Showing posts with label AICC. Show all posts
Showing posts with label AICC. Show all posts

Wednesday, December 22, 2010

నత్తనడకన నల్లారి పాలన * కిరణ్‌ బెంబేలు ! * సోనియాకు సవాల్‌ !

Secretariat
నల్లారి పాలన నత్తను తలపిస్తోంది. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి ఫైళ్ళు పెండింగ్‌ పెట్టబోనని స్పష్టం చేసిన సిఎంగారు తన మంత్రివర్గంలోని సభ్యులకు మాత్రం ఇప్పటి వరకు సహా యకులను, కార్యాలయాల సిబ్బందిని అందించలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ మంత్రుల కార్యాలయాల నుంచి సాధారణ పరిపాలన శాఖ(జిఎడి)కి ప్రతిపాదనలు అంది దాదాపు నెలరోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రులకు సంబంధించిన ఆఫీసు వ్యవహారాల విషయంలోనే ఇంతగా నిర్లక్ష్యం ఉంటే ఇక రాష్ట్ర పరిపాలన వ్యవహారాల సంగతి మాటేమిటనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

సాధారణంగా మంత్రుల కార్యాలయాల్లో వ్యక్తిగత కార్యదర్శులు(పిఎస్‌), ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ(ఒఎస్‌డి)వ్యక్తిగత సహాయకులు(పిఎ), ప్రజా సంబం ధాల అధికారులు(పిఆర్వోలు)లతో పాటు అటెండర్ల కేటాయింపులు ఉంటాయి. ఇందులో ప్రభుత్వ డిప్యూటీ డైరెక్టర్‌(డిడి) స్థాయికి మించి జాయింట్‌ డైరెక్టర్‌(జెడి) లేదా ఆపై స్థాయి అధికారులు మంత్రుల వద్ద వ్యక్తిగత కార్యదర్శులుగా, ఒఎస్‌డిలుగా పనిచేసే అవకాశం ఉంది. జాయింట్‌ డైరెక్టర్‌ హోదా కలిగిన అధికారుల డిప్యూటేషన్లకు మాత్రం ముఖ్యమంత్రి అనుమతి తప్పనిసరి. జెడి స్థాయి అధికారులు మినహా మిగతా సిబ్బంది డిప్యూటేషన్లకు ఆయా శాఖల అధిపతుల ద్వారా ఆర్ధిక శాఖ అనుమతితో నియామకాలు జరిపే అవకాశం ఉంటుంది.

కానీ ఇప్పటి వరకు మంత్రుల కార్యాలయాల్లో సిబ్బంది కేటాయింపులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడక పోవడంతో మంత్రులు శాఖలపై ఇంకా పట్టుసాధించలేకపోతున్నారు. దీంతో సదరు మంత్రులు తమ పని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడ కొనసాగించాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్తగా మంత్రిపదవులు పొందిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అసలే ఇష్టంలేని శాఖలు, ఆపై సహాయకులు(పిఎస్‌ లేదా ఒఎస్‌డి) లేకపోవడంతో ఏమి చేయాలో పోలుపోని పరిస్థితుల్లో మరికొందరు ఉన్నారు.

మంత్రులు జిల్లా పర్యటనలకు వెళ్ళే ముందు వారి పర్యటన(టూర్‌ ప్రోగ్రామ్‌)లకు సంబంధించిన వివరాలను సదరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు తెలియజేయాల్సి ఉం టుంది. అదేవిధంగా సాధారణ పరిపాలన శాఖకు కూడా సమాచారం అందజేయాల్సి ఉంటుంది. అధికారికంగా మంత్రుల వ్యక్తి గత కార్యదర్శులుగా ఖరారు కాని వారి నుంచి వచ్చే సమాచారాన్ని జిల్లా యంత్రాంగం బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తు తున్నాయి. ఇటీవల కొందరు మంత్రులు తమ సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పర్యటించాల్సిన సందర్భాల్లోనూ తప్పని పరిస్థితుల్లో అనధికారికంగా వారి వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది వెంట వెళ్తున్నారు.

కిరణ్‌ బెంబేలు !
Kiran-cmmవిజయవాడలో జగన్‌ చేపట్టిన లక్ష్య దీక్ష్య ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డికి దడ పుట్టిస్తున్నది. రైతు సమస్యలపై పోరాటమే లక్ష్యంగా మంగళవారం నుంచి 48 గంటల పాటు దీక్షకు ఉపక్రమించిన జగన్‌కు జనం, కాంగ్రెస్‌ కార్యకర్తలు నీరాజనం పట్టడం, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు పీఆర్పీ, టీడీపీ నేతలు కలిసి రావడంతో దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కడ పడుతుందోనని సిఎంకు, పార్టీ పెద్దలకు భయం చుట్టుకున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

మంగళవారం మొదటి రోజునే కాంగ్రెస్‌కు చెందిన సుమారు 22 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే, పీఆర్పీ నుంచి ఇద్దరు దీక్షలో పాల్గొని బాహటంగానే జగన్‌కు మద్ధతు పలికారు. మరో వైపు సీమాంధ్రకు చెందిన ఐదుగురు ఎంపీలు కూడా జగన్‌కు మద్దతు ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఢిల్లీలో ఉన్న ఎంపీలు మం గళవారం రాత్రికి, బుధవారం విజయవాడకు చేరుకుని జగన్‌ శిబిరంలో పాల్గొనే అవకాశాలు న్నట్లు తెలుస్తోంది. జగన్‌ దీక్ష బుధ, గురు వారాల్లో కూడా కొనసాగనుండటంతో ఇంకెంత మంది పార్టీ నేతలు జగన్‌ బాట పడతారోనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పెద్ద నేతలకు ఆందోళన కలిగిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పలువురు మంత్రులు, పార్టీ నేతలు కొందరు జగన్‌ దీక్షపై మంగళవారం మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేసినప్పటికీ అంత ర్గతంగా వారు కూడా దీక్షకు తరలి వచ్చిన జనం, నేతలను చూసి గుబులు పడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాంగ్రెస్‌అధిష్ఠానాన్ని ధిక్కరించి, పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిన కడప మాజీ ఎంపి జగన్మోహన్‌రెడ్డి కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై రైతుసమస్యలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగిన జగన్‌కు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు మద్దతు పలకడం కాంగ్రెస్‌ నాయకత్వం గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిందని విని పిస్తోంది. తమ ఆదేశాలను ధిక్కరించి, పార్టీని సైతం లెక్క చేయకుండా ఊహించని విధంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు జగన్‌ శిబిరంలో పాల్గొని బాహటంగానే అతనికి మద్దతు పలకడమే కాకుండా పాటు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికే వ్యతి రేకంగా వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌ రాష్ట్ర, జాతీయ నేతలకు ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. మరో రెండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనున్నందున పార్టీ నేతలు ఇంకెంత మంది జగన్‌ వెంట క్యూలు కడతారోననే భయం కాంగ్రెస్‌ పెద్దలను వెంటాడుతున్నది.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డి మంగళవారం ప్రధానంగా జగన్‌ దీక్షపైనే దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జగన్‌ దీక్షకు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎంత మంది వెళ్ళారు, ఏ ప్రాంతం నుంచి అధికంగా వచ్చారు, జగన్‌ వెంట నడిచిన నేతలు ఏ ప్రయోజనాలు ఆశించి అటూ వెళు తున్నారు?, జగన్‌తో వారికి ఉన్న సంబం ధాలు, వ్యాపార లావాదేవిలపై సిఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు పార్టీ వైపు నుంచి సిఎం జగన్‌ శిబిరంపై సమాచారం సేకరించినట్లు విని పిస్తోంది. ఈ సమాచారంతో ఒక నివేదికను తయారు చేసి ఆయన పార్టీ హైకమాండ్‌కు నివేదించనున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

పీసీసీ, ఎఐసీసీ ఆరా
పార్టీ ఆదేశాలను, క్రమశిక్షణను ఉల్లం ఘించి జగన్‌ దీక్షలో పాల్గొన్న పార్టీ నేతల విషయంలో పీసీసీ ఆరా తీస్తున్నట్లు సమా చారం. జగన్‌ దీక్షలో పార్టీ నేతలు ఎవరెవరు పాల్గొన్నారో, ఎంత మంది పార్టీ కార్యకర్తలు తరలి వెళ్ళారో వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని విజయవాడ కాంగ్రెస్‌ కమి టీతో పాటు ఆయా జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు పీసీసీ తరఫున ఆదేశాలు వెళ్ళినట్లు తెలు స్తోంది. హస్తినలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ఇప్పటికే ఈ మేరకు ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మరో వైపు ఎఐసీసీ కూడా జగన్‌ దీక్షపై తన నిఘా వర్గాల ద్వారా సమా చారం సేకరించినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
సోనియాకు సవాల్‌ !
Sonia-B
వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దయ నీయంగా, విషాదకరంగా మారింది. రెండు డజ న్లుకు పైన పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ ఏర్పాటు చేసుకున్న వేదికపైకెక్కి ఇరవైనాలుగు గంటలు గడిచినా వారికి కనీసం షోకాజ్‌ నోటీసులు ఇచ్చే ధైర్యం, దమ్ము కూడా కాంగ్రెస్‌ పార్టీ నాయ కత్వానికి కరవయిన దయనీయ పరిస్థితి నెల కొంది. మంగళవారం విజయవాడ కృష్ణానది ఒడ్డున వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన లక్ష్యదీక్ష శిబిరానికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు పీఆర్పీ, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హాజరుకావడం సంచలనం సృష్టించింది. రెండవరోజుయిన బుధవారం మరో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా హాజరు కానున్నారు.

ఒక రకంగా.. రాజకీయ చైత న్యానికి ప్రతీకగా భావించే విజయవాడ జగన్‌ మద్దతుదారుల బలప్రదర్శనకు వేదిక. జగన్‌ను చూసి కాంగ్రెస్‌ నిలువెల్లా వణికిపోతోంది. ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నిద్ర కూడా కరవ వుతోంది. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీని సవాలు చేస్తారన్న ఊహలు ఆయనను ఒక పట్టాన నిలవనీయడం లేదు. 22 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు తన పార్టీని సవాల్‌ చేస్తున్న జగన్‌ దీక్షకు బాహాటంగా మద్దతు ప్రకటించడం, అయినా వారికి కనీసం ఇప్పటివరకూ షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేయటం, చర్యలు తీసు కుంటామని పీసీసీ అధ్యక్షుడు కూడా ఇప్పటి వరకూ హెచ్చరించకపోవడం బట్టి.. కాంగ్రెస్‌ అధిష్ఠానం జగన్‌ విషయంలోఅడకత్తెరలో పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

విజయవాడలో జగన్‌ నిర్వహించిన తొలిరోజు లక్ష్యదీక్షలో ప్రసంగించిన ప్రముఖులంతా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తూర్పారపట్టారు. స్వయంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ ఢిల్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని పిలుపు నిచ్చారు. అంబటి, జూపూడి ప్రభాకర్‌రావు, ప్రసన్నకుమార్‌రెడ్డి, రోజా, రాజశేఖర్‌, విజయచందర్‌, గట్టు రాంచందర్‌రావు, జక్కంపూడి విజయలక్ష్మి వంటి ప్రముఖు లంతా కాంగ్రెస్‌ను దుయ్యబడుతూ ప్రసంగిం చారు. అయినప్పటికీ వేదికపైనే ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వాటిని కనీసం ఖండిం చలేదు. తమ పార్టీని విమర్శిస్తున్నా నోరు మెదపకుండా జనం చేసే చప్పట్లకు తన్మ యులయ్యారు. వారంతా జగన్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మాదిరిగానే అత్యంత క్రమశిక్షణ గల సైనికులుగా కనిపించారు.

జగన్‌ దీక్షా శిబిరానికి 22 మంది ఎమ్మెల్యేలు హాజరయినప్పటికీ, వారిపై చర్యలు తీసు కోవాలా? తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసు కోవాలి? ముందు షోకాజ్‌ ఇవ్వాలా? వద్దా? ఇస్తే వారంతా పార్టీపై ఇక బాహాటంగానే తిరుగుబాటు చేస్తారా? అదే జరిగితే పార్టీ కొంప కొల్లేరవుతుందా? బుధవారం నాటి రెండవ రోజు దీక్షకు ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హాజరవుతే ఏం చేయాలి అన్న ప్రశ్నలు అధిష్ఠానాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం నాటి దీక్షకు మరో 20 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా హాజరయేందుకు సిద్ధమవు తోన్న వైనం నాయకత్వాన్ని కలవరపరు స్తోంది. నిజంగా అదే జరిగితే ఇక కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లేనన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసు కుంటే, అసంతృప్తితో ఉన్న జగన్‌కు చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వారితో జత కలిస్తే కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడానికి ఎక్కువ కాలం అవసరం లేదని నాయకత్వం అంచనా వేస్తోంది. ఒక్క షోకాజ్‌ నోటీసు ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెడుతుందన్న అదురు అధిష్ఠానంలో కనిపి స్తోంది. అందుకే ఈ విషయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు కళ్లెదుటే తనను ధిక్కరిస్తున్నా వారిపై చర్యలు తీసుకోలేని నిస్సహాయతలో ఉంది. ఈ విషయంలో పీసీసీ పరిస్థితి మరీ ఘోర ంగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌ డి..శ్రీనివాస్‌ అసలు పనిచేస్తున్నారా? లేరా అన్న అనుమానం ఏర్పడుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జగన్‌ వైపు వెళుతున్నా కనీసం తన స్థాయిలో కూడా స్పందించి, వారిపై హెచ్చరికలు కూడా జారీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

అటు ఢిల్లీ నాయకత్వం కూడా రాష్ట్రంపై నిశితంగా దృష్టి సారిస్తోంది. జగన్‌ లక్ష్య దీక్షకు వస్తున్న జనాలు, ఎమ్మెల్యేల సంఖ్య, స్పందన వంటి అంశాలపై ఆరా తీస్తోంది. జగన్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలా వద్దా అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. సీనియర్‌ నే త వి.హన్మంతరావు మాత్రం జగన్‌కు మద్దతు నిచ్చిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరతానని వెల్లడించగా, మంత్రి శంకర్‌రావు మరో అడుగు ముందుకేసి జగన్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.జగన్‌ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చర్యలపై తరచూ స్పందించే ఏఐసీసీ అధికార ప్రతినిధులు కూడా తాజా పరిణామాలపై నోరు మెదపకపోవడం చూస్తుంటే.. జగన్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ నాయకత్వం ఎంత భయపడుతోందో? ఎవరిపై చర్యల కొరడా ఝళిపిస్తే ఏమి కొంపలు మునుగు తాయోనన్న ముందుచూపుతో తర్జనభర్జన పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

Tuesday, November 30, 2010

జగన్‌ వైపు చూడొద్దు

cm-speach దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్‌, సతీమణి విజయమ్మల రాజీనామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం హుటాహుటిన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఇక్కడి లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌లో సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి నగరంలో అందుబాటులో ఉన్న తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాకు చెందిన సుమా రు 60 మంది వరకు హాజరయ్యారు. కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామా లపై సీఎం, ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.

ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు కు చేరుకున్న సీఎంకు జగన్‌, విజయమ్మల రాజీనామా విషయం అక్కడే తెలి సింది. దీంతో ఆయన అక్కడి నుంచి ఫోన్‌లో తన అనుచరులతో మాట్లాడి ఆరా తీసినట్లు సమాచారం. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్న సిఎం, మధ్యా హ్నం రెండుగంటలకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో కలవాలని నగరంలో అందు బాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం పంపించారు. వీరి సమా వేశానికి ముందు సీఎం రాజభవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా గవర్నర్‌కు ఆయన మంత్రి వర్గ జాబితాను అందజేసినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.అక్కడి నుంచి ఆయన లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు...రాజీనామా సందర్భంగా జగన్‌ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్‌ పార్టీపై చేసిన విమర్శలు, ఆరోపణలను మీరంతా ముక్తకంఠతో ఖండించాలి. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించండి. అక్కడక్కడ కొందరు జగన్‌ మద్దతు దారుల ముసుగులో గొడవలకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది.

శాంతి భద్రతలను కాపాడటం రాజీ పడబోమని, మీరు కూడా ఇందుకు సహాకరించాలి. సోనియా నాయకత్వాన్ని బలపరూస్తూ ఆమె పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. వైఎస్‌ఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో పదవులు, అవకాశాలిచ్చింది. దాంట్లో భాగంగానే ఆయన కూడా ఉన్నన్ని రోజు లు పార్టీకి విధేయుడిగా పనిచేశారు. కనుక వైఎస్‌ఆర్‌ని మీరు, పార్టీ నేతలు ఎవరు కూడా ఎక్కడ విమర్శించొద్దు. పార్టీ అధిష్ఠానం మనపై (ఆంధ్రాపై) ఎన్నో ఆశలుపెట్టుకుంది. సోనియా, ప్రధాని మన్మోహన్‌, చిదంబరం, ఆంటోని రాష్ట్రా న్ని అగ్రగ్రామిగా చూడాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా అభివృద్ధి చేయడానికి తమ పూర్తి సహాకారం ఉంటుందని ప్రధాని హమీ ఇచ్చారు. ఎప్పుడు వచ్చినా మీ కోసం ద్వారాలు తెరచి ఉంటాయన్నారు.

మంత్రి పదవులు అందరికీ ఇవ్వలేను. అందుకే రాని వారు నిరాశపడొద్దు. పదవులు రానంత మాత్రానా అసమర్ధులు కాదని, వారు అవకాశం రాని వారు మాత్రమే. నేను కూడా మంత్రి కాకుండానే సీఎం అయ్యాను. అందరికి ఇలాగే గుర్తింపు వస్తుంది. నియోజ కవర్గాలకు మీరే హీరోలు. మీరు చెప్పినట్లే అన్ని జరుగుతాయి. అక్కడ పార్టీ, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది, అని కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. సిఎం వ్యాఖ్యలను బలపరు స్తూ కె.జానారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదించారు.

మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డి. శ్రీధర్‌బాబు, ఆనం రామ నారాయణరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దానం నాగేందర్‌, బాలరాజు, సబితా ఇంద్రారెడ్డి, శత్రుచర్ల, జె.గీతారెడ్డి, డొక్క మాణిక్య వర ప్రసాద్‌, గల్లా అరుణకుమారి, డి.కె.అరుణ, ధర్మాన ప్రసాద్‌రావు, వట్టి వసంత కుమార్‌, ఆర్‌.వెంకట్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, విశ్వరూప్‌, గాదె వెంకట్‌ రెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, జెసి. దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రవీణ్‌ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, బి.బిక్షమయ్య గౌడ్‌, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీలు తదిత రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వారందరు పార్టీ అధిష్ఠాన నిర్ణయానికి తాము కట్టు బడి ఉంటామని సీఎంకు భరోసా ఇచ్చారు.

చిరుతో భేటి వాయిదా?
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం అనంతరం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో పీఆర్పీ అధినేత చిరంజీవితో భేటీ కానున్నట్లు వార్తలు వచ్చాయి. మంత్రివర్గంలో చేరే విషయంతో పాటు జగన్‌ పరిణామాల పై చిరు, సీఎం మధ్య చర్చ జరిగే అవకాశాలున్నట్లు వినిపించింది. అయితే అనివార్య కారణాల వల్ల చిరు భేటి వాయిదా పడింది. మంగళవారం చిరుతో సీఎం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త మంత్రివర్గంలో పీఆర్పీని తీసుకునే అవకాశాలు లేవని స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. మంత్రివర్గం ఏర్పాటు అనంతరం పరిణామాలను బేరీజు వేసుకుని రెండవ విడత చేపట్టే మంత్రివర్గ విస్తరణలో పీఆర్పీని చేర్చుకునే అవకాశాలుంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

Sunday, November 28, 2010

ఆశా ‘కిరణ ’మవుతారా ?

  cm-raise
ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాణిస్తారా? ఇప్పుడున్న అనేక రకాల ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకునే సత్తా ఆయనకు ఉందా? మొన్నటి వరకూ సాధారణ ప్రజ లకు దూరంగా ఉన్న కిరణ్‌ ఇప్పుడు జనంతో మమే కం కాగలరా? జమిందారీ కుటుంబం నుంచి వచ్చి న ఆయన సామాన్యుల సమస్యలను పరిష్క రించగలరా? మొదటి నుంచి మీడియాకు దూరం గా ఉండే కిరణ్‌.. మీడియా ప్రాధాన్యం పెరిగిన ఈ నేపథ్యంలో ఆ మేరకు వ్యవహరించగలరా?

ప్రధా నంగా.. వైఎస్‌ మాదిరిగా బలమైన ప్రధాన ప్రతి పక్షం తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు, ఆ విషయంలో పార్టీ లోని ఇతరుల సహకారం ఆయనకు అందుతుందా?పార్టీనీ-ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించే ఆశా ‘కిరణ’మవు తారా?.. ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు అన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి.

jai-krianఈ రాష్ట్రానికి 16వ ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నల్లారి వ్యక్తిగత వ్యవహార శైలి, ఇప్పటివరకూ ప్రజలతో ఆయన అనుసరించిన విధానం, ప్రాంత నేపథ్యం వంటి అంశాలు పరిశీలిస్తే.. భవిష్యత్తులో ఆయన తన ముందున్న సమస్యలు, ఇంతకుముందు ఉన్న సీఎంలు ఎదుర్కొన్న మాదిరిగానే కొనసాగుతున్న మరికొన్ని సమస్యలను పరిష్కరించి, అధిగమించగ లరా అన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలయింది. మొదటి నుంచి జమీందారీ కుటుంబమయిన కిరణ్‌కుమార్‌రెడ్డికి నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రజలతో పెద్దగా సంబంధాలు లేవు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, స్పీకర్‌గా ఉన్నా సోదరుడు కిషన్‌కుమార్‌రెడ్డి అంతా చక్కదిద్దుతున్నారు. సాధారణ ప్రజలతో కిరణ్‌ మమేకమయిన సందర్భాలు గానీ, వారితో కలసిపోయే సందర్భాలు గానీ తక్కువన్నది నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ప్రజలతో ఆయనకు పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవన్నది ఆ జిల్లా, నియోజకవర్గ వాసుల అభిప్రాయం.

kiraaఅయితే, తన అభిప్రాయాలు ముక్కుసూటిగా వ్యక్తం చేసే కిరణ్‌పై అవినీతి ఆరోపణలు లేవు. సిఫారసు లేఖలు ఇచ్చే అలవాటు కూడా లేదు. పని అయితే అవుతుందని, లేకపోతే కాదని ఖరాఖండీగా చెప్పే మనస్తత్వం ఆయనది. తన వద్దకు పనుల కోసం వచ్చిన వారి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు నేరుగా ఫోన్లు చేస్తుంటారు. నేరుగా ప్రజలను కలిసే అలవాటు పెద్దగా లేని కిరణ్‌.. ఇప్పటివరకూ తన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కార బాధ్యతను మండలాలు, గ్రామాల్లో ఉన్న తన ప్రధాన అనుచరులకే అప్పగిస్తూ వస్తున్నారు. అంటే ప్రజలు తమ సమస్యలు వారికి చెప్పుకుంటే, సదరు నేతలు కిరణ్‌కు చెప్పి వాటిని పరిష్కరిస్తుంటారన్న మాట! అంతే తప్ప ఇంటివద్దకు వచ్చిన ప్రజలతో మాట్లాడే అలవాటు పెద్దగా లేదు.

ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన ముఖ్యమంత్రి. సమస్యలు వినిపించేందుకు వివిధ వర్గాల ప్రజలు వందల సంఖ్యలో వస్తుంటారు. సాధ్యం కాని కోరికలు కూడా కోరుతుంటారు. వారికి తగిన సమయం కేటాయించడంతో పాటు, చాలా సహనం-ఓర్పుతో సమాధానం ఇవ్వాల్సి ఉంది. నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోయినా వారిలో నమ్మకం కలిగించాలి. ఎమ్మెల్యే-స్పీకర్‌-చీఫ్‌ విప్‌గా ఉన్నప్పటి మాదిరిగానే వారితో వ్యవహరిస్తే అవి చెడు సంకేతాలుగా వెళ్లి, దుష్ర్పచారంగా మారి ప్రజల్లో విస్తృత ప్రచారమయ్యే ప్రమాదం లేకపోలేదు.

sanmanamఇక ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు, వారి అవసరాలు తీర్చడంలోనే కిరణ్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. వైఎస్‌ తన వద్దకు వచ్చి ఎమ్మెల్యేలందరికీ వారి చెప్పిన పనులన్నీ చేయక పోయినా భుజం తట్టి పంపేవారు. రోశయ్య మాత్రం తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలకు ఒక్క పనికూడా చేసిపెట్టకపోగా, వ్యంగ్యాస్త్రాలు సంధించ డంతో అసలు ఎమ్మెల్యేలు పేషీ ముఖం చూడటమే మానేశారు. సుదీర్ఘకాలం పదవిలో కొనసాగాలంటే ఎమ్మెల్యేలతో సత్సంధాలు పెట్టుకోకపోతే, ఆయన పరిస్థితీ మరో రోశయ్య కాక తప్పదని పార్టీ వర్గాల వ్యాఖ్యానిస్తున్నాయి.

cm-chidabramపేషీలో కూడా సమర్థులను నియమించు కోకపోతే రోశయ్య మాదిరిగానే సమస్యలు, విమర్శ లు ఎదుర్కోవలసి వస్తుంది. రోశయ్య హయాంలో ఆర్థిక శాఖ నుంచి తెచ్చుకున్న తన పాత సిబ్బందినే పీఎస్‌, పీఏ, ఓఎస్‌డీలు నియమించుకున్నారు. వారిలో ఒక్కరికీ ఎమ్మెల్యేలు, మీడియాతో సంబంధాలు లే పోవడంతో ప్రభుత్వమే ఇబ్బందిపడవలసి వచ్చింది. రోశయ్య మాదిరిగానే వారు కూడా సీఎం పేషీకి వచ్చినా ఇంకా ఆర్థికశాఖలో ఉన్నట్టే వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఈ విషయంలో కిరణ్‌ ఆచితూచి వ్యవహరించి, ప్రజా్రపతినిధులు, మీడియాతో సన్నిహిత సంబంధాలున్న వారిని నియమించు కోకపోతే సమస్యలు తప్పవంటున్నారు.

cm-sirస్థానికంగానయినా, చిత్తూరు జిల్లా స్థాయిలో నయినా మీడియాతో మొదటినుంచీ సత్సంబం దాలు తక్కువేనంటున్నారు. హైదరాబాద్‌ స్థాయి లోనూ కొంతమందితో తప్ప మొత్తంగా మీడియా తో సన్నిహిత సంబంధాలు లేవు. ఇప్పుడు రాజకీయాల్లో మీడియా ప్రాధాన్యం పెరిగింది. మీడియాపై ఎన్ని విమర్శలున్నప్పటికీ, దాని ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదన్నది నిర్వివాదం. చీఫ్‌విప్‌, స్పీకర్‌గా పనిచేసిన ఆయనకు అది అనుభవమే.

అయితే, అప్పుడు ఆయనకు మీడియాతో పెద్దగా పనిలేదు. స్పీకర్‌గా ఉన్న సమయంలో అసెంబ్లీలో ఆంక్షలు విధించడం ద్వారా ‘కిరణ్‌ మీడియా వ్యతిరేకి’ అన్న ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో.. మీడియా విషయంలో ఆయన ధోరణి అదేవిధంగా కొనసాగిస్తారా? లేక కాలమాన రాజకీయ పరిస్థితులు, అవసరాలు, మనుగడను దృష్ట్యా పాత ధోరణి మార్చుకుని ఆ ముద్ర తొలగించుకుంటారా అన్నది మరో ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితిలో మీడియా వ్యతిరేక ధోరణి అనుసరిస్తే కష్టమేనంటు న్నారు. రోశయ్య హయాంలో మీడియాలో ఒక వర్గాన్నే ప్రోత్సహించే వారు. వైఎస్‌ హయాంలో మీడియా భేటీల విషయంలో ప్రెస్‌ సెక్రటరీ ద్వారా అపాయింట్‌ మెంట్లు ఇచ్చేవారు.
దానితో ఎలాంటి సమస్యలూ రాలేదు.

cm-huggఈ విషయంలో నిన్నటి వరకూ కొనసాగిన ప్రెస్‌ సెక్రటరీ సఫలీకృతులయ్యారు. రోశయ్య ఆ పద్ధతి మార్చేశారు. నచ్చిన వారినే ప్రోత్సహిం చడం, ప్రెస్‌ సెక్రటరీతో సంబంధం లేకుండా అపాయింట్‌ మెంట్లు ఇవ్వడంతో చాలామంది దూరమయిన పరిస్థితి ఏర్పడింది. మరి కిరణ్‌ కూడా ‘ఆస్థాన విద్వాంసుల’కే పరిమితమవుతారా? లేక అందరివాడవుతారా చూడాలి.ఇక ప్రధానంగా.. ప్రతిపక్షమైన టీడీపీని ఎదుర్కొనే విషయంలో కిరణ్‌ ఎంతవరకూ సఫలమవుతారన్నదీ ఆసక్తికరంగా మారింది. చీఫ్‌ విప్‌గా ఉన్నప్పుడు టీడీపీపై ఒంటికాలుతో విరుచుకుపడిన కిరణ్‌, ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆ మోతాదులో ఎదుర్కోగలరా అన్నదీ మరో ప్రశ్న.


రాష్ట్రంలో ఇప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులు మారి, నాలుగో కృష్ణుడు కూడా రాబోతున్నారన్న అభిప్రాయం, కాంగ్రెస్‌లో మళ్లీ సీఎంలను మార్చే సంస్కృతి ప్రారంభమయిందన్న ప్రచారం మొదలయిన నేపథ్యంలో.. ప్రజల్లో పార్టీపై మళ్లీ 1983 మాదిరిగానే దురభిప్రాయం మొదలవుతుంది. అటు సొంత పార్టీలోని ప్రత్య ర్థులు, ఇటు టీడీపీని ఏకకాలంలో ఎదుర్కోవడం లోనే ఆయన రాణిస్తారా లేదా అన్నది తేలుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

The Chief Minister had a busy day yesterday ..meeting the who's who of Indian Government

 

 

 
 
 

Saturday, November 27, 2010

హస్తవాసి తేలేది హస్తినలోనే * రాష్ట్ర కేబినెట్ ఆశావహులతో ఢిల్లీ కిటకిట

రాష్ర్ట కేబినెట్‌లో చోటుకోసం శతవిధాలా యత్నాలు
కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం
ఆశల పల్లకిలో తాజా మాజీలు, పాత మాజీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు


ఢిల్లీలో వాలిన దాదాపు 50 మంది నేతలు.. వారి అనుచరగణం
అహ్మద్ పటేల్, మొయిలీ, ప్రణబ్ తదితరుల ఆఫీసుల్లో సందడి
కొందరు రహస్యంగా... కొందరు బహిరంగంగా యత్నాలు
ఆశల పల్లకి
మంత్రి పదవులకోసం నేతల పోటాపోటీ  
నేడు ఢిల్లీకి సీఎం కిరణ్ హైకమండ్‌తో చర్చలు 
కేబినెట్ కూర్పే అజెండా * జాబితాతో రాత్రికి రాక
అంతా ఓకే అయితే రేపే ప్రమాణ స్వీకారాలు

లేదంటే బుధవారమే
మంచిరోజే కారణం
ఆశావహుల్లో హైటెన్షన్
ఢిల్లీలో
నేతల కోలాహలం
జగన్‌తో 21మంది భేటీ

 టెన్షన్ హైటెన్షన్‌గా మారుతోంది. అధికార పార్టీ నేతలకు బీపీలు పెరుగుతున్నాయి. నరాలు తెగుతున్నాయి. 'రాజు' ఎవరో తేలిపోయింది! ఇక మంత్రుల ముచ్చటే మిగిలింది. ఎవరికి వారు 'మేమూ మంత్రి పదవులకు అర్హులమే' అంటున్నారు! 'డిగ్రీ పాస్ అయిన వాళ్లు ఐఏఎస్ కావాలనుకున్నట్లే... ఎమ్మెల్యేలైన వారంతా మంత్రులు కావాలనుకుంటారు! ఇందులో తప్పేముంది?' అని ప్రశ్నిస్తున్నారు. కడప ఎంపీ జగన్ ముఖ్యమంత్రి కావాలని గట్టిగా నినదిస్తున్న వారు కూడా... కిరణ్ కేబినెట్‌లో మంత్రులయ్యేందుకు పోటీ పడుతున్నారు. వారూ వీరని ఎందుకు! ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే నుంచి... ఆరేడుసార్లు ఎమ్మెల్యేలుగా, ఇప్పటికే మంత్రులుగా పని చేసిన వారి వరకు! అందరూ కుర్చీపై కన్నేశారు. ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలూ కేబినెట్‌లో బెర్తుల కోసం కాచుకుని కూర్చున్నారు. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో వాలిపోయి... ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. తాజాగా మాజీలైన వారు ఈ పోటీలో ముందున్నారు. పోటీదారులు సుమారు రెండొందల మంది! కానీ... గరిష్ఠంగా ఇవ్వగలిగే మంత్రి పదవులు మాత్రం నలభై నాలుగే!

తొలి విడతలో ఎంత మందిని కేబినెట్‌లో చేర్చుకుంటారు? ఎవరిని చేర్చుకుంటారు? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ టూరులో సమాధానాలు లభించే అవకాశముంది. శనివారం ఉదయం 6.40 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. అంతా ఓకే అయితే... జాబితాపై శనివారం అధిష్ఠానం ఆమోదముద్ర పడితే, ఆదివారమే విస్తరణ జరగవచ్చు. ఆ రోజు సప్తమి, మంచి రోజు! సోమ, మంగళవారాలు అష్టమి, నవమి! అవీ పోతే... బుధవారం! అప్పటిదాకా ఆగడం సాధ్యమేయ్యేనా! అన్ని రోజులు ఈ హైటెన్షన్, ఒత్తిళ్లు, లాబీయింగ్‌లు తట్టుకోవడం కష్టం. అందువల్ల ఆదివారమే 'మంత్రాంగం' పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

గతంలో ఆదివారం ప్రమాణస్వీకారాలు జరిగిన సందర్భాలున్నాయి. సోనియాకు కృతజ్ఞతలు చెప్పడం, మంత్రివర్గం ఏర్పాటుపై అధిష్ఠానం ఆమోదం పొందడానికే సీఎం ఢిల్లీకి వెళ్తున్నారు. నాయకత్వ మార్పు సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్‌లతో పాటు... కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో కిరణ్ సమావేశం కానున్నారు. మేడమ్ సోనియాగాంధీతో మధ్యాహ్నంలోగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం అయితే.. శనివారమే సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని తెలుస్తోంది. వస్తూ వస్తూ 'మంత్రుల జాబితా' తీసుకురావడం దాదాపుగా ఖాయమని చెబుతున్నారు. శనివారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి వీరప్ప మొయిలీ అందుబాటులో ఉండరని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే... ఆయన పరోక్షంలోనే మంత్రివర్గం కసరత్తు జరగనుంది.

వరుస భేటీలు: ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండో రోజున కిరణ్‌కుమార్‌రెడ్డిని పలువురు ప్రజా ప్రతినిధులు కలిశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం రెండు దఫాలుగా సీఎంను కలిశారు. మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు. మంత్రివర్గం కూర్పు విషయంలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కిరణ్ స్పష్టం చేశారని సమాచారం. శుక్రవారం ఉదయం సందర్శకులను కలసిన అనంతరం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. పాలనా వ్యవహారాలపై చర్చించారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి రోశయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు.

రాజ్ భవన్ నుంచి రోశయ్య నివాసానికి వెళ్తున్న సమయంలోనే... ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు అందింది. గురువారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వైఎస్ జగన్ నివాసం కూడా సందడి సందడిగా మారింది. శుక్రవారం ఆయనను సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. వీరిలో పలువురు విలేకరులతో మాట్లాడారు. 'మేమూ మంత్రి పదవులు ఆశిస్తున్నాం' అని నిర్మొహమాటంగా చెప్పారు. అదే సమయంలో... జగన్‌ను విస్మరిస్తే పార్టీ నాశనమవుతుందని శాపనార్థాలు పెట్టారు. జగన్‌ను కలిసిన వారిలో 90 శాతం మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం కిరణ్ వద్దకు వెళ్లారు. మంత్రి పదవులు ఆశిస్తూ విన్నపాలు చేసుకున్నారు. మరోవైపు... శుక్రవారం రాత్రి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, వి.హనుమంతరావులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

తాజా మాజీల కలవరం: మంత్రి పదవులకోసం పోటీ పడుతున్న వారి సంఖ్య చూసి తాజా మాజీలు కలవర పడుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరగడంతో మొన్నటిదాకా మంత్రులుగా ఉన్న తాము కూడా ఇతరులతో పోటీ పడాల్సి వస్తోందని వాపోతున్నారు. తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకునేందుకు, అధిష్ఠానం పెద్దలను కలిసేందుకు వీలుగా ఢిల్లీకి వెళ్తున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లేందుకు నేతలు క్యూ కట్టడం చూసిన ఒక మాజీ మంత్రి ఆశ్చర్య పోయారు. "ఇంత మంది ఢిల్లీకి వెళ్తున్నారా? వీళ్లందరికీ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం లభిస్తుందా?'' అని ఆశ్చర్యపోయారు. అన్నట్టు ఈసారి పైరవీల్లో కొంత ప్రత్యేకత కనిపిస్తోంది. నేతలు తమకు పదవి ఇవ్వాలని కోరుకోవడంతోపాటు... తమకు ప్రధానంగా పోటీగా ఉండే జిల్లాలోని నేతలకు వ్యతిరేకంగా నివేదికలు సమర్పిస్తున్నారు. ఒకటి పైరవీ అయితే... ఇంకోటి 'వి'పైరవీ అన్నమాట!

పీసీసీ, డిప్యూటీ సీఎం మాటేమిటి?: మంత్రివర్గం కూర్పుతోపాటు పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని కూడా శనివారం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పీసీసీకి బొత్స సత్యనారాయణ పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. అయితే... పీసీసీ పీఠంతోపాటు మంత్రి పదవి కూడా ఉంటే పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని ఆయన వర్గీయులు అంటున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు మంత్రిగా కూడా ఉన్నారు. గతంలో ఎంఎ ఆజీజ్ కూడా ఇలా జోడు పదవులు నిర్వహించారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా... దామోదర రాజ నరసింహ పేరు గట్టిగా వినిపిస్తోంది. సహజగా... హోంశాఖను ఉప ముఖ్యమంత్రులే నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది.

కొత్త కేబినెట్‌లో చాన్స్ కోసం ఆశావహ కాంగ్రెస్ నేతలు దేశ రాజధానికి తరలివచ్చారు. నూతన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాకముందే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ అధినాయకత్వంతో చర్చించడానికి ముఖ్యమంత్రి శుక్రవారం ఢిల్లీ వస్తారని ప్రచారం జరగడంతో దాదాపు 50మంది హస్తినలో వాలారు. ఇందులో దాదాపు 25 మంది గురువారం రాత్రికే చేరుకోగా మిగతావారు శుక్రవారం దిగారు. తరలివచ్చిన ఆశావహుల్లో ప్రముఖులు, సీనియర్లు, జూనియర్లు, తాజా మాజీ మంత్రులు, పాత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారు. వీరి కోసం తమకున్న పాత సంబంధాలను ఉపయోగించడానికి బయల్దేరివచ్చిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వీరందరి రాకతో ఆంధ్రాభవన్‌కు ఖద్దరు కళొచ్చింది... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీయే మొత్తంగా ఢిల్లీ తరలివచ్చిందా అనిపించే వాతావరణం నెలకొంది. మీడియా ప్రతినిధుల పలకరింపులు, ఎవరికొచ్చే అవకాశముందంటూ ఆరాలు, టీవీ చానళ్లతో ముక్తసరి మాటలు... ఇలా భవన్ ఆవరణలో ఎక్కడలేని సందడి నెలకొంది.

‘పెద్దల’ ఇళ్లచుట్టూ ప్రదక్షిణలు: మంత్రి పదవులకోసం ఢిల్లీ చేరిన నేతలంతా వాహనాల్లో రయ్‌మంటూ ఢిల్లీ వీధుల్లో తమకు తెలిసిన పెద్దలను కలిసే ప్రయత్నాల్లో బిజీగా తిరుగుతూ కనిపించారు. కాంగ్రెస్ అధినేత రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ పెద్దలు మోతీలాల్ వోరా, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి, ఆస్కార్ ఫెర్నాండెజ్, గులాం నబీ ఆజాద్ తదితరులను కలుసుకునేందుకు ఎవరికివారు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మాజీ మంత్రి పార్థసారథి, తాను సీనియర్లమని చెప్పారు. గతంలో తనకు అవకాశం రాలేదని, ఈసారి వస్తుందేమోనని ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అక్కడే ఉన్న పార్థసారథి దీనిపై ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ వెళ్లిపోయారు. కొందరు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు తాజా మాజీ మంత్రులు పార్లమెంట్‌కు వెళ్లి కనిపించిన పెద్దలకు ఓ నమస్కారం పెట్టుకుని వచ్చారు. మరికొందరు మొయిలీని కలిసి తమ కోరికను విన్నవించుకున్నారు. ఇంకొందరు పార్టీ పెద్దలకు సన్నిహితంగా మెలిగే రాష్ట్ర ఎంపీలను, ఇతర రాష్ట్రాల కీలక ఎంపీలను మంచిచేసుకునే పనిలో పడ్డారు.


గురువారం రాత్రికే ఢిల్లీ వచ్చిన కొందరు తాజా మాజీమంత్రులు, పాతమాజీ మంత్రులు పార్టీ పెద్దల్లో ముగ్గురి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారని సమాచారం. పార్టీ పెద్దల దర్శనభాగ్యం కల్పించమని కాంగ్రెస్ నేతలు చేసిన ఫోన్లతో ఆయా పెద్దల పీఎస్‌లు, పీఏల చెవులు హోరెత్తిపోయాయి. వీళ్ల పదవుల గోల తమ చెవుడుకొచ్చేట్టుందని ఓ ఇద్దరు నేతల పీఎస్‌లను వ్యాఖ్యానించారంటే ఏస్థాయిలో వారిపై ఒత్తిడి ఉందో తెలుసుకోవచ్చు.

అంతా రహస్యం...: ఢిల్లీ చేరుకున్న మాజీలు, సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తామెక్కడున్నామో తెలీకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా తాజా మాజీమంత్రులైతే ఆంధ్రాభవన్‌లో గదులు సిద్ధం చేసినా సరే భవన్‌కు దూరంగా హోటళ్లు, మిత్రుల ఇళ్లు, రహస్య ప్రదేశాల్లో బసచేయడం విశేషం. అయితే ఈ రహస్యమంతా శనివారం ఉదయం బట్టబయలు కాక తప్పదని, సీఎం వచ్చే సమయానికి ఆంధ్రప్రదేశ్ భవన్ ఆవరణ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌ని తలపించడం తథ్యమని పరిస్థితి చెప్తోంది. మంత్రి పదవి కోసం ఢిల్లీ చేరుకున్న నేతల్లో కడప ఎంపీ వైఎస్ జగన్ చిన్నాన్న ఎమ్మెల్సీ వైఎస్ వివేకానందరెడ్డి కూడా ఉండటం గమనార్హం. ఓదార్పు యాత్ర విషయమై అధిష్టానానికి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విభేదాలున్న సంగతి తెలిసిందే. ఓదార్పు యాత్రకు మద్దతు ఇచ్చినవారిపై చర్యలు తీసుకుంటున్న విషయమూ విదితమే. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి ఢిల్లీకి చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఢిల్లీ వచ్చిన ఆశావహులు వీరే..

తాజా మాజీ మంత్రులు: బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, దామోదర్ రాజనరసింహ, ఆనం రామనారాయణరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, కె.పార్థసారథి, జూపల్లి కృష్ణారావు, పి.బాలరాజు

ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లు: మల్లు భట్టి విక్రమార్క, సాకే శైలజానాథ్, కొండ్రు మురళి

సీనియర్లు, ఎమ్మెల్యేలు: జె.సి.దివాకర్‌రెడ్డి, డి.ఎల్.రవీంద్రారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, తోట నర్సింహం, టి.జి.వెంకటేష్, రాంభూపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, శేషారెడ్డి, మస్తాన్‌వలి, నాని, వి.వి.సత్యనారాయణ, అనిల్‌కుమార్, వెంకట్రామయ్య, డి.వై.దాసు, రంగారెడ్డి, తూర్పు జయప్రకాష్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్, భిక్షపతిగౌడ్, నర్సారెడ్డి, కిష్టారెడ్డి, ముత్యంరెడ్డి, సక్రూనాయక్, శ్రీశైలం గౌడ్, రాజయ్య, ఎం.విజయప్రసాద్

ఎమ్మెల్సీలు: వై.ఎస్.వివేకానందరెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గోపీనాథ్, ప్రేమ్‌సాగర్‌రావు, రుద్రరాజు పద్మరాజు, సుగ్రీవులు, కె.జనార్దన్, కాసాని జ్ఞానేశ్వర్.

మహా మంత్రాంగం
కొత్త సీఎంకు అధిష్టానం షరతులు
మచ్చలేని వారికే కేబినెట్‌లో చోటు
విధేయతే ప్రధాన అర్హత
జగన్ వర్గీయులకు నో చాన్స్
నేడు ఢిల్లీకి కొత్త సీఎం కిరణ్
సోనియా, మన్మోహన్‌లతో భేటీ
దేశ రాజధానిలో నేతల హల్‌చల్
పదవులకోసం ముమ్మర లాబీయింగ్

'షరతులు వర్తించును'... ఇది అధిష్ఠానం మాట! మంత్రి పదవుల కోసం జాబితా తయారు చేసేటప్పుడు నాలుగు ఒకటి... అవినీతిపరులకు చోటు కల్పించొద్దు. రెండు... కడప ఎంపీ జగన్ వర్గీయులకు చెక్ చెప్పాలి. మూడు... యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలి. నాలుగు... విధేయతకు పట్టం కట్టాలి! జాబితా తయారీ సమయంలో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.

వైఎస్ మంత్రివర్గంలో అవినీతిపరులుగా ముద్ర పడిన వారి జాబితా ఇప్పటికే అధిష్ఠానం వద్ద ఉందని... ఒకవేళ వారి పేర్లను జాబితాలో జొప్పించినా కట్ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 'కరుడు గట్టిన జగన్ వర్గీయులు'గా ముద్ర పడిన వారిని పూర్తిగా దూరంగా పెట్టాలని అధిష్ఠానం కిరణ్‌కు స్పష్టం చేసింది. ఇప్పటికే తమకు విధేయత ప్రకటించిన వైఎస్ సోదరుడు వివేకానంద రెడ్డికి మాత్రం మంత్రి పదవి ఇచ్చే విషయంలో అధిష్ఠానం సుముఖంగా ఉంది.

దీనివల్ల వైఎస్ అభిమానులు కూడా హర్షిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. శనివారం ఉదయం ఢిల్లీ వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ఒక ప్రాథమిక జాబితా రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన శనివారం పార్టీ అధ్యక్షురాలు సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు పార్టీ పలువురు సీనియర్ నేతలను కలుసుకుంటారు. మంత్రివర్గంలో తొలిదశలో 15 నుంచి 20 మందికి స్థానం లభించవచ్చునని పార్టీ వర్గాలు చెప్పాయి. ఉప ముఖ్యమంత్రి పదవికి దామోదర్ రాజనరసింహ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ... మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య కూడా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.

వారు ఇప్పటికే ఢిల్లీలో వేర్వేరు హోటళ్లలో మకాం వేశారు. అలాగే... పీసీసీ అధ్యక్ష పదవికి బొత్స సత్యనారాయణకు పోటీగా ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావును రంగంలోకి దించేందుకు పలువురు సీమాంధ్ర ఎంపిీలు ప్రయత్నిస్తున్నారు. అయితే, తనకు పిీసీసీ కన్నా కేంద్ర మంత్రి పదవే ముఖ్యమని కావూరి చెబుతున్నట్లు తెలుస్తోంది. మంత్రిపదవులతోపాటు పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఖరారవుతుందని, వీటిలో ఏదో ఒకటి తనకు దక్కడం ఖాయమని బొత్స ధీమాగా ఉన్నారు. ఆయన శుక్రవారం పార్లమెంట్ సెంట్రల్ హాలులో కేంద్ర మంత్రులు జై రాం రమేశ్, పళ్లంరాజు, పనబాక లక్ష్మితో పాటు పలువురు సీమాంధ్ర, తెలంగాణ ఎంపీలతో విస్త­ృత మంతనాలు జరిపారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి వస్తే అందర్నీ కలుపుకొనిపోతానని, తనకు ఏ గ్రూపులు లేవని బొత్స వారికి నచ్చజెబుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించవద్దని కోరుతున్నారు.

తనంతట తాను ఢిల్లీ వచ్చానని, అ«ధిష్ఠానం ఏ బాధ్యతలు అప్పజెప్పినా నెరవేరుస్తానని ఆయన విలేకరులతో అన్నారు. మరోవైపు తెలంగాణకే పీసీసీ అధ్యక్ష పదవి దక్కాలని, ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు వంటిదని తెలంగాణ ఎంపీలు భావిస్తున్నారు. దీనిపై గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, పొన్నం ప్రభాకర్ తదితరులు చర్చలు జరుపుతున్నారు.

కిటకిట...: అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకుని, మంత్రి పదవులు సాధించేందుకు పెద్దసంఖ్యలో నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో వాలిపోయారు. ఎవరికి వారు, ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. దీంతో... దేశ రాజధాని రాష్ట్ర రాజకీయాలతో వేడుక్కుతోంది. ఒక్కసారిగా వచ్చి పడుతున్న నేతలకు బస కల్పించలేక ఏపీ భవన్ అధికారులకు తలప్రాణం తోకకొస్తోంది. ఏపీ భవన్‌లోని గదులన్నీ ఇప్పటికే నిండిపోయాయి.

ప్రస్తుతం 'మాజీ'లు కావడంతో... తాజా మాజీ మంత్రులకు కూడా ఏపీ భవన్‌లో గది దొరకడం దుర్లభంగా మారింది. పీసీసీ రేసులో ముందున్న బొత్స సత్యనారాయణకే ఇక్కడ గది లభించలేదు. దీంతో... ఆయన ఎంపీగా తన సతీమణి బొత్స ఝాన్సీకి ఇచ్చిన క్వార్టర్‌కు వెళ్లారు. శనివారం మరింత పెద్ద సంఖ్యలో నేతలు ఢిల్లీకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సదరన్ హోటల్, జనపథ్‌తో పాటు పలు ఇతర హోటళ్లను కూడా బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు.