరణ్‌ సత్తాకు అసలు సిసలు అగ్ని పరీక్ష. పాసయితే పదవిలో ఉంటారు. ఫెయిలయితే పదవీచ్యుతుడవుతారు. నిజంగా ఆ పరిస్థితే వస్తే కిరణ్‌ గౌరవంగా రాజీనామా ఇవ్వడమే మంచిద’ని సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. కాగా.. ఒకవైపు ఎమ్మెల్యేలను ఢిల్లీ వెళ్లకుండా కట్టడి చేసే యత్నాల్లో సీఎం బిజీగా ఉంటే, మరోవైపు ఆయన సొంత జిల్లాలో తనపై మొదలయి అసమ్మతి సెగ, తిరుగుబాటు కిరణ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ప్రాజెక్టు సాధన, నిధుల నిలిపివేతకు నిరసనగా తనకు వ్యతిరేకంగా ప్రత్యర్ధి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం నుంచి దాదాపు పదివేల మందితో పాదయాత్ర ప్రారంభించేందుకు నిర్ణయించడం, దానికి ఆరు నియోజకవర్గాల నుంచి కార్యకర్తల సమీకరణకు సన్నాహాలు చేస్తుండటంతో కిరణ్‌కు సొంత జిల్లా వైపు కూడా దృష్టి సారించ వలసి వస్తోంది.జిల్లాలో తన పరువు కాపాడేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నాలను ఆపాలంటూ మంత్రిరఘువీరాను దూతగా నియమించినా, ఆ ప్రయత్నలు కూడా విఫలమవడం కిరణ్‌ను నిరాశకు గురిచేశాయి. ఈ విధంగా అటు ఢిల్లీ, ఇటు చిత్తూరు పరిణామాలతో నల్లారి నలిగిపోతున్నారు.

చిత్తూరు ‘తూటా’

cm-srఈనెల 11న ఢిల్లీలో జగన్‌ తలపెట్టనున్న ధర్నాకు పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లకుండా అడ్డుకునే పనిలో తలమునకలయి ఉన్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సొంత జిల్లాలోనే చుక్కెదురయ్యింది. జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కీలకమైన పాత్ర పోషించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యక్షంగా సీఎంకు వ్యతిరేకంగా ప్రజా పోరాటానికి సిద్దం అయ్యారు. తన సొంత నియోజకవర్గం పుంగనూరును ప్రభుత్వం విస్మరిస్తే సహించేంది లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి తాగునీరు అందకుంటే పోరాటం తప్పదన్నారు. ఆ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టాలని నిర్ణయించారు. అయిదే, మహాపాదయాత్రను ఆపేందుకు జిల్లా ఇన్‌ చార్జ్‌ మంత్రి రఘవీరారెడ్డి రంగంలోకి దిగినా నియోజకవర్గ జనం కోసం పాదయాత్ర తప్పదని పెద్దిరెడ్డి విస్పష్టంగా చెప్పారు.

దీంతో సిఎం తన జిల్లాలోని పార్టీ శ్రేణులను కూడా కలుపుకుపోలేని పరిస్థితి నెలకొంది. శనివారం పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటిస్తుండగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి రఘవీరారెడ్డి పెద్దిరెడ్డికి ఫోన్‌చేసి పాదయాత్రను ఆపివేయాలని కోరారు. దీంతో ఆయన పుంగనూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి సుమారు రూ.33.3కోట్ల వ్యయంతో స్థానిక పుంగమ్మ చెరువులో సమ్మర్‌స్టోరేజ్‌ను నిర్మిస్తున్నామని, సమ్మర్‌స్టోరేజ్‌కు నీరు చేర్చడానికి సదుం మండలంలోని గార్గేయనది నుండి పైపులైను ఏర్పాటు చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్యలు కూడా అంగీకరించారని పేర్కొన్నారు. గార్గేయనది నుండి సమ్మర్‌స్టోరేజ్‌ పైపులైను ఏర్పాటుకు సుమారు రూ.82కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపామన్నారు.

ఈ సమ్మర్‌స్టోరేజ్‌ ప్రారంభమైతే సుమారు 60వేల మందికి దాహార్తిని తీర్చచ్చని పెద్దిరెడ్డి మంత్రి రఘువీరాకు వివరించారు. అయితే సిఎం వ్యక్తిగత ప్రయోజనం కోసం గార్గేయనది జలాలను పీలేరు నియోజకవర్గానికి మళ్లించడానికిప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మా నియోజకవర్గ ప్రజల కోసం తాను ఈ పాదయాత్రను చేపట్టానని ఇన్‌చార్జ్‌ మంత్రికి తేల్చిచెప్పారు. ప్రజల దాహార్తి తీరేంత వరకు ప్రజా ఉద్యమం ఆగదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు పుంగనూరు, కుప్పం, పలమనేరు, తంబళ్లపల్లి, మదనపల్లి, సత్యవీడు, శ్రీకాళహస్తి నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు పెద్దిరెడ్డి పాదయాత్రకు తరలిరానున్నారు. పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సతుం మండలాల మీదగా ప్రాజెక్టు ఉన్న పాపిరెడ్డి గారి పల్లెకు పాదయాత్ర చేరుకుంటుందని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.

తాజా పరిణామాలతో ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచే సెగ మొదలయినట్టయింది. పెద్దిరెడ్డి పాదయాత్ర ప్రారంభమయితే, సీఎంకు సొంత జిల్లాలోనే పట్టులేదన్న సంకేతాలు అధిష్ఠానానికి చేరే ప్రమాదం లేకపోలేదు. పెద్దిరెడ్డి పాదయాత్రకు రాష్ట్ర స్థాయి ప్రచారం లభించే అవకాశం ఉంది. బహుశా ఆయన ఆ వ్యూహంతోనే పాదయాత్ర చేపడుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో సొంతజిల్లా పార్టీ ఎమ్మెల్యేలను నియంత్రించలేని నాయకుడు ఇక రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలను ఏవిధంగా నియంత్రించగలరన్న భావన విస్తృతమవుతే, అది కిరణ్‌కు వ్యక్తిగతంగా కూడా నష్టమేనంటున్నారు.