Showing posts with label Kiran. Show all posts
Showing posts with label Kiran. Show all posts

Friday, November 25, 2011

దిశ నిర్దేశిస్తా ... దశ మారుస్తా

 
ఉదయిస్తున్న కిరణం  
అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఏడాది పాలనలో తనదైన ముద్ర వేయటంలో సఫలమయ్యారు. అధికారం పగ్గాలు చేపట్టిన ప్రారంభంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ బయటపడకుండా తనదైన శైలిలో పాలన సాగించిన కిరణ్‌ ఇప్పుడిప్పుడే పూర్తిగా కుదురుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నారు. అధిష్టానం వద్ద క్రమంగా తన పలుకుబడి పెంచుకుంటూ జటిలమైన సమస్యలను సైతం పరిష్కరించే స్థాయికి కిరణ్‌ ఎదిగారు. ఈ ఏడాది పాలనలో ఎక్కడా ఆయనపై అవినీతి ఆరోపణలు రాకపోవటం మరో విశేషం. kiran4
రాజకీయ ప్రత్యర్థులే కాకుండా విపక్షాలు సైతం ఈ విషయంలో ఆయనవైపు వేలెత్తి చూపలేకపోయారు. తెలంగాణ వాదం అతి బలంగా ఉన్న సమయంలోనూ 42 రోజులు సాగిన సకల జనుల సమ్మె సందర్భంగా సైతం కిరణ్‌ ఎక్కడా ఏ విషయంలోనూ రాజీ పడలేదు. ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ అన్ని కేసులనూ ఎత్తివేయటం సాధ్యం కాదని కరాఖండిగా తేల్చి చెప్పారు.

పెరుగుతున్న పలుకుబడి....
మొదట్లో బాలారిష్టాలు...


మొదట్లో మంత్రివర్గం కూర్పు వద్ద నుంచి ఉవ్వెత్తున ఎగిసిన సకల జనుల సమ్మె దాకా అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కిరణ్‌ మౌనంగా తన పని తాను చేసుకుపోయా రు. అనేక సందర్భాలలో ఢిల్లీ వద్ద తన పలుకుబడిని నిరూపించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆరు సంవత్సరాల పాలనలో ప్రారంభిం చిన పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకా లను అమలు చేయటంలో కిరణ్‌ విజయం సాధించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయ చాతుర్యం...
kiran 

వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా జగన్‌ వర్గానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినప్పటికీ కిరణ్‌ కంగారు పడలేదు. మౌనంగా అన్ని పరిణామాలను గమనిస్తూనే తన వ్యూహాన్ని అంతర్గతంగా అమలు చేయటం ప్రారంభించారు. ఫలితంగా జగన్‌ వైపు వెళ్ళిన కొందరు ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని మళ్ళీ కాంగ్రెస్‌ వైపు దృష్టి సారించారు. ఒకవైపు వ్యూహాలను అమలు పరుస్తూనే మరోవైపు తనదైన శైలిలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి అవసరమైన కార్యక్రమాలను ఆమోదింపజేసుకుంటున్నారు.
తొలి ఘన విజయం14ఎఫ్‌ రద్దు...
ఇక ఎన్నటికీ జరగదనుకున్న 14ఎఫ్‌ నిబంధనను కిరణ్‌ కేంద్రాన్ని ఒప్పించి రద్దు చేయించగలగటంతో ఆయన తొలి విజయం ప్రారంభమైంది. పోలీసు నియామకాలకు సంబంధించిన ఈ వివాదాస్పద నిబంధన తెలంగాణ ప్రాంతంలో చిచ్చు రేపింది. ఎసై్స అభ్యర్థులలో ఎంతో ఆందోళన కలిగించిన ఈ నిబంధన రద్దు కావాలని తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ ఫలితం లేకపోగా కిరణ్‌ దాన్ని రద్దు చేయించగలిగారు.

నీట్‌ వాయిదా...
తాజాగా విద్యార్థి లోకానికి ఎంతో ఆందోళన కలిగించిన నీట్‌ పరీక్షా విధానాన్ని రాష్ట్రానికి సంబంధించినంత వరకు రెండేళ్ళు వాయిదా వేయించటంలో కిరణ్‌ సఫలమయ్యారు. శుక్రవారం కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో టెలిఫోన్‌లో మాట్లాడి సానుకూలంగా వాయిదా వేయించగలిగారు. దీనివల్ల విద్యార్థి లోకానికి, వారి తల్లిదండ్రులకూ ఎంతో ఊరట చిక్కినట్టే లెక్క.
మద్దతు ధర...
kiran2 

అలాగే ధాన్యానికి రూ.80 హెచ్చించటంతో పాటు రూ.1,200 బోనస్‌ ప్రకటించటంతో రైతులకు ఊరట కలిగించినట్టయింది. ధాన్యం నిల్వల కోసం గోదాముల నిర్మాణానికి స్థలాలను కేటాయించాలన్న ఆదేశంతో కిరణ్‌ సర్కార్‌ రైతులకు మరో మేలు చేకూర్చి నట్టయింది.
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 1960, సెప్టెంబర్‌ 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన విధ్యాభ్యాసమంతి హైదరాబాద్‌లోనే కొనసాగింది. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాల యాలలో బీకాం, ఎల్‌ఎల్‌బీలను చదివారు.

వ్యక్తిగత జీవితం....
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 1960, సెప్టెంబర్‌ 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన విధ్యాభ్యాసమంతి హైదరాబాద్‌లోనే కొనసాగింది. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాల యాలలో బీకాం, ఎల్‌ఎల్‌బీలను చదివారు. నిజాం కళాశాల విద్యార్థి సంఘం నాయకునిగా పనిచేశారు. ఇక రాష్ట్రం తరపున రంజీ ట్రోఫీ క్రికెట్‌ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. కిరణ్‌కుమార్‌ రెడ్డి కెప్టెన్‌గా ఉన్నప్పు డు జట్టులోని ప్రముఖులలో భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టె న్‌ అజారుద్దీన్‌, ప్రఖ్యాత క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షా భోగ్లే టీం సభ్యులుగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వివాహం రమణా రెఇ్డ కుమార్తె రాధికారెడ్డితో జరిగింది. ఈ దంపతలుకు కుమార్తె నీహారిక,కుమారుడు నిఖిలేష్‌ ఉన్నారు.

రాజకీయ ప్రస్ధానం...
kiran5 

తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత 1988లో వాయల్పాడుఉప ఎన్నికల్లో తల్లినల్లారి సరోజమ్మ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయింది. అనంతరం 1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్‌ పోటీ చేసి గెలిచారు.1994లో భారీ తేడాతో ఓటమి చవిచూసినా 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ నమోదుచేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇక రాజకీయంగా నేదురుమల్లిజనారద్నరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలతో సన్నిహితంగా ఉండేవారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డితో మొదట్లో విరోధమున్నా తర్వాత ఆయనకు సన్నిహితమయ్యారు. ఇక 2010 నవంబర్‌ 25న కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ 16వ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు.

పాత పధకాల కొనసాగింపు....
ఈ కొత్త పథకాలే కాకుండా గత ఏడు సంవత్సరాలుగా అమలవుతున్న రైతులకు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం, ఫీజు రీయంబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, పింఛన్లు, పావలా వడ్డీ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వంటి పథకాలను సైతం కొనసాగిస్తున్నారు. విమర్శలు ఎదురైనప్పుడు వెనుకడుగు వేయకుండా, ఇటు పాలనా పరంగా, అటు రాజకీయ ఇబ్బందులను సైతం తట్టుకుంటూ కిరణ్‌ తన పని తాను చేసుకుపోతున్నారన్న ప్రశంసలు ఇప్పుడు ఆయన వైరి వర్గాల నుంచి సైతం అందుతున్నాయి.

ఏడాదిపాలనలో ప్రవేశపెట్టిన పధకాలు....


  • దరల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ...ఇది మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో పని చేస్తుంది...
  • మీ సేవ...ఐటీ పరిజ్ఞానం ద్వారా సామాన్యుడికి పారదర్శకంగా, సులభంగా, వేగంగా సేవలందించే పథకం...12 సేవలతో ప్రారంభమైన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 50 సేవలను అందిస్తుంది.
  • రచ్చబండ 1, 2...ఎలాంటి అండ లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల దాదాపు కోటి మంది పేదలకు ప్రయోజనం కలుగుతుంది.
  • విద్యా పక్షోత్సవాలు...రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ధ్యేయంతో రూ.3,500 కోట్ల వ్యయంతో గత జూన్‌ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
  • రాజీవ్‌ యువ కిరణాలు (మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు)...2014 నాటికి 15 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించటం, పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాలతో అనుసంధానం చేసి ఉపాధి కల్పించటం, పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా పాఠ్యాంశాలను తీర్చిదిద్దటం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
  • ఇందిర జలప్రభ...రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావటానికి రూ.1,800 కోట్లతో అక్టోబర్‌ రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల కుటుంబాలను పేదరికానికి దూరం చేయాలన్నది సంకల్పం.
  • రూపాయికే కిలో బియ్యం...రాష్ట్రంలో నిరుపేదలందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 7.50 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా.
  • స్టేట్‌ మిల్క్‌ మిషన్‌...రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
  • సాగురైతుల రక్షణకు చట్టం...కౌలు రైతులకు మేలు చేకూరే విధంగా భూమి లైసెన్సు పొందిన సాగుదారుల ఆర్డినెన్స్‌ను చట్ట రూపంలోకి తెచ్చారు.
  • పంట రుణాలకు జీరో వడ్డీ...లక్ష రూపాయల దాకా రుణం తీసుకున్న రైతులు సకాలంలో దాన్ని చెల్లిస్తే జీరో వడ్డీ పథకం వర్తింపజేస్తారు. దీనివల్ల 95 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
  • 1.16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌...వచ్చేనెల చివరికల్లా 1,16,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను పూర్తిగా నోటిఫై చేస్తారు. ఏపీపీఎస్సీ, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, ఉపాధ్యాయుల డీఎస్సీ నియామక సంస్థ వంటివి ఉద్యోగాలను భర్తీ చేస్తాయి...
  • స్ర్తీనిధి మహిళా బ్యాంక్‌...మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయించకుండా తక్కువ వడ్డీతో 24 వాయిదాలలో తీర్చుకునే వెసులుబాటు కల్పించారు

Friday, January 28, 2011

అభివృద్ధి చూసి కొందరికి.. కడుపు కాలుతోంది అందుకే రచ్చబండకు ఆటంకాలు...

 

రహదారుల అభివృద్ధికి 20 వేల కోట్ల ప్యాకేజి
ఆగిన పనుల పూర్తికే సోనియా నన్ను నియమించారు!
వైఎస్ సలహాదారుల్లో నేనూ ఒకణ్ని

కర్నూలు, మహబూబ్‌నగర్ సభలలో కిరణ్
అభివృద్ధి చూసి కొందరికి.. కడుపు కాలుతోంది
అందుకే రచ్చబండకు ఆటంకాలు
వ్యతిరేకులపై సీఎం నిప్పులు 
 
"గొంతు లేని వారికి, కండ బలం లేనివారికి, ఆర్థిక, పార్టీల బలం లేని పేదల ఇంటి తలుపు తట్టి కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. రాష్ట్రంలో రూ. 2500 కోట్ల పథకాలను పేదలకు రచ్చబండ సందర్భంగా అందిస్తున్నాం. ఇది చూసి కొందరికి కడుపు కాలుతోంది. అందుకే ఆటంకాలు సృష్టిస్తున్నారు'' అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా, తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తుందని, ఇందుకోసం మరోసారి కూడా రచ్చబండను చేపడుతుందని ప్రకటించారు. 


దివంగత సీఎం వైఎస్ ప్రారంభించిన కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోయాయని, వాటిని పూర్తిచేసేందుకే తనను సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ నియమించారని ఆయన చెప్పారు. గురువారం కర్నూలు ఏపీఎస్పీ మైదానంలోను, మహబూబ్‌నగర్ జిల్లా కోడేరు మండలం సింగాయపల్లిలో నిర్వహించిన రచ్చబండ, బహిరంగ సభల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మరోసారి చెప్పడంతో పాటు.. రచ్చబండను వ్యతిరేకించే పార్టీలపై నిప్పులు చెరిగారు. సింగాయపల్లి సభలో సంక్షేమ పథకాలను వివరించి.. చివరగా పేదలకు ఇన్ని పనులు చేస్తే పొరపాటా? అన్నారు. సభకు వచ్చిన మహిళలతో చేతులెత్తించి ఇదే వారికి సమాధానమన్నారు.

మహిళలు తెలివైనవారని సీఎం ప్రశంసించారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు వారి నియంత్రణలోనే ఉంటాయని, వృథా ఖర్చులు చేయబోరనే ఇళ్లు, భూములు వారిపేరుతో ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు రూ. 20 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశామని, వచ్చే మూడేళ్లలో వీటిని చేపట్టేందుకు ప్రత్యేక ప్యాకేజీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ, జడ్పీ ఛైర్మన్ దామోదర్‌రెడ్డి, ఎంపీ మంద జగన్నాథం, కలెక్టర్ పురుషోత్తంరెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 


ఇక కర్నూలు సభలో మాట్లాడిన సీఎం.. 2009 ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే వైఎస్ రచ్చబండను రూపొందించారన్నారు. దీన్ని ప్రారంభించేలోపే ఆయన మృతిచెందడంతో.. తాను మొదలుపెట్టానన్నారు. పథకాల రూపకల్పనకు వైఎస్‌కు సలహాలిచ్చే కమిటీలో తానూ ఒకడిని చెబుతూ.. మహిళలకు పావలావడ్డీ ప్రవేశపెట్టడంలో తానూ ఒక సలహాదారుడినని వివరించారు. ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్.. ఇలా అందరినీ అందించిన జిల్లా కర్నూలేనన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రికి నిధులు, ఒక మైనారిటీ కళాశాల, దివంగత సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి పేరుతో కల్చరల్ ఆడిటోరియం మంజూరు చేస్తానన్నారు.


సభలో మండలి చైర్మన్ చక్రపాణి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి, ఎస్వీ మోహనరెడ్డి పాల్గొన్నారు. కాగా.. వరద బాధితుల సహాయార్థం కర్నూలు శివారులోని జగన్నాథగట్టులో గృహనిర్మాణ శాఖ, టీవీ9 సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వరద బాధితులకు మీడియా చేయూత అభినందనీయమన్నారు. 

మళ్లీ వస్తా...అభివృది చూస్తా!

"మరిచిపోలేని విధంగా కర్నూలు జిల్లా వాసులు నన్ను ఆహ్వానించారు. ఇక్కడ రూ. 7,444 కోట్లతో జలయజ్ఞం పనులు జరుగుతున్నాయి. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం. మూడునెలల్లో హంద్రీనీవా సుజలస్రవంతి మొదటి దశ పనులు పూర్తి చేసి అనంతపురానికి నీరిస్తాం. ఆ తరువాత నేను మళ్లీ జిల్లాకు వస్తా. జరిగిన అభివృద్ధిని చూస్తా..''నని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

గురువారం జూపాడుబంగ్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకుని కర్నూలులోని ఏపీఎస్పీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాకు చెందిన మంత్రి టీజీ వెంకటేష్, ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అభ్యర్థన మేరకు సీఎం కర్నూలుకు వరాలు కురిపించారు. కర్నూలు పెద్దాసుపత్రి అభివృద్ధికోసం ఆయన తనవంతు కృషి చేస్తానన్నారు. భవనాల మరమ్మతులకోసం ప్రస్తుతం టీజీ అడిగిన రూ. 20 కోట్లను మంజూరు చేస్తామన్నారు. తెలుగుగంగ, గురురాఘవేంద్ర, సిద్దవరం, హంద్రీనీవా, గాలేరు నగరి, పులికనుమ వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వీటివల్ల జిల్లాలో అదనంగా మూడున్నర లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు.

జిల్లాలో నదులున్నా నీటిని వినియోగించుకునే పంపుసెట్లు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. జరిగిన ఆరేళ్ల కాలంలో ఉచిత కరెంటుకోసం రూ.29,500 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేశామన్నారు. ఉపాధి హామీ ద్వారా వచ్చే మార్చి నాటికి రూ. 7,500 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పావలా వడ్డీకింద కర్నూలు జిల్లాకు ఆరేళ్లలో రూ. 32కోట్ల 60 లక్షలు మంజూరు చేశామన్నారు. వచ్చే 15 రోజుల్లో మరో రూ. 22 కోట్లు ఇవ్వనున్నామన్నారు. ఈ యేడాది మార్చినాటికి రావాల్సిన నిధులను ఇస్తామని హామీ ఇచ్చారు. ఉపాధిహామీ పథకాన్ని రైతు పనులకు అనుసంధానంచేసే ఆలోచనలో ఉన్నామని, కేంద్రానికి ప్రతిపాదన పంపామని చెప్పారు. కేంద్రాలని ప్రధాని, రాష్ట్రపతి వంటి వారిని అందించిన జిల్లాను సీఎం పొగడ్తలతో ముంచెత్తారు.

మంత్రుల చేతుల్లోనే కర్నూలు అభివృద్ధి జిల్లా అభివృద్ధి మంత్రులిద్దరి చేతుల్లోనే ఉంద ని సీఎం కిరణ్ చమత్కరించారు. కర్నూలు ఆస్పత్రి గురించి ఆయన మాట్లాడుతూ మంత్రి టీజీ వెంకటేష్ ఫైలు ప్రభుత్వానికి పంపానని చెప్పడం ఏమిటన్నారు. ఆయనే ప్రభుత్వంలో కీలకమైన శాఖకు మంత్రిగా ఉన్నారని, మంత్రులు టీజీ, ఏరాసు జిల్లా అభివృద్ధి ప్రణాలిక ఫైళ్లను నడిపించుకుని పనులు చేయించుకోవాలని సూచించారు.

గుర్తుంచుకునేలా చేయండి : టీజీవీ కర్నూలు జిల్లా ప్రజలు గుర్తుంచుకునేలా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ సీఎంను కోరారు. బహిరంగ సభకు అధ్యక్షత వహించిన ఆయన ముందుగా సీఎం దృష్టికి పలు సమస్యలను తెచ్చారు. రద్దుచేసిన రేషన్ కార్డుల్లో అర్హులైన వారికి పునరుద్దరించాలని కోరారు. ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేయాలని, ఇళ్లనిర్మాణాల విషయంలో ఉన్న కోర్టు కేసులు తొలగిపోయేలా చూడాలన్నారు.

వరదబాధితులకు పరిహారంకోసం నిధులు మంజూరు చేయాలని అడిగారు. కర్నూలు పెద్దాసుపత్రి ఆధునికీకరణకోసం రూ. 169 కోట్లతో మాస్టర్‌ప్లాన్ తయారు చేశామని అందుకు నిధులు సమకూర్చాలని కోరారు. ప్రస్తుతం భవనాల ఆధునికీకరణకోసం రూ. 20 కోట్లతో ఫైలు పంపించామని పరిశీలించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లలో ఒకటైన కర్నూలు ప్రెస్ భవనం శిథాలావస్థలో ఉందని, దానిని అభివృద్ధి పరచాలని కోరారు.

రైతులను కాపాడండి : ఎంపీ కోట్ల కర్నూల రైతులను కాపాడాలని ఎంపీ కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సీఎంను కోరారు. ఎల్లెల్సీ కాలువపై ఆధారపడి సేద్యం చేస్తున్న రైతులు కర్నాటక రైతుల జల చౌర్యంతో కుదేలవుతున్నారన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కిరణ్‌ను కోరారు. రంగాపురం వద్ద 8 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మిస్తే లిఫ్టు ద్వారా రైతులకు కొంత ఊరట కలిగించవచ్చని చెప్పారు.

తన తండ్రి పేరుతో కల్చరల్ ఆడిటోరియం నిర్మాణ మంజూరును ప్రకటించాల్సిందిగా కోట్ల సీఎం చెవిలో చెప్పి ఒప్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్, ఇన్‌చార్జి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి, బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, కోట్ల సుజాతమ్మ, డీసీసీ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, జిల్లా నాయకులు ఎస్వీమోహనరెడ్డి, సుధాకరబాబు, కలెక్టర్ రాంశంకర్ నాయిక్, జేసీ బుద్ధప్రకాష్, డీఆర్వో సూర్యప్రకాష్, అదనపు ఎస్పీ రవీంద్ర నాయిక్, డీఆర్‌డీఏ పీడీ సోనీబాలాదేవి పాల్గొన్నారు.
Click Here!

జిల్లా పర్యటన ఆనందం కలిగించింది

రచ్చబండలో భాగంగా జిల్లాలో పాల్గొన్న కార్యక్రమాలు ఆనందాన్ని కల్గించాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం 10:35 గంటలకు జూపాడుబంగ్లా జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయన్ను ఆందోళనకారులు చుట్టుముట్టినా కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. 98 జీవో ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ ముంపు బాధితులకు ఉపాధి చూపాలని, 2008 డీఎస్సీ అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, బుడగ జంగాలకు జీవో నెం 144 చూపి ఎలాంటి అభివృద్ధి లేకుండా చూపుతున్నారంటూ నిరసనకు దిగారు.

అక్కడ నుంచి 11:45 గంటలకు అక్కడ నుంచి బయల్దేరి 12:05 గంటలకు కర్నూలు ఎస్ఏపీ క్యాంప్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుని టీజీవీ అవుట్‌డోర్ స్టేడియంలో జరిగిన సభ ద్వారా కర్నూలు నగరానికి వరాల జల్లులు ప్రకటించారు. సభ అంత హర్షధ్వానాల మధ్య సాగింది. పెద్దాసుపత్రికి ప్రత్యేక నిధులు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి పేరుతో కల్చరల్ ఆడిటోరియం, మైనార్టీ కళాశాల, జిల్లాలో జలయజ్ఞం కింద చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేస్తాను. వాటి పురోగతి కోసం మరో మూడు నెలల్లో జిల్లాలో పర్యటిస్తానని చెప్పడంతో సభ వీలలకేకలతో మార్మోగింది. ఇద్దరు జిల్లా మంత్రులు జిల్లాకు అవసరమైన పనులకు సంబసందించి వారే నిర్ణయం తీసుకుని ఫైలు తనదాకా తీసుకుని వస్తే కళ్లుమూసుకుని సంతకం చేస్తానన్నారు.

ఈ సందర్బంగా గ్రామీణ, పట్టణ వికెపి సంఘాలకు బ్యాంకు రుణాలు, పావలా వడ్డి నిధులు రూ.42 కోట్లు ఆర్థిక సహాయాన్ని సీఎం పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుంచి 1:10 గంటలకు ఎస్ఏపీ క్యాంప్ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా బయల్దేరి జగన్నాథగట్టు వద్ద ప్రభుత్వం, మరియు టీవీ 9 సంయుక్తంగా నిర్మించిన వరద పునరావాస కాలనీ చేరుకుని టీవీ9 ప్రజానగర్ కాలనీని ప్రారంభించారు.

అక్కడే భోజనం చేసుకుని 2:35 గంటలకు మహబూబ్‌నగర్‌లో జరిగే రచ్చబండ కార్యక్రమానికి హెలికాప్టర్ ద్వారా వెళ్లిపోయారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు ఏరాసు, విజయరామరాజు, టీజీ వెంకటేష్, శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్, ఎంపీ కోట్ల, జడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మురళీకృష్ణ, చెన్నకేశవరెడ్డి వీడ్కోలు పలికారు.
Click Here!

వరద బాధితులకు మీడియా చేయుతఅభినందనీయం:సీఎం

వరద బా«ధితుల కోసం టీవీ-9 చానల్ పక్కా గృహాలను నిర్మించి ఇవ్వడం అభినందనీయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం నగర శివారులోని జగన్నాథగట్టులో టీవీ-9 ప్రజానగర్‌లో నిర్మించిన ఇళ్లను ప్రారంభించి బాధితులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఇళ్లను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాగునీరు, రోడ్లు, మురికి కాల్వలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాలనీ నిర్మాణం కోసం సహకరించిన కలెక్టర్ రాంశంకర్‌నాయక్‌ను వివిధ విభాగాల అ«ధికారులను ఆ సంస్థ సీఈవో రవిప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ రజనీకాంత్ ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం మొక్కలను నాటి ఆ తర్వాత శిలాఫలకాన్ని ఆవిష్కరించి లబ్ధిదారులనుద్దేశించి కాసేపు మాట్లాడారు.


కొత్త కర్నూలు నేటితో జాతికి అంకితం - టీవీ9 సీఈవో రవిప్రకాష్ టీవీ-9 ప్రజానగర్ ద్వారా కొత్త కర్నూలు ఏర్పాటైందని టీవీ9 సీఈవో రవిప్రకాష్ అన్నారు. మోడల్ కర్నూలుగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. 400 ఇళ్లు పూర్తి చేయగలిగామని, రెండో విడతగా మరో 750 ఇళ్లను నిర్మించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

పాలమూరుకు వరాల జల్లు

రెండునెలల వ్యవధిలో జిల్లాకు రెండోసారి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రచ్చబండ సందర్భంగా వరాల జ ల్లు కురిపించారు. తాను సీఎంగా ఉ న్నంతకాలం, జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తూ, జిల్లామంత్రులు ప్రస్తావించిన అన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించారు. గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు కోడేరు మండలం సింగాయిపల్లికి చేరుకున్న సీఎం, ఇక్కడ రెండు గంటల పాటు గడిపారు.
దాదాపు అరగంటపాటు రచ్చబండలో పాల్గొన్న ఆయన, మరో గంటపాటు బహిరంగసభలో పాల్గొన్నారు. ఇందులో, ఆయన ప్రసంగం పావుగంట సాగింది. రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ, ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. బహిరంగసభలో జిల్లా మంత్రులు, ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై సీఎం ప్రకటన చేశా రు. జిల్లా నాయకులు తనకు అత్యంత సన్నిహితులని పేర్కొంటూ, సీఎంగా, ఎంత అభివృద్ధి వీలయితే అంతమేర చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భం గా, మహిళా స్వయం సహాయక సం ఘాలకు రూ. 530 కోట్ల చెక్కును అందజేశారు

. అంతకుముందు, బహిరంగసభలో దేవాదాయశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, పేదలకు కొత్తగా 54వేల ఇళ్లు మంజూ రు చేసినట్లు చెప్పారు. వెనుకబడిన ప్రాంతమైన జిల్లాను గతంలో చంద్రబాబు దత్తత తీసుకున్నట్లు ప్రకటించినా, ఆయన మాటలు కోటలు దాటలేదని ఎద్దేవా చేశారు. జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు మరో 20శాతం మేర నిధులు వెచ్చిస్తే, 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనికోసం చర్యలు తీసుకోవాలని సీఎంను అభ్యర్థించారు.

సోమశిల-సిద్ధేశ్వరం బ్రిడ్జి పనులు సగంలో ఆగిపోయాయని, దీనిని పూర్తిచేయాలని, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా పానగల్, కోడే రు మండల ప్రాంతవాసులకు కూడా ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కోడేరు, పి.కె.పల్లిలో జూనియర్ కాలేజీలు, నాగర్‌కర్నూలు-కొల్లాపూర్ రహదారి విస్తరణ, కొల్లాపూర్ ప్రాంతంలో పీజీ కాలేజీ మంజూ రు చేయాలని కోరారు. ఎంపీ మంద జగన్నాథ్ మాట్లాడుతూ, కరవు జి ల్లాకు సీఎం కిరణ్, నెలరోజుల్లో రెండోసారి రావడం అభినందనీయమన్నారు

. జిల్లాలో సాగునీటి అవశ్యకత దృష్ట్యా, పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయాలని, కొల్లాపూర్-నంద్యాల రైల్వే లైను కోసం అవసరమయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున వ్యయం భరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సీఆర్ఎఫ్, పీఎంజిఎస్‌వైల్లో జిల్లాకు అన్యాయం జరుగుతోందని, వీటికి పెద్దఎత్తున నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ, జిల్లాలో తొమ్మిది డిగ్రీ కాలేజీలు మంజూరు చేసినా, వాటికి భవనాలు లేవని అన్నారు. ఈ భవనాలు మంజూరు చేయాలని, జిల్లా ప్రభుత్వాసుపత్రిని 350 పడకలకు పెంచాలని సీఎంను అభ్యర్థించారు.

ఈ ప్రతిపాదన ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. జిల్లాలో రోడ్లు అధ్వానం గా మారాయని, ముఖ్యంగా వరదలతో భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వీటికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడు తూ, ప్రజా సమస్యల పరిష్కారానికే ర చ్చబండ చేపట్టామని అన్నారు. సమావేశంలో, జడ్పీ ఛైర్మన్ కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్.రాజేశ్వర్‌రెడ్డి, అబ్ర హాం, ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎంపీ విఠల్‌రావు, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ వీరారెడ్డి, మాజీమంత్రి జి.చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, జిల్లా కలెక్టర్ ఎం.పురుషోత్తంరెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.చిరంజీవులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Thursday, January 27, 2011

.. అదే శ్రీరామ రక్ష

 
సాంకేతికంగా మైనార్టీలో కిరణ్ సర్కార్
అయినా మనుగడకు ముప్పు లేనట్టే

కాస్కో.. చూస్కో.. అన్నవాళ్లే కానీ..
(అ) విశ్వాసంపై సవాళ్ల అంతరార్థం ఇదే
ప్రత్యర్థుల అనైక్యతే పాలకపక్షం బలం
జగన్ శిబిరంలో తగ్గుతున్న ఎమ్మెల్యేలు
బల పరీక్షకు యువనేత వెనుకంజ
రాష్ట్ర రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి 
రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయంగా ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. సంఖ్యాపరంగా చూస్తే ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. కానీ ప్రభుత్వం పడిపోదు. కిరణ్ సర్కార్‌పై అటు ప్రధాన ప్రతిపక్షం .. ఇటు కాంగ్రెస్‌లోని ఓ వర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాయి. కానీ.. అవిశ్వాస తీర్మానం పెట్టవు. దమ్ముంటే విశ్వాస తీర్మానం పెట్టుకోండి అని జగన్ వర్గం.. చేతనైతే అవిశ్వాస తీర్మానం పెట్టండని ప్రభుత్వ వర్గం పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నాయి. కానీ ఎవరూ ఆ పని చేయరు.

కిరణ్ ప్రభుత్వాన్ని దించేయాలన్న కసి పీకలదాకా ఉన్నా జగన్ వర్గం ఆ సాహసం చేయలేకపోతోంది. తన వల్ల కాదని గట్టిగా నిర్ధారించుకుని చంద్రబాబును రెచ్చగొట్టే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. ప్రత్యర్ధుల బలహీనతలు కిరణ్ పాలిట వరాలుగా మారాయి. పిల్లి మెడలో గంట కొట్టేవారు కరువయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రెక్కల కష్టమని.. అందువల్ల దానిని 2014 వరకూ పడగొట్టబోమంటూ ఒకవైపు జగన్ వర్గ శాసనసభ్యులు ఘంటాపథంగా చెబుతూనే మరోపక్క దమ్ముంటే కిరణ్ సర్కారు విశ్వాస పరీక్షకు సిద్ధం కావాలని సవాల్ విసురుతున్నారు.

పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ ప్రకటనల నేపథ్యంలో విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా అనే ప్రశ్నకు .. తాము 2014 వరకూ ఈ ప్రభుత్వానికి కూల్చకూడదన్న నిర్ణయంతో ఉన్నందున తాము వ్యతిరేకంగా ఓటు వేయమని ఒకసారి, చూద్దాం.. అని మరోసారి చెప్పడం మినహా స్పష్టంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పలేకపోతున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై నమ్మకం లేదంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నమ్మకం లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడం లేదన్న ప్రశ్నకు వైఎస్ కష్టంతో వచ్చిన ప్రభుత్వంపై ఆవిశ్వాసం ఎలా పెడతామని ప్రశ్నిస్తున్నారు.

కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయపార్టీని స్థాపించిన తర్వాతైనా కిరణ్ సర్కారును కూల్చేస్తారా అనే ప్రశ్నకు పార్టీ పెట్టాక జగన్ ఎలా అదేశిస్తే అలా చేస్తామని చెబుతున్నారు. ఒకే సమయంలో పరస్పర విరుద్ధంగా జగన్ వర్గ ఎమ్మెల్యేలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం జగన్ వర్గంలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం క్రమంగా తగ్గుతుండడమేనని అంటున్నారు. జగన్ విజయవాడలో జరిగిన లక్ష్య దీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలతో తన బల పరీక్ష చేశారు. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు (పీఆర్పీ ఇద్దరు, టీడీపీ ఒకరు సహా) జగన్ వెంట నిలిచారు.

ఆ తదుపరి ఢిల్లీలో జరిగిన 'జల దీక్ష'లో ఆ సంఖ్య 24గా (పీఆర్పీ ఇద్దరు, టీడీపీ ఒకరు సహా) ఉంది. మొన్న పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. వైజాగ్‌లో జనదీక్ష చేశారు. ఆ దీక్షకు 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. బుధవారం జగన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కేవలం ఎనిమిది మందే పాల్గొన్నారు. మిగిలిన వారు వేర్వేరు కారణాల రీత్యా హాజరు కాలేక పోయారని జగన్ వర్గం చెబుతోంది. ఆ కారణాలేంటన్నది పక్కన పెడితే.. అటు జగన్ వర్గం ఎమ్మెల్యేలు సమావేశం అయిన రోజే.. ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ చేజారిపోయారు.

సీఎం కిరణ్‌కుమార్‌ను కలిసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావులు.. తాము కాంగ్రెస్‌తోనే ఉంటామని స్పష్టం చేశారు. వీరిద్దరినీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం వద్దకు తీసుకుపోయారు. అటు.. చిత్తూరు జిల్లాలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు కుతూహలమ్మ, పీ రవిలను బుజ్జగించే ప్రయత్నాలను మంత్రి రఘువీరారెడ్డి భుజాలకెత్తుకున్నారు. తనతో సీఎం నేరుగా మాట్లాడాలని కుతూహలమ్మ డిమాండ్ చేస్తే.. రవి మాత్రం మెత్తబడ్డారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రచ్చబండ కార్యక్రమంలో తొలి రోజు పలువురు జగన్ వర్గం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతితో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు కూడా.

ఇవన్నీ జగన్ బలం తగ్గుతున్నాయనేందుకు సంకేతాలుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా జగన్ వర్గం నుంచి రోజు రోజుకూ ఎమ్మెల్యేలు జారిపోతున్నారన్నది మాత్రం కనిపిస్తున్న వాస్తవం. అయితే.. బాహాటంగా 30 మంది వరకూ ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతు ఇస్తున్నారని, అంతర్గతంగా వారి సంఖ్య 50 వరకూ ఉంటుందని జగన్ వర్గం నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. ఆయన చెప్పినట్లు 50 మంది అవిశ్వాసం వ్యక్తం చేసినా కిరణ్ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు టీడీపీ, టీఆర్ఎస్‌లు రాజకీయంగా అనుసరించే వ్యూహాలే ప్రధాన కారణం. రాజకీయంగా జగన్‌ను టీడీపీ వ్యతిరేకిస్తోంది.

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో జగన్‌కు టీఆర్ఎస్ సహకరించే పరిస్థితి లేదు. కిరణ్ సర్కార్‌పై పీకలవరకూ టీడీపీకి కోపం ఉన్నా.. జగన్ వర్గం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, అందుకు ఆ పార్టీ సహకరించదు. రాజకీయంగా జగన్‌కు టీడీపీ సహకరిస్తే భవిష్యత్‌లో జగన్‌పార్టీని విమర్శించే నైతిక హక్కును టీడీపీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పైగా దాని వల్ల రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. దీనికి తోడు జగన్ అక్రమాస్తులపై టీడీపీ పోరాటం చేస్తోంది. అందువల్ల జగన్ వర్గం అవిశ్వాస తీర్మానం పెట్టినా అందుకు టీడీపీ ఏ మాత్రం సహకరించదు. ఇదే సమయంలో కిరణ్ సర్కారు కూలుతుందని.. మధ్యంతరం తప్పదని పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు పరిస్థితీ ఇంచుమించు ఇదే విధంగా ఉంటుందని రాజకీయ వర్గాల ఉవాచ.

తెలంగాణ ఆకాంక్ష బలీయంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మధ్యంతరం వస్తే రాజకీయంగా టీఆర్ఎస్‌కు ఎంతో లాభిస్తుంది. అయితే.. కరడుగట్టిన సమైక్యవాదిగా ముద్ర పడ్డ జగన్‌వర్గం కిరణ్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడితే, ఆ తీర్మానానికి సానుకూలంగా ఓటు వేస్తే.. రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే వీలుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమైక్యరాష్ట్రాన్ని కోరుతూ రాసిన ప్లకార్డును లోక్‌సభలో టీడీపీ ఎంపీల చేతి నుంచి లాక్కొని మరీ ప్రదర్శించినందుకు జగన్‌ను తెలంగాణలో తిరగకుండా టీఆర్ఎస్ అడ్డుపడింది.

కాంగ్రెస్ నుంచి వేరుపడిన జగన్ సర్వ స్వతంత్రుడు. ఇదివరలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి అలా చేశానని చెప్పి జగన్ తప్పించుకునే వీలుంది. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ నుంచి వేరుపడి సొంత పార్టీని పెడుతున్నందున జగన్ రాష్ట్ర విభజనపై తన నిర్ణయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. తాను తెలంగాణకు సానుకూలమని బహిరంగంగా ప్రకటించనంతకాలం జగన్‌పై సమైక్య ముద్ర ప్రభావం గట్టిగా ఉంటుంది. సీమాంధ్ర ప్రాంతంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజనకు అంగీకరించరు.

ఆయన అంగీకరించనంత కాలం టీఆర్ఎస్ బహిరంగంగా మద్దతును తెలిపేందుకు అవకాశం ఉండదు. జగన్‌వర్గం పెట్టే అవిశ్వాసానికి మద్దతును తెలిపితే.. గతంలో లోక్‌సభలో ప్లకార్డును ప్రదర్శించినందుకే.. తెలంగాణ ప్రాంతంలో తిరగనివ్వకుండా అడ్డుకుని, ఇప్పుడు ఎందుకు కలిసిపోయారో? లోపాయికారీ ఒప్పందం ఏమిటో? వివరించాలని తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు నిలదీసే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా కాస్త ఇబ్బందికరమైన పరిణామమే అయినందున టీఆర్ఎస్ కూడా మౌనం దాల్చే వీలుంది.

రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు రాజకీయంగా తనకు సానుకూలంగా ఉండడంతో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి నెత్తి కింద తడిగుడ్డ వేసుకుని హాయిగా ఉండే పరిస్థితులు కన్పిస్తున్నాయని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. అయినా సరే.. అంకెల పోరాటానికే పరిణామాలు దారి తీసినా.. పొరుగు రాష్ట్రాల అనుభవంతో గట్టెక్కే ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. అమీ తుమీకి సిద్ధమైనప్పుడు జగన్ వర్గంలోని కనీసం 20 మందిపై వేటు వేస్తే సభలో వాస్తవ బలం 273కు పడిపోతుంది. అంటే 137 అనేది మ్యాజిక్ ఫిగర్‌గా నిలుస్తుంది.

కాంగ్రెస్ బలం 135గా ఉంటుంది. అంటే మెజార్టీకి రెండు స్థానాలు తక్కువ. అయితే.. పీఆర్పీ నుంచి కనీసం 14 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు సర్కారును ఆదుకునేందుకు ఆస్కారం ఉంది. పైగా జగన్‌ను వ్యతిరేకించే విపక్షాలు సైతం కిరణ్ సర్కారును వ్యూహాత్మకంగా బయటపడేసినా ఆశ్చర్యం లేదు. ఈ లెక్కన చూస్తే బాలినేని చెప్పినట్లు 50 మంది ఎమ్మెల్యేలు జగన్ వర్గంలో చేరినా.. కిరణ్ కుర్చీలో ఏమాత్రం కదలికలు రావన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

కొసమెరుపు : సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తన సొంత బలంపైనే నిలబడుతుంది. కానీ రాష్ట్రంలో కిరణ్ సర్కారు విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంది. అసెంబ్లీలో సాంకేతికంగా జగన్ వర్గం ఎమ్మెల్యేల మద్దతుపైనా, రాజకీయంగా విపక్షాల పరోక్ష సహకారం మీద కిరణ్ సర్కార్ మనుగడ సాగిస్తుండటమే ఇక్కడ రాజకీయ వైచిత్రి!!
Click Here! 
(అ)విశ్వాసమా ? వినోదమా ?
assemblys
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస/విశ్వాస తీర్మాన వ్యవహారం చివరకు రాను రాను వినోదంగా మారేలా కని పిస్తోంది. దమ్ముంటే కిరణ్‌ తన ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాసం నిరూపించుకోవాలని జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సవాల్‌ చేశారు. దానికి స్పందించిన మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, పార్టీని సమర్థిస్తోన్న ఎమ్మెల్యేలు మాత్రం దమ్ముంటే మీరే అవిశ్వాస తీర్మానం పెట్టండని ప్రతి సవాల్‌ విసిరారు. వీటికంటే ముందు అసలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్‌లో ఉంటూ జగన్‌ను సమర్ధిస్తున్న ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేసి ఈ వివాదానికి తెరలేపారు.

తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అసలు పిల్లిమెడలో గంట కట్టేదెవరన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. తన తండ్రి ఏర్పాటుచేసిన ప్రభుత్వాన్ని తాను పడగొట్టనని, ఈ ప్రభుత్వం తన దయాభిక్షపైఆధారపడి పనిచేస్తుందని జగన్‌ చాలాకాలం క్రితమే ప్రకటించారు. జగన్‌ ప్రకటన అటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇటు మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయి. జగన్‌ వెంట తిరుగుతున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయకుండా , పార్టీని విమర్శించడం అనైతికమని ముఖ్యమంత్రి కిరణ్‌ వ్యాఖ్యానించారు. మంత్రి డీఎల్‌ మరో అడుగు ముందుకేసి, జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని సవాల్‌ విసిరారు. తాము దేనినయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

తాజాగా బుధవారం జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎల్పీ సాక్షిగా.. సీఎం కిరణ్‌కు సరికొత్త సవాల్‌ విసిరారు. దమ్ముంటే కిరణ్‌ తన ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష పెట్టుకోవాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందని సీఎంకు నేరుగా సవాల్‌ విసిరారు. అసలు ఈ వివాదం అంతా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ అవగాహనా రాహిత్యం వల్ల మొదలయిందన్న భావన పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న సమయంలో, ఎమ్మెల్యేలు నిలువునా చీలిపోయిన వాస్తవం తెలిసి, తాను ఈ సంక్షోభాన్ని నివారించలేనని తెలిసినప్పటికీ ి రణ్‌ ఈవిధంగా జగన్‌ను, ఆయన వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం రాజకీయ అవగాహన, అనుభవ రాహిత్యమేనని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. వివాదాన్ని చల్లార్చవలసిన బాధ్యత గల ముఖ్యమంత్రే దానిని మరింత పెద్దది చేయడం వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వానికే నష్టం వస్తుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని డిమాండ్‌ చేయడం, చేతులారా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్వాగతించడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. కిరణ్‌ ప్రకటనలు హాస్యాస్పదంగా, రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వారిలా ఉన్నాయంటున్నారు.

ఈ పరిణామాలను లోతుగా పరిశీలిస్తే.. అసలు పిల్లిమెడలో గంటకట్టేదెవరన్న ప్రశ్న తెరపైకొస్తోంది. జగన్‌ వర్గం దమ్ముంటే మీపై విశ్వాస పరీక్ష పెట్టుకోమని సవాల్‌ విసురుతుందే తప్ప, తమంతట తాము అవిశ్వాసం పెడతామని చెప్పడం లేదు. పైగా ఈ వ్యవహారంతో సంబంధం లేని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని తెరపైకి తెచ్చి దానిని ఇరికించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని నిలదీస్తోంది. దీన్ని బట్టి బాబు-కిరణ్‌ మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్‌ ఉందన్న ప్రచారం చేస్తోంది. ఈ వాదన అర్థరహితమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అటు కిరణ్‌, మంత్రులు కూడా దమ్ముంటే అవిశ్వాస పరీక్ష పెట్టమని సవాల్‌ విసురుతున్నారే గానీ, తాము విశ్వాస పరీక్ష కోరతామని ఎక్కడా చెప్పడం లేదు. ఒకవేళ జగన్‌ వర్గం అవిశ్వాసతీర్మానం పెడితే.. ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా అనర్హులవుతారు. పార్టీ విప్‌ను ధిక్కరిస్తే పదవి కోల్పోతారు. మరో మూడేళ్లు ఎమ్మెల్యే పదవులను వదులుకునేంత ధైర్యం జగన్‌ వర్గం ఎమ్మెల్యేలలో కనిపించడం లేదు. ప్రభుత్వం కూడా విశ్వాస పరీక్ష జరిపించుకుని, సమస్యలు కొని తెచ్చుకునే సాహసం చేయదు.మరికొద్దికాలం పాటు ఇలాగే ఇరు వర్గాలు సవాళ్లు, ప్రతి సవాళ్లతోనే కాలక్షేపం చేయడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని జగన్‌ గట్టిగా భావించినప్పుడు మాత్రమే ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటాయి తప్ప, అప్పటివరకూ అంతా మీడియా హడావిడి తప్ప మరేమీ ఉండదని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. దీన్ని బట్టి.. ప్రభుత్వం గానీ, జగన్‌ వర్గం గానీ విశ్వాస/అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టబోరని స్పష్టంగా తేలిపోతుంది.

Thursday, January 13, 2011

అస్థిరమే! అవును.. పరిస్థితి ఫ్లూయిడ్‌గా ఉంది.

ఎవరుంటారో, ఎవరు పోతారో? ఏం చేస్తే ఏమవుతుందో
ఆలోచించి అడుగు వేయాలి.. సరైన సమయంలో సరైన నిర్ణయం

ఎలా గెలిచారో వాళ్లు గుర్తుంచుకోవాలి
రాజకీయాలకే సరిపోతోంది
పాలనపై దృష్టి పెట్టలేకపోతున్నా
ఏం చేయాలో వంద రోజుల్లో నిర్ణయం
డీసీసీ అధ్యక్షుల భేటీలో సీఎం కిరణ్
మన కన్ను మనమే పొడుచుకోవద్దు
ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి
కర్తవ్య బోధ చేసిన డి. శ్రీనివాస్
హైదరాబాద్, జనవరి 12 : అవును... రాష్ట్ర కాంగ్రెస్‌లో అస్థిర పరిస్థితి ఉంది... ఎవరో కాదు! స్వయంగా ప్రభుత్వ సారథి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని అంగీకరించారు. వైఎస్ జగన్ వాడి, తెలంగాణ వేడి మధ్య పార్టీ నలిగిపోతున్నట్లు చెప్పకనే చెప్పారు. 'గీత దాటుతున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? జగన్‌కు బాహాటంగా మద్దతు ఇస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఎందుకు స్పందించడం లేదు?'' అని నిలదీసిన నేతలకు ముఖ్యమంత్రిగానీ, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌గానీ తగిన సమాధానమివ్వలేకపోయారు.

బుధవారం గాంధీ భవన్‌లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ), నగర కాంగ్రెస్ కమిటీ (సీసీసీ) అధ్యక్షుల సమావేశంలో కిరణ్, డీఎస్ పాల్గొన్నారు. వారికి పరిస్థితి వివరిస్తూ, కొంత ధైర్యం చెబుతూ, కర్తవ్య బోధ చేశారు. క్రమశిక్షణ చర్యలపై అధిష్ఠానం ఆదేశాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని సీఎం చెప్పారు. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఇవీ ఆ భేటీ వివరాలు... "ప్రస్తుతం కాంగ్రెస్‌లో అస్థిర పరిస్థితి (ఫ్లూయిడ్) ఉంది. ఎవరు ఉంటారో, ఎవరు వెళ్లిపోతారో తెలియడం లేదు'' అని ముఖ్యమంత్రి కిరణ్ పేర్కొన్నారు. అదే సమయంలో పార్టీని ఎవరు వదిలి వెళ్లినా నష్టమేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 30 శాతం ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. పార్టీలో ఎప్పుడు ఏం చేయాలో ఆలోచించి చేయాల్సి ఉంటుందని, ఎవరు ఎలా ఉంటారో చూడాల్సి ఉందని అన్నారు. జగన్ వైపు చూస్తున్న నేతలకు పరోక్షంగా చురకలు అంటించారు. "ఎన్నికల సమయంలో టికెట్ ఇచ్చాకే వీరు ప్రజా ప్రతినిధులుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే జనం గెలిపించారని వీళ్లంతా గుర్తుంచు కోవాలి'' అని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలో వడపోత కార్యక్రమం ఉంటుందని కూడా తెలిపారు. ఊరూరా పార్టీకి కార్యకర్తలున్నారని, వారిని బలోపేతం చేసుకోవాలని సూచించారు.

"ఎమ్మెల్యేలు పోయినప్పటికీ... మేం కాంగ్రెస్‌లోనే ఉన్నామని జడ్పీటీసీ, ఎంపీటీసీలు చెబుతున్నారు. మన పార్టీని ఎవరూ దెబ్బతీయలేరు. విధానాలే ప్రజలను ప్రభావితం చేస్తాయి. వచ్చే వంద రోజుల్లో ఏం చేయాలో నిర్ణయిస్తాం. పార్టీ ద్వారా వాటిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్నది ఆలోచిస్తాం'' అని భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించారు. త్వరలో జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఏదైనా లక్ష్యం సాధించడానికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు.

రాజకీయాలతోనే సరి...

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని, పరిపాలనపై పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నానని కిరణ్ పేర్కొన్నారు. "కొన్ని రోజుల్లోనే పరిస్థితులు చక్కబడతాయి. పరిపాలనలోకి వస్తా. పరిపాలనపై దృష్టి సారిస్తా. సోనియాగాంధీ పాలనలో పారదర్శకతను కోరుతున్నారు. కార్యకర్తలతో కలసి మెలసి ఉండాలని సూచించారు.

తొలుత... ఆలోచనల్లో స్పష్ట రావాలి. పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారో, పోయారో తెలియాలి. మన పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఎక్స్ పోతే వై .. వై పోతే జడ్ ఆ లోటును భర్తీ చేస్తారు'' అని వివరించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు నెలలో ఒకరోజు జిల్లా పార్టీ కార్యాలయానికి, నియోజకవర్గ కార్యాలయాలకు వెళ్లాలని సూచించారు. "ఒకటి రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది. ఓపికతో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం' అని ముఖ్యమంత్రి తెలిపారు.

సీరియస్‌గా తీసుకోండి: డీస్

ముఖ్యమంత్రికంటే ముందు పీసీసీ చీఫ్ డీఎస్ మాట్లాడారు. పార్టీని బలహీనం చేసే ప్రయత్నాలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. "వాళ్లతో అయ్యేదేంటని ఊరుకోవద్దు. సీరియస్‌గా తీసుకోవాలి. పార్టీ పునాదులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. కార్యకర్తల కృషి కారణంగానే అధికారంలోకి వచ్చాం. దానిని కాపాడుకోవాలి. మన కంటిని మనమే పొడుచుకోవద్దు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వాడే నాయకుడు అవుతాడు. మనకు అంకిత భావం ఉంటే ఎదుగుతాం. లేకుంటే కనుమరుగై పోతాం. ఈ తరం రాజకీయ నాయకుల ఆకాంక్షలు, కోర్కెలు, అవరాలు ఏమిటో ముఖ్యమంత్రికి బాగా తెలుసు'' అని డీఎస్ తెలిపారు.

డీసీసీ అధ్యక్షులుగా పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. "కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే... మీరూ బలహీనపడతారు. అందరం కలసి పార్టీని బలోపేతం చేయాలి. పార్టీకి సంబంధించిన సమస్యలు ఉంటే నాకు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలుంటే ముఖ్యమంత్రికి చెప్పండి'' అని సూచించారు. వైఎస్ చేపట్టిన కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలేనన్నారు. "నేను రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిని అయినా... డీసీసీ అధ్యక్షుడిని కావాలన్న నా కోరిక నెరవేరలేదు. మీరు అదృష్టవంతులు. డీసీసీ, సీసీసీ అధ్యక్షులు అయ్యారు.

అందర్నీ సమన్వయ పరచాలి. అన్ని విభాగాలు, వర్గాలను కలుపుకొని ముందుకు తీసుకువెళ్లాలి. కాంగ్రెస్ అనే పదం ప్రజల నోటి మీద నానుతున్నా.. దానిని మనం ఇంకా విస్తృతం చేయాలి'' అని హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తీరును సమీక్షించాల్సి ఉందన్నారు. ఈ పథకాల అమలుపై 17-18 పాయింట్‌లు రూపొందించి .. జిల్లా వారీ పర్యవేక్షక కమిటీలను వేయాల్సి ఉందని... దీనికి సంబంధించి ఈనెల 25 లోగా జిల్లా కాంగ్రెస్ కమిటీల నుంచి పేర్లను పంపాలని డీఎస్ సూచించారు.

ప్రశ్నలు... నిలదీతలు...

ఈ భేటీలో ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్‌ను పలువురు నేతలు ప్రశ్నలతో నిలదీశారు. "జిల్లాల్లో పర్యవేక్షక కమిటీలు వేస్తామంటున్నారు. కానీ... మేం కాంగ్రెస్ పార్టీ నేతలమని చెబుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు'' అని గౌరీ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిమీద క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. "నేను యువజన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు జాతీయస్థాయి యువజన కాంగ్రెస్ నాయకుడిని కొట్టాను. దీనిని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుని... నన్ను సస్పెండ్ చేసింది.

ఇప్పుడు బాహాటంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?'' అని గౌరీ శంకర్ ప్రశ్నించారు. మూడేళ్లుగా కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొందని పీసీసీ ప్రధాన కార్యదర్శి నిరంజన్ అన్నారు. నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే ఇదిగో అదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్ రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినందున, ఎవరి పని తీరు ఏమిటో బాగా తెలిసినందున, పదవులపై సీఎంకు పీసీసీ నుంచే పేర్లను పంపాలని నిరంజన్ కోరారు.

ఈ సమయంలో మంత్రి దానం నాగేందర్ జోక్యం చేసుకుని... పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ వెంట వెళ్తున్న ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నేతి విద్యాసాగర్ కూడా ప్రశ్నించారు. నిజమైన కార్యకర్తలకు భరోసా దక్కడం లేదని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ అన్నారు. ప్రధానంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ కార్యకర్తలకంటే బయటి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఎమ్మెల్యే ప్రసాద్ చేసిన సూచనలు పెడచెవిన పెట్టి రేషన్ షాపు డీలర్లతో సహా అన్ని అవకాశాలు, పదవులు బయటి వక్తులకే అప్పగించారు. పదవులు పొందిన మరుక్షణమే వారు జగన్ వెంట కన్పిస్తున్నారు'' అని ప్రతాప్ పేర్కొన్నారు. ఇలాంటివి సరిదిద్దేందుకే సమన్వయ కమిటీలను వేస్తామంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకూ మధ్య సమన్వయం లేదని.. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు ఈ విషయాన్ని చెబుతామని సీఎం హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి మాట!

పార్టీ నేతల్లో సమన్వయం కొరవడింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం లేక పోవడం నిజమే! నాయకునికి సెంటిమెంట్, కమిట్‌మెంట్ అనే అంశాలు ఉన్నాయి. మనతో ఎవరున్నారో, ఎవరు లేరో చూసుకోవాలి. ఏదైనా చేసినా (పదవుల వంటివి ఇస్తే) ఉంటారో, పోతారో తెలీదు. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల, లేని చోట్ల కూడా ఇబ్బందులున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలకూ పడదు. మంత్రులకూ ఎమ్మెల్యేలకూ పడడం లేదు.
- డీసీసీ అధ్యక్షుల భేటీలో సీఎం కిరణ్
Click Here!

Sunday, January 9, 2011

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి

cm
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహాకాలు అందిస్తుందని, పెట్టుబడులకు రాష్ట్రం అనుకూల ప్రదేశమని ఆర్‌బీఐ కీతాబిచ్చిందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని మరో గుజరాత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో విద్యుత్‌ రేటు చాలా తక్కువగా ఉందని సీఎం స్పష్టంచేశారు. పరిశ్రమలు స్ధాపించేవారికి తక్షణ అను మతులు ఇస్తామని, అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్విహ స్తున్నాయని ముఖ్యమంత్రి ప్రవాసాంధ్రులకు తెలిపారు.

గుజ రాత్‌ తరహా అభివృద్ధే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. నేడు ఢిలీ ్లలో జరగనున్న ప్రవాస భారతీయ దివస్‌-2011 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డిని పాల్గొనాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రి గీతారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి ఎస్‌.వీ.ప్రసాద్‌ ఇతర ఉన్నతాధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో పలుఅంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. రాష్ట్రం లో పరిశ్రమలకు కావల్సిన ఆయా ముడిసరుకుతోపాటు, సుపరిపాలన, పెట్టుబడులకు అనుకూలంగా ఉండే విధానా లతోపాటు అన్నీంటికీ మించి వృత్తి నైపుణ్యం ఉన్నవారు అందు బాటులో ఉన్నారన్నారు. ముఖ్యంగా విద్యుతుత్పాదన రంగంలో రాష్ట్రం దేశం మొత్తంమీద రెండవస్ధానంలో నిలిచిందని 2010-11 ఆర్ధిక సంవత్సరానికి ఎపి ట్రాన్ప్‌కోకు పురస్కారం లభించిదాన్నరు.

ఈసందర్భంగా ముఖ్యమంత్రి ప్రవాసాం ధ్రులకు నూతన సంవత్సర, సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీల్లో 25 శాతం మంది రాష్ట్రానికి చెందినవారున్నారని, రాష్ట్రంనుంచి వైద్య విద్యను పూర్తిచేసుకున్న ఎంతోమంది డాక్టర్లు యుఎస్‌, యూ రోపియన్‌ దేశాలలో పనిచేస్తున్నారన్నారు. కాగా అంధ్రప్రదేశ్‌ ఐటీ, బయోటెక్నాలజీ, ఔషధ, ఎయిర్‌లైన్స్‌, ఉత్పాదక సంస్ధలతోపాటు ఇతర శిక్షణ సంస్ధల స్ధాపనలో ముందంజలో ఉన్నదని, అత్యున్నత టిఐఎఫ్‌ఆర్‌ సంస్ధను కూడా హైదరా బాద్‌లో ఏర్పాటు చేస్తారన్నారు.

వీటితోపాటు సహజ వాయువు సమృద్ధిగా లభిస్తుందని, ఆహార ఉద్పాదక, అనుబంధ పరిశ్ర మలు అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ రూపొందించారని, ఈ విధానంతో రాష్ట్ర ఆర్ధిక ప్రగతితోపాటు ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తాయని, దీంతో గ్రామీణులకు ఆర్ధికంగా వెసులుబాటు లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌, నీటి పారుదల ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రహదారుల వంటి అభివృద్దిలో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు.

ఇందుకు అనుగుణంగా రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నందున జాతీయ సా ్ధయిలో 3వ స్ధానంలో నిలిచిందని ముఖ్యమంత్రి తెలి పారు. అంతేకాకుండా భార త్‌లో వాణిజ్యానికి అనుకూలంగా హైదరాబాద్‌ రెండవ మెట్రో నగరంగా ప్రపంచబ్యాంకుచే గుర్తించబడిం దని, దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎపీలో ఎక్కువగా ఉత్పాదక రంగానికి చెందిన పరిశ్రమలు ఉన్నాయన్నారు. కా గా తిరుమల వెంకటేశ్వరుని ప్రతీ ఏటా మిలియన్ల సంఖ్యలో భక్తులు ప్రపంచం నుంచి వస్తున్నారని, ప్రవాసాంధ్రులు వెంకటేశ్వరుని ఆశీస్సులు అందు కోవాలని సీఎం ఈసందర్భంగా కో రారు.ప్రవాసాంధ్రుల నుంచి పెట్టుబ డులను ఆకర్షించే విధంగా ఉన్నతా ధికారులు నిరంతరంగా కొనసాగించాలని ఇందుకు ఓ ప్రత్యేక పానెల్‌ను ఏర్పాటుచే ేయాలని సీఎం అధికారులకు సూచించారు.

రాజకీయ సెగలు పొగలు

Jagana 
రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, జగన్‌ దూకుడును అణచివేస్తానన్న రెండు హామీలు ఇచ్చి, ఆ మేరకు ముఖ్యమంత్రి పదవి సాధించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సామర్థ్యానికి కాంగ్రెస్‌ అధి ష్ఠానం అగ్నిపరీక్ష పెట్టింది. ఈనెల 11న జగన్‌ ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ధర్నాకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకాకుండా అడ్డుకోవాలన్నదే అధిష్ఠానం పెట్టిన పరీక్ష. ఇందులో ముఖ్యమంత్రి పాసవుతారో, ఫెయిలవుతారో మరికొద్ది గంటల్లో తేలనుంది. ఒకవేళ ఎమ్మెల్యేలు ఆదివారం జగన్‌తో వెళ్లకపోయినా 11న ఉదయం వెళ్లే అవకాశం ఉంది. ఆ ఫలితం బట్టే కిరణ్‌కుమార్‌ రాజకీయ భవితవ్యం, ముఖ్యమంత్రి పదవి పదిలమా కాదా అన్నది కూడా స్పష్టం కానుంది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇప్పుడు ఆ పదవి ముళ్లకిరీటంలా మారింది.

వైఎస్‌ మృతి చెందిన తర్వాత రాష్ట్ర పార్టీ వ్యవహారాల నివేదికలు అందచేస్తూ అధిష్ఠానానికి దగ్గరయి, అదే సంబంధాన్ని విని యోగించుకుని సీఎం పదవి పొందిన కిరణ్‌కు సొంత పార్టీలోనే సెగ పెరిగి, చివరకు అది వ్యక్తిగతంగా తనకు, తన పదవికి ఎసరు తెచ్చే ప్రమాదం తెస్తోంది. అధిష్ఠానం హెచ్చరికల నేపథ్యంలో కిరణ్‌ జిల్లా మంత్రులను ఆశ్రయించవలసి వస్తోంది. తాను విఫలమయితే, మంత్రులుగా మీరు కూడా విఫలమయి నట్టేనని, ప్రభుత్వం కూలిపోతే మీ పదవులు కూడా పోతాయని హెచ్చరించవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నెల 11న జగన్‌ రైతాంగ సమస్యలపై ఢిల్లీలో జరపతలపెట్టిన ధర్నాకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు సిద్ధమవుతుండటం కిరణ్‌కు కలవరం కలిగిస్తోంది.

speaking వారిని ఢిల్లీ వెళ్లకుండా నివారించి, సత్తాను చాటుకోవాలని అధిష్ఠానం ఆదేశించడంతో సీఎం సతమతమవుతున్నారు. నేరుగా వారితో సన్నిహిత సంబంధాలు లేకపోవడంతో ఆయన జిల్లా ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులశక్తి సామర్థ్యాలపై ఆధారపడి వస్తోంది. జగన్‌ ధర్నాకు వెళితే తన పదవికే ముప్పు వస్తుందన్న ఆందోళనతో సీఎం గత రెండు రోజుల నుంచి మంత్రాంగం నడుపుతున్నారు. ఆ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రు లు, మంత్రులపై బాధ్యత పెట్టారు. ‘జగన్‌ వెంట ఎమ్మెల్యేలు వెళితే ప్రజల్లో పార్టీ-ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. మీరంతా మంత్రివర్గంలో ఉన్నారు. ప్రభుత్వం పడిపోకుండా ఉండే బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. మీ జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో మాట్లాడండి.

వారిని ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకోండి. హై కమాండ్‌ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టండి’ అని సీనియర్లను అభ్యర్థిస్తున్నట్లు సమాచారం. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును పిలిపించి చర్చించారు.దాదాపు 31మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు ఢిల్లీకి బయలు దేరడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు కిరణ్‌కు ముచ్చెమటలు పోయిస్తున్నాయి. నిజంగా వారంతా ఢిల్లీకి వెళితే తనపై అధిష్ఠానం ఉంచిన విశ్వాసం, సీఎం పదవి తీసుకునే ముందు అధిష్ఠానానికి తానిచ్చిన భరోసా రెండూ తప్పినట్లేనని కిరణ్‌ భావిస్తున్నారు. అటు అధిష్ఠానం కూడా జగన్‌ ధర్నా వ్యవహారం తనకు సంబంధం లేనట్లు, అది పూర్తిగా కిరణ్‌ సామర్థ్యానికి సవాలు, పరీక్షగా భావిస్తోంది.

ఇదే భావన పార్టీ వర్గాల్లోనూ కనిపిస్తోంది. 11 నాటి జగన్‌ దీక్షకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరయితే, అధిష్ఠానం కిరణ్‌ను అసమర్థ ముఖ్యమంత్రిగా పరిగణించే అవకాశాలు లేకపోలేదని, ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగించుకుని, సత్తా చూపలేని వైఫల్య ముఖ్యమంత్రిగా భావిస్తే ఆయన పదవికే ప్రమాదం వచ్చే అవకాశాలున్నాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.ఒకవేళ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సూచనలు, అభ్యర్థలను బేఖాతరు చేసి ఢిల్లీ వెళితే కిరణ్‌ కూడా రోశయ్య బాటనే పయనించవలసి వస్తుందని సీనియర్లు చెబుతున్నారు. అప్పుడు అధిష్ఠానం మరొకరిని నియమించే పరిస్థితి తలెత్త కుండా తానే స్వయంగా రాజీనామా చేయవలసిన వస్తుందని చెబుతున్నారు.

‘మా పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళితే అది నిజంగా కిరణ్‌కుమార్‌కు అవమా నమే. సీఎంగా అవకాశం ఇచ్చినా వారిని నియంత్రిం చలే కపోయారన్న అపప్రధను మూటకట్టుకోవలసి ఉంటుంది. ఇది కిరణ్‌ సత్తాకు అసలు సిసలు అగ్ని పరీక్ష. పాసయితే పదవిలో ఉంటారు. ఫెయిలయితే పదవీచ్యుతుడవుతారు. నిజంగా ఆ పరిస్థితే వస్తే కిరణ్‌ గౌరవంగా రాజీనామా ఇవ్వడమే మంచిద’ని సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. కాగా.. ఒకవైపు ఎమ్మెల్యేలను ఢిల్లీ వెళ్లకుండా కట్టడి చేసే యత్నాల్లో సీఎం బిజీగా ఉంటే, మరోవైపు ఆయన సొంత జిల్లాలో తనపై మొదలయి అసమ్మతి సెగ, తిరుగుబాటు కిరణ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ప్రాజెక్టు సాధన, నిధుల నిలిపివేతకు నిరసనగా తనకు వ్యతిరేకంగా ప్రత్యర్ధి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం నుంచి దాదాపు పదివేల మందితో పాదయాత్ర ప్రారంభించేందుకు నిర్ణయించడం, దానికి ఆరు నియోజకవర్గాల నుంచి కార్యకర్తల సమీకరణకు సన్నాహాలు చేస్తుండటంతో కిరణ్‌కు సొంత జిల్లా వైపు కూడా దృష్టి సారించ వలసి వస్తోంది.జిల్లాలో తన పరువు కాపాడేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నాలను ఆపాలంటూ మంత్రిరఘువీరాను దూతగా నియమించినా, ఆ ప్రయత్నలు కూడా విఫలమవడం కిరణ్‌ను నిరాశకు గురిచేశాయి. ఈ విధంగా అటు ఢిల్లీ, ఇటు చిత్తూరు పరిణామాలతో నల్లారి నలిగిపోతున్నారు.

చిత్తూరు ‘తూటా’

cm-srఈనెల 11న ఢిల్లీలో జగన్‌ తలపెట్టనున్న ధర్నాకు పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లకుండా అడ్డుకునే పనిలో తలమునకలయి ఉన్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సొంత జిల్లాలోనే చుక్కెదురయ్యింది. జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో కీలకమైన పాత్ర పోషించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యక్షంగా సీఎంకు వ్యతిరేకంగా ప్రజా పోరాటానికి సిద్దం అయ్యారు. తన సొంత నియోజకవర్గం పుంగనూరును ప్రభుత్వం విస్మరిస్తే సహించేంది లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. తన నియోజకవర్గానికి తాగునీరు అందకుంటే పోరాటం తప్పదన్నారు. ఆ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టాలని నిర్ణయించారు. అయిదే, మహాపాదయాత్రను ఆపేందుకు జిల్లా ఇన్‌ చార్జ్‌ మంత్రి రఘవీరారెడ్డి రంగంలోకి దిగినా నియోజకవర్గ జనం కోసం పాదయాత్ర తప్పదని పెద్దిరెడ్డి విస్పష్టంగా చెప్పారు.

దీంతో సిఎం తన జిల్లాలోని పార్టీ శ్రేణులను కూడా కలుపుకుపోలేని పరిస్థితి నెలకొంది. శనివారం పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటిస్తుండగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి రఘవీరారెడ్డి పెద్దిరెడ్డికి ఫోన్‌చేసి పాదయాత్రను ఆపివేయాలని కోరారు. దీంతో ఆయన పుంగనూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికి సుమారు రూ.33.3కోట్ల వ్యయంతో స్థానిక పుంగమ్మ చెరువులో సమ్మర్‌స్టోరేజ్‌ను నిర్మిస్తున్నామని, సమ్మర్‌స్టోరేజ్‌కు నీరు చేర్చడానికి సదుం మండలంలోని గార్గేయనది నుండి పైపులైను ఏర్పాటు చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి రోశయ్యలు కూడా అంగీకరించారని పేర్కొన్నారు. గార్గేయనది నుండి సమ్మర్‌స్టోరేజ్‌ పైపులైను ఏర్పాటుకు సుమారు రూ.82కోట్లతో ప్రతిపాదనలు కూడా పంపామన్నారు.

ఈ సమ్మర్‌స్టోరేజ్‌ ప్రారంభమైతే సుమారు 60వేల మందికి దాహార్తిని తీర్చచ్చని పెద్దిరెడ్డి మంత్రి రఘువీరాకు వివరించారు. అయితే సిఎం వ్యక్తిగత ప్రయోజనం కోసం గార్గేయనది జలాలను పీలేరు నియోజకవర్గానికి మళ్లించడానికిప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మా నియోజకవర్గ ప్రజల కోసం తాను ఈ పాదయాత్రను చేపట్టానని ఇన్‌చార్జ్‌ మంత్రికి తేల్చిచెప్పారు. ప్రజల దాహార్తి తీరేంత వరకు ప్రజా ఉద్యమం ఆగదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఆ మేరకు పుంగనూరు, కుప్పం, పలమనేరు, తంబళ్లపల్లి, మదనపల్లి, సత్యవీడు, శ్రీకాళహస్తి నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు పెద్దిరెడ్డి పాదయాత్రకు తరలిరానున్నారు. పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సతుం మండలాల మీదగా ప్రాజెక్టు ఉన్న పాపిరెడ్డి గారి పల్లెకు పాదయాత్ర చేరుకుంటుందని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.

తాజా పరిణామాలతో ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచే సెగ మొదలయినట్టయింది. పెద్దిరెడ్డి పాదయాత్ర ప్రారంభమయితే, సీఎంకు సొంత జిల్లాలోనే పట్టులేదన్న సంకేతాలు అధిష్ఠానానికి చేరే ప్రమాదం లేకపోలేదు. పెద్దిరెడ్డి పాదయాత్రకు రాష్ట్ర స్థాయి ప్రచారం లభించే అవకాశం ఉంది. బహుశా ఆయన ఆ వ్యూహంతోనే పాదయాత్ర చేపడుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో సొంతజిల్లా పార్టీ ఎమ్మెల్యేలను నియంత్రించలేని నాయకుడు ఇక రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలను ఏవిధంగా నియంత్రించగలరన్న భావన విస్తృతమవుతే, అది కిరణ్‌కు వ్యక్తిగతంగా కూడా నష్టమేనంటున్నారు.

Thursday, December 23, 2010

బాబూ .. రైతుబాంధవుడే ...

Kiran-Kumar-Reddy1
తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు రైతుల సమస్యల్ని పట్టించుకోలేదని, వ్యవసాయం దండగ అన్నారని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేతను విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారానికి నిరాహారదీక్ష చేపట్టిన బాబును దీక్ష విరమించమని తను స్వయంగా కోరానని, చర్చలకు మంత్రుల్ని పంపించానని, అయినా ఫలితం లేకపోయిందని కిరణ్‌కుమార్‌ చెప్పారు. ‘రైతు బాంధవుడివి అనిపించుకున్నావు. ఇక దీక్ష విర మించు’ అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. బుధవారం కిరణ్‌కుమార్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల బహిరంగ సభలో ప్రసంగించారు. ‘బాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు...కరెంటు సమస్య పరిష్కరించాలని 98 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిరాహార దీక్షచేస్తే అధికారులు, టిడిపి నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు దీక్ష విరమించమని మేం పదేపదే అడుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు మెత్తని స్వభావం కలిగిన కాంగ్రెస్‌ నాయకులం దీక్ష వద్దని పదే పదే కోరినా బాబు స్పందించలేదు’ అని ఆయన విమర్శించారు.

గతంలో ...
గతంలో కాంగ్రెస్‌ నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టిన వారి గురించి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. జలగం వెంగళరావు, మర్రిచెన్నారెడ్డి లాంటివారు కాంగ్రెస్‌ నుంచి విడిపోయి, తిరిగి పార్టీలోకి వచ్చి గుర్తింపు పొందారని చెప్పారు. ‘రాష్ర్టంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. ఈ సమయంలో పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు’ అని ముఖ్యమంత్రి పరోక్షంగా కడప మాజీ ఎంపి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించారు.
రైతు రుణాలు రీ షెడ్యూల్‌
వరదలు వచ్చి ఆరు జిల్లాల్లో రైతులు నష్ట పోయారని , వారు తీసుకున్న బ్యాంకు రుణాల్ని రీషెడ్యూల్‌ చేస్తామని, ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వరద ప్రాంతాలలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ, 400 కోట్లు ముందస్తు సహాయం కింద మంజూరు చేసిందని, గడిచిన 6 సంవత్సరాలలో వరదల్లో నష్ట పోయిన రైతుకు తమ ప్రభుత్వం రూ, 8 వేల కోట్లు ఖర్చు పెట్టిందని, 9 ఏళ్ల టిడిపి పాలనలో కేవలం 33 కోట్లే ఖర్చు పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరు రైతుల పక్షపాతో ప్రజలే నిర్ణయించాలన్నారు.అతి త్వరలో రచ్చబండ కార్యక్రమాన్ని పనరుద్ధరిస్తున్నామని, ప్రజల దగ్గరే సమస్యలు పరిష్కారం అవుతాయని, అక్కడిక్కడే సంబంధిత శాఖ అధికారులను పిలించి పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగిస్తున్నంత సేపూ ఆందోళనగా ఉన్నట్టు కనిపించారు. ఆయన జిల్లా పర్యటనకు వచ్చేదారిలో టీఆర్‌ఎస్‌, టిడిపి, జగన్‌ వర్గం నాయకులు కిరణ్‌ కాన్వయిని అడ్డుకున్నారు. పోలీసుల ఆందోళన కారులను చెదరగొట్టి సీఎం కాన్వాయ్‌ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.

అయితే, ఆయన మాత్రం ప్రసంగంలో తడబాటుకు గురయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్నానని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో మడమ తిప్పలేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆరేళ్ల కాంగ్రెస్‌ పాలనలో 28 లక్షల మంది రైతులకు ఉచిత కరెంటు అందేశామని, అందుకు అయిన 21 వేల కోట్ల రూపాయల ఖర్చు ప్రభుత్వమే భరించిందనీ చెప్పారు. రాష్ర్టంలో ఒకే సమయంలో అతివృష్టి అనావృష్టి సంభవిస్తే తట్టుకోలేమని గుర్తించిన వైఎస్‌ 86 ప్రాజెక్టుల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారని ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రతి సంవత్సరం 3,4 వేల టీఎంసీల నీరు ఆదా చేసుకోవచ్చన్నారు.

Wednesday, December 22, 2010

రైతు బాంధవుడు అనిపించుకోవాలన్న మీ లక్ష్యం నెరవేరింది కదా, ఇక దీక్ష విరమించండి * చంద్రబాబుకు కిరణ్‌కుమార్ విజ్ఞప్తి

జడ్చర్ల, డిసెంబర్ 22 : రైతు బాంధవుడు అనిపించుకోవాలన్న మీ లక్ష్యం నెరవేరింది కాబట్టి ఇకనైనా నిరాహార దీక్ష విరమించుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇక ఆలస్యం చేయకుండా చంద్రబాబు దీక్ష విరమించుకోవాలని సభాముఖంగా కోరుతున్నట్టు ఆయన చెప్పారు.

బుధవారంనాడు జడ్చర్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు అమలుచేసిన రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వై.ఎస్.తో కలిసి తాము ప్రతిపక్షంలో ఉండగా 11 రోజులు దీక్ష చేస్తే అప్పుడు కనీసం పట్టించుకున్న నాథుడు లేరని గుర్తు చేశారు. జడ్చర్లలో వై.ఎస్. విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి ఆనాటి విషయాలను గుర్తు చేశారు.

ఇప్పటికే తాము రైతులకోసం ఎంతో చేశామని, ఇంకా చేస్తామని, అందుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. ఐదేళ్లలో మీరు ఇచ్చినదెంతో, మేము ఒక్క సంవత్సరంలోనే రైతులకు చేసిన సంక్షేమ కార్యక్రమాల విలువ ఎంతో బేరీజు వేసుకోవాలని సభాముఖంగా కోరుతున్నట్టు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఐదరేళ్ళలో అంటే 2004 నుంచి 2010 వరకు వరదలకు, కరువులకుగాను మనకు 3,400 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కేంద్రం ఈ భారీ వర్షాల నష్టపోయిన రైతులకోసం 400 కోట్ల రూపాయలను ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్లో 2004 నుంచి 3,200 కోట్లు ఖర్చుపెట్టాం. అంటే గత ఐదేళ్ళలో 6,600 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం. అదిగాక రైతుల కోసం మరో వెయ్యి కోట్లు మంగళవారం ప్రక టించాం. అంటే సుమారు రూ. 7,600 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చుపెడితే తెలుగుదేశంపార్టీ తమ తొమ్మిదేళ్ళ పాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ. 1600 కోట్లు కాక 33 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. దీనిని బట్టి మీరు అర్ధం చేసుకోండి ఎవరు రైతు బాంధవుడు, ఎవరు రైతు పక్షపాతి అని - ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ళలో 8,000 కోట్లు ఖర్చుపెట్టిన మేము రైతుబాంధవులమా, తొమ్మిదేళ్ళలో 33 కోట్లు ఖర్చుపెట్టిన వారు రైతు బాంధవులా మరొక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాను అని ఆయన పునరుద్ఘాటించారు.

రాష్ట్రంలో సమస్య ఎక్కువగా ఉంది. అందులో విభేదించేది లేదు. పంటలుపోయి రైతులు చాలా నష్టపోయారు. రైతులు నష్టపోయినదానికి వీలైనంత వరకు ఈ ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను మరోమారు చంద్రబాబును కోరుతున్నా - మీరు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చేసిన దీక్ష ప్రజల దృష్టికి వచ్చింది. ప్రజల దగ్గర రైతుబాంధవుడిగా చెప్పుకునేందుకు మీ లక్ష్యం నెరవేరింది. అందుచేత దేనికోసమైతే నిరాహారదీక్ష చేస్తున్నారో అది నెరవేరినందువల్ల దీక్ష విరమించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అంటే అభిమానం ఉంది, ఒక ప్రతిపక్ష నాయకుడిగా మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇచ్చిన దానికంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటే అలాగే ఇచ్చేవాళ్ళమని, ఇచ్చే పరిస్థితి లేదని, ఎటువంటి భేషాజాలకు పోవలసిన అవసరం లేదని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు చేసిన రైతు వ్యతిరేక కార్యక్రమాలను ఎదుర్కొని తొమ్మిదేళ్ళు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అటువంటిది మనం చెడు చేసుకునే పరిస్థితి రాకూడదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఇటిక ఇటిక కూడబెట్టి పునాదిని గట్టి చేసి, ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కృషి చేశారని ఆయన చెప్పారు.

ఈ ప్రభుత్వం ఉందంటే ఇది మీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, మీరు తెచ్చిన ప్రభుత్వం, ఇది నాయకులు తెచ్చిన ప్రభుత్వం కాదు, కార్యకర్తలు మీరు కష్టపడి తీసుకొచ్చిన ప్రభుత్వం. అందుచేత దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రజలకు మేలు చేయాలని మమ్మల్ని మీరు నిలబెట్టారు. ఆ నమ్మకం ఉంచి, మీకు తలవంచి ప్రజలకు సేవ చేయడానికి కృషి చేస్తానని మనవి చేస్తున్నాను.

ఇది గాక ఇంకొక ప్రధానాంశం - దివంగత రాజశేఖర్‌రెడ్డి 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పునాదిని నెలబెట్టడానికి ఎంతో కష్టపడి పాదయాత్రచేసి ఎంతో కృషి చేశారు. దానికి మనమంతా సహకరించడం జరిగింది. అందుచేత వై.ఎస్.కు సోనియాగాంధీ దగ్గర ఒక ప్రత్యేక స్థానం ఉండేది. మేమందరం కూడా గౌరవించే వ్యక్తి ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీని వదిలిపోయే నాయకులు చాలామంది ఉన్నారు. అలాగే తిరిగి వచ్చినవాళ్లు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాది గట్టిగా ఉంది అని ఆయన చెప్పారు. త్వరలోనే రచ్చబండ కార్యక్రమం మొదలుబెట్టబోతున్నామని కూడా కిరణ్ ప్రకటించారు.

click here

నత్తనడకన నల్లారి పాలన * కిరణ్‌ బెంబేలు ! * సోనియాకు సవాల్‌ !

Secretariat
నల్లారి పాలన నత్తను తలపిస్తోంది. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి ఫైళ్ళు పెండింగ్‌ పెట్టబోనని స్పష్టం చేసిన సిఎంగారు తన మంత్రివర్గంలోని సభ్యులకు మాత్రం ఇప్పటి వరకు సహా యకులను, కార్యాలయాల సిబ్బందిని అందించలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ మంత్రుల కార్యాలయాల నుంచి సాధారణ పరిపాలన శాఖ(జిఎడి)కి ప్రతిపాదనలు అంది దాదాపు నెలరోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నది. మంత్రులకు సంబంధించిన ఆఫీసు వ్యవహారాల విషయంలోనే ఇంతగా నిర్లక్ష్యం ఉంటే ఇక రాష్ట్ర పరిపాలన వ్యవహారాల సంగతి మాటేమిటనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.

సాధారణంగా మంత్రుల కార్యాలయాల్లో వ్యక్తిగత కార్యదర్శులు(పిఎస్‌), ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ(ఒఎస్‌డి)వ్యక్తిగత సహాయకులు(పిఎ), ప్రజా సంబం ధాల అధికారులు(పిఆర్వోలు)లతో పాటు అటెండర్ల కేటాయింపులు ఉంటాయి. ఇందులో ప్రభుత్వ డిప్యూటీ డైరెక్టర్‌(డిడి) స్థాయికి మించి జాయింట్‌ డైరెక్టర్‌(జెడి) లేదా ఆపై స్థాయి అధికారులు మంత్రుల వద్ద వ్యక్తిగత కార్యదర్శులుగా, ఒఎస్‌డిలుగా పనిచేసే అవకాశం ఉంది. జాయింట్‌ డైరెక్టర్‌ హోదా కలిగిన అధికారుల డిప్యూటేషన్లకు మాత్రం ముఖ్యమంత్రి అనుమతి తప్పనిసరి. జెడి స్థాయి అధికారులు మినహా మిగతా సిబ్బంది డిప్యూటేషన్లకు ఆయా శాఖల అధిపతుల ద్వారా ఆర్ధిక శాఖ అనుమతితో నియామకాలు జరిపే అవకాశం ఉంటుంది.

కానీ ఇప్పటి వరకు మంత్రుల కార్యాలయాల్లో సిబ్బంది కేటాయింపులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడక పోవడంతో మంత్రులు శాఖలపై ఇంకా పట్టుసాధించలేకపోతున్నారు. దీంతో సదరు మంత్రులు తమ పని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడ కొనసాగించాలో తెలియని అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొత్తగా మంత్రిపదవులు పొందిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అసలే ఇష్టంలేని శాఖలు, ఆపై సహాయకులు(పిఎస్‌ లేదా ఒఎస్‌డి) లేకపోవడంతో ఏమి చేయాలో పోలుపోని పరిస్థితుల్లో మరికొందరు ఉన్నారు.

మంత్రులు జిల్లా పర్యటనలకు వెళ్ళే ముందు వారి పర్యటన(టూర్‌ ప్రోగ్రామ్‌)లకు సంబంధించిన వివరాలను సదరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు తెలియజేయాల్సి ఉం టుంది. అదేవిధంగా సాధారణ పరిపాలన శాఖకు కూడా సమాచారం అందజేయాల్సి ఉంటుంది. అధికారికంగా మంత్రుల వ్యక్తి గత కార్యదర్శులుగా ఖరారు కాని వారి నుంచి వచ్చే సమాచారాన్ని జిల్లా యంత్రాంగం బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తు తున్నాయి. ఇటీవల కొందరు మంత్రులు తమ సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పర్యటించాల్సిన సందర్భాల్లోనూ తప్పని పరిస్థితుల్లో అనధికారికంగా వారి వ్యక్తిగత కార్యదర్శులు, సిబ్బంది వెంట వెళ్తున్నారు.

కిరణ్‌ బెంబేలు !
Kiran-cmmవిజయవాడలో జగన్‌ చేపట్టిన లక్ష్య దీక్ష్య ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డికి దడ పుట్టిస్తున్నది. రైతు సమస్యలపై పోరాటమే లక్ష్యంగా మంగళవారం నుంచి 48 గంటల పాటు దీక్షకు ఉపక్రమించిన జగన్‌కు జనం, కాంగ్రెస్‌ కార్యకర్తలు నీరాజనం పట్టడం, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు పీఆర్పీ, టీడీపీ నేతలు కలిసి రావడంతో దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కడ పడుతుందోనని సిఎంకు, పార్టీ పెద్దలకు భయం చుట్టుకున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది.

మంగళవారం మొదటి రోజునే కాంగ్రెస్‌కు చెందిన సుమారు 22 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక టీడీపీ ఎమ్మెల్యే, పీఆర్పీ నుంచి ఇద్దరు దీక్షలో పాల్గొని బాహటంగానే జగన్‌కు మద్ధతు పలికారు. మరో వైపు సీమాంధ్రకు చెందిన ఐదుగురు ఎంపీలు కూడా జగన్‌కు మద్దతు ప్రకటిస్తారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఢిల్లీలో ఉన్న ఎంపీలు మం గళవారం రాత్రికి, బుధవారం విజయవాడకు చేరుకుని జగన్‌ శిబిరంలో పాల్గొనే అవకాశాలు న్నట్లు తెలుస్తోంది. జగన్‌ దీక్ష బుధ, గురు వారాల్లో కూడా కొనసాగనుండటంతో ఇంకెంత మంది పార్టీ నేతలు జగన్‌ బాట పడతారోనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ పెద్ద నేతలకు ఆందోళన కలిగిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పలువురు మంత్రులు, పార్టీ నేతలు కొందరు జగన్‌ దీక్షపై మంగళవారం మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేసినప్పటికీ అంత ర్గతంగా వారు కూడా దీక్షకు తరలి వచ్చిన జనం, నేతలను చూసి గుబులు పడుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాంగ్రెస్‌అధిష్ఠానాన్ని ధిక్కరించి, పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిన కడప మాజీ ఎంపి జగన్మోహన్‌రెడ్డి కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై రైతుసమస్యలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగిన జగన్‌కు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు మద్దతు పలకడం కాంగ్రెస్‌ నాయకత్వం గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిందని విని పిస్తోంది. తమ ఆదేశాలను ధిక్కరించి, పార్టీని సైతం లెక్క చేయకుండా ఊహించని విధంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు జగన్‌ శిబిరంలో పాల్గొని బాహటంగానే అతనికి మద్దతు పలకడమే కాకుండా పాటు ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికే వ్యతి రేకంగా వ్యవహరించిన తీరు కాంగ్రెస్‌ రాష్ట్ర, జాతీయ నేతలకు ఎంత మాత్రం మింగుడు పడటం లేదు. మరో రెండు రోజుల పాటు ఈ దీక్ష కొనసాగనున్నందున పార్టీ నేతలు ఇంకెంత మంది జగన్‌ వెంట క్యూలు కడతారోననే భయం కాంగ్రెస్‌ పెద్దలను వెంటాడుతున్నది.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డి మంగళవారం ప్రధానంగా జగన్‌ దీక్షపైనే దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జగన్‌ దీక్షకు పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఎంత మంది వెళ్ళారు, ఏ ప్రాంతం నుంచి అధికంగా వచ్చారు, జగన్‌ వెంట నడిచిన నేతలు ఏ ప్రయోజనాలు ఆశించి అటూ వెళు తున్నారు?, జగన్‌తో వారికి ఉన్న సంబం ధాలు, వ్యాపార లావాదేవిలపై సిఎం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు పార్టీ వైపు నుంచి సిఎం జగన్‌ శిబిరంపై సమాచారం సేకరించినట్లు విని పిస్తోంది. ఈ సమాచారంతో ఒక నివేదికను తయారు చేసి ఆయన పార్టీ హైకమాండ్‌కు నివేదించనున్నట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

పీసీసీ, ఎఐసీసీ ఆరా
పార్టీ ఆదేశాలను, క్రమశిక్షణను ఉల్లం ఘించి జగన్‌ దీక్షలో పాల్గొన్న పార్టీ నేతల విషయంలో పీసీసీ ఆరా తీస్తున్నట్లు సమా చారం. జగన్‌ దీక్షలో పార్టీ నేతలు ఎవరెవరు పాల్గొన్నారో, ఎంత మంది పార్టీ కార్యకర్తలు తరలి వెళ్ళారో వివరాలతో కూడిన నివేదిక అందజేయాలని విజయవాడ కాంగ్రెస్‌ కమి టీతో పాటు ఆయా జిల్లా కాంగ్రెస్‌ కమిటీలకు పీసీసీ తరఫున ఆదేశాలు వెళ్ళినట్లు తెలు స్తోంది. హస్తినలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ఇప్పటికే ఈ మేరకు ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. మరో వైపు ఎఐసీసీ కూడా జగన్‌ దీక్షపై తన నిఘా వర్గాల ద్వారా సమా చారం సేకరించినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
సోనియాకు సవాల్‌ !
Sonia-B
వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దయ నీయంగా, విషాదకరంగా మారింది. రెండు డజ న్లుకు పైన పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ ఏర్పాటు చేసుకున్న వేదికపైకెక్కి ఇరవైనాలుగు గంటలు గడిచినా వారికి కనీసం షోకాజ్‌ నోటీసులు ఇచ్చే ధైర్యం, దమ్ము కూడా కాంగ్రెస్‌ పార్టీ నాయ కత్వానికి కరవయిన దయనీయ పరిస్థితి నెల కొంది. మంగళవారం విజయవాడ కృష్ణానది ఒడ్డున వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన లక్ష్యదీక్ష శిబిరానికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు పీఆర్పీ, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే హాజరుకావడం సంచలనం సృష్టించింది. రెండవరోజుయిన బుధవారం మరో 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా హాజరు కానున్నారు.

ఒక రకంగా.. రాజకీయ చైత న్యానికి ప్రతీకగా భావించే విజయవాడ జగన్‌ మద్దతుదారుల బలప్రదర్శనకు వేదిక. జగన్‌ను చూసి కాంగ్రెస్‌ నిలువెల్లా వణికిపోతోంది. ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నిద్ర కూడా కరవ వుతోంది. ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీని సవాలు చేస్తారన్న ఊహలు ఆయనను ఒక పట్టాన నిలవనీయడం లేదు. 22 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు తన పార్టీని సవాల్‌ చేస్తున్న జగన్‌ దీక్షకు బాహాటంగా మద్దతు ప్రకటించడం, అయినా వారికి కనీసం ఇప్పటివరకూ షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేయటం, చర్యలు తీసు కుంటామని పీసీసీ అధ్యక్షుడు కూడా ఇప్పటి వరకూ హెచ్చరించకపోవడం బట్టి.. కాంగ్రెస్‌ అధిష్ఠానం జగన్‌ విషయంలోఅడకత్తెరలో పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

విజయవాడలో జగన్‌ నిర్వహించిన తొలిరోజు లక్ష్యదీక్షలో ప్రసంగించిన ప్రముఖులంతా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తూర్పారపట్టారు. స్వయంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ ఢిల్లీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని పిలుపు నిచ్చారు. అంబటి, జూపూడి ప్రభాకర్‌రావు, ప్రసన్నకుమార్‌రెడ్డి, రోజా, రాజశేఖర్‌, విజయచందర్‌, గట్టు రాంచందర్‌రావు, జక్కంపూడి విజయలక్ష్మి వంటి ప్రముఖు లంతా కాంగ్రెస్‌ను దుయ్యబడుతూ ప్రసంగిం చారు. అయినప్పటికీ వేదికపైనే ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వాటిని కనీసం ఖండిం చలేదు. తమ పార్టీని విమర్శిస్తున్నా నోరు మెదపకుండా జనం చేసే చప్పట్లకు తన్మ యులయ్యారు. వారంతా జగన్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మాదిరిగానే అత్యంత క్రమశిక్షణ గల సైనికులుగా కనిపించారు.

జగన్‌ దీక్షా శిబిరానికి 22 మంది ఎమ్మెల్యేలు హాజరయినప్పటికీ, వారిపై చర్యలు తీసు కోవాలా? తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసు కోవాలి? ముందు షోకాజ్‌ ఇవ్వాలా? వద్దా? ఇస్తే వారంతా పార్టీపై ఇక బాహాటంగానే తిరుగుబాటు చేస్తారా? అదే జరిగితే పార్టీ కొంప కొల్లేరవుతుందా? బుధవారం నాటి రెండవ రోజు దీక్షకు ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు హాజరవుతే ఏం చేయాలి అన్న ప్రశ్నలు అధిష్ఠానాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. బుధవారం నాటి దీక్షకు మరో 20 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు కూడా హాజరయేందుకు సిద్ధమవు తోన్న వైనం నాయకత్వాన్ని కలవరపరు స్తోంది. నిజంగా అదే జరిగితే ఇక కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడినట్లేనన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.

సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసు కుంటే, అసంతృప్తితో ఉన్న జగన్‌కు చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వారితో జత కలిస్తే కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడానికి ఎక్కువ కాలం అవసరం లేదని నాయకత్వం అంచనా వేస్తోంది. ఒక్క షోకాజ్‌ నోటీసు ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెడుతుందన్న అదురు అధిష్ఠానంలో కనిపి స్తోంది. అందుకే ఈ విషయంలో తన పార్టీ ఎమ్మెల్యేలు కళ్లెదుటే తనను ధిక్కరిస్తున్నా వారిపై చర్యలు తీసుకోలేని నిస్సహాయతలో ఉంది. ఈ విషయంలో పీసీసీ పరిస్థితి మరీ ఘోర ంగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌ డి..శ్రీనివాస్‌ అసలు పనిచేస్తున్నారా? లేరా అన్న అనుమానం ఏర్పడుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జగన్‌ వైపు వెళుతున్నా కనీసం తన స్థాయిలో కూడా స్పందించి, వారిపై హెచ్చరికలు కూడా జారీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.

అటు ఢిల్లీ నాయకత్వం కూడా రాష్ట్రంపై నిశితంగా దృష్టి సారిస్తోంది. జగన్‌ లక్ష్య దీక్షకు వస్తున్న జనాలు, ఎమ్మెల్యేల సంఖ్య, స్పందన వంటి అంశాలపై ఆరా తీస్తోంది. జగన్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలా వద్దా అన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. సీనియర్‌ నే త వి.హన్మంతరావు మాత్రం జగన్‌కు మద్దతు నిచ్చిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరతానని వెల్లడించగా, మంత్రి శంకర్‌రావు మరో అడుగు ముందుకేసి జగన్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.జగన్‌ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చర్యలపై తరచూ స్పందించే ఏఐసీసీ అధికార ప్రతినిధులు కూడా తాజా పరిణామాలపై నోరు మెదపకపోవడం చూస్తుంటే.. జగన్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ నాయకత్వం ఎంత భయపడుతోందో? ఎవరిపై చర్యల కొరడా ఝళిపిస్తే ఏమి కొంపలు మునుగు తాయోనన్న ముందుచూపుతో తర్జనభర్జన పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

Friday, December 17, 2010

రైతుల వడ్డీ మాఫీ

krian-sir ప్రకృతి వైపరీత్యాలు, అకాల నష్టాలకు గురై బతుకులు అతలాకుతలం అవుతున్న రైతాంగాన్ని కొంతమేరనైనా ఆదుకోవటానికి రాష్ట్ర సర్కార్‌ ముందుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు ఆమరణ నిరశన దీక్ష, కడప మాజీ ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 21, 22 తేదీలలో తలపెట్టిన 48 గంటల నిరశన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి గురువారం శాసనసభ శీతాకాల సమావేశాల ముగింపు రోజున రైతులకు కొన్ని తాయిలాలు ప్రకటిం చారు. బ్యాంకు నుంచి రూ.16,500 కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారని, వాటిపై వడ్డీని మాఫీ చేస్తున్నామన్నారు.

పంట నష్టపోయిన రైతులకు హెక్టార్‌కు రూ.6,000 చెల్లిస్తా మన్నారు. గతంలో రూ.4,500 ఉంటే ఇప్పుడు మరో రూ.1,500 పెంచామన్నారు. అలాగే గేదెలు, ఆవులకు రూ.15,000, దూడలకు రూ.10,000, గొర్రెలకు రూ.2,000, పౌల్ట్రీ రంగానికి రూ.40,000 చెల్లిస్తామని తెలిపారు. చేనేత రంగంలో మగ్గానికి రూ.5,000, రంగు మారిన, తడిసి పోయిన నూలుకు రూ.5,000 చెల్లిస్తామనిమత్స్యకార రంగంలో చెడిపోయిన పడవలకు రూ.5,000, పెద్ద పడవలు, వలలు నష్టపోయిన వారికి రూ.10,000 చెల్లిస్తామన్నారు.

ప్రధానమంత్రికి లేఖ
15 మాసాల్లో ప్రకృతి ఐదు పర్యాయాలు ఆగ్రహించిందని, జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశామన్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఢిల్లీలో ఉన్న సందర్భంగా మళ్ళీ మాట్లాడతామన్నారు. ఎఫ్‌సీఐ చైర్మన్‌ శుక్రవారం వస్తున్నారని, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు అంగీకరించే అవకాశం ఉందన్నారు. దెబ్బ తిన్న వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరతోనే కొనాలని కోరామన్నారు. పంటల బీమా విషయంలో వీలైనంత సాయం చేస్తామని, ఇప్పటికి 483 మండలాలు గుర్తించగా, మరి కొన్నిటిని గుర్తిస్తున్నామన్నారు. ఈ ప్రాంతాలలో రుణాలు రీ షెడ్యూల్‌ చేస్తామని, మరోవైపు రబీకి తాజా రుణాలు ఇస్తామన్నారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ డబ్బు కోసం ఒత్తిడి చేస్తామని, కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర బడ్జెట్‌ నుంచి ఖర్చు చేస్తామన్నారు. ఇది రైతుల ప్రభుత్వం అని, అదే పంథా కొనసాగిస్తామన్నారు.

మౌలిక సదుపాయాలకు రూ.1,000 కోట్లు
మౌలిక సదుపాయాల కల్పనకు పంచాయతీ రాజ్‌, రోడ్లు, భవనాల శాఖలకు రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నామని, ఇప్పటికే రూ.810 కోట్లకు టెఏండర్లు పిలిచామన్నారు. జాతీయ విపత్తు నిధుల విషయంలో తెలుగుదేశం పార్టీ తొమ్మిదేళ్ళలో రూ.1,677 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం ఈ ఆరు సంవత్సరాలలో కేంద్రం నుంచి రూ.3,204 కోట్లు వస్తే రాష్ట్రం నుంచి రూ.3,375 కోట్లు కలిపి రూ.6,579 కోట్లు వెచ్చించామన్నారు.

కనీస మద్దతు ధర
కనీస మద్దతు ధరపై నేడో రేపో నిర్ణయం తీసుకుంటామని, మిల్లర్లు ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాటన్‌ కార్పొరేషన్‌తో మాట్లాడుతున్నామని, మంచి ధర ఇప్పిస్తామన్నారు. రైతులు ఆత్మ స్థైర్యంతో ఉండాలని, ఇది వారి ప్రభుత్వమే అని ముఖ్యమంత్రి అన్నారు.

Tuesday, December 7, 2010

ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేద్దాం

cmkirankumar
రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ది పరుచుకోవా ల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా కోటపల్లి మండలంలోని అర్జున్‌ గుట్ట వద్ద పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై..ప్రాణహిత నది పుష్కరాలను ప్రారంబించారు. అనంతరం ప్రాణహిత నది ఒడ్డున ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది అంశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు పార్టీలకతీతంగా అందరు కృషి చేయాలన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదాకై రాష్ట్రంలోని 42 మంది ఎంిపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని.. అందుకు తన సహకారం కూడ ఉంటుందన్నారు. ప్రాణహిత చేవేళ్లతో పాటు పోలవరాన్ని కూడ సాధించుకుందామని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చా రు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు రూ.38 వేల కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నామన్నారు. ఈప్రాజెక్టు కింద 16 లక్షల 60 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందని ఆదిలాబాద్‌ జిల్లాలో లక్ష 50 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందన్నారు.

జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నా రన్నారు. తెలంగాణలోనే ఆదిలాబాద్‌ జిల్లా వెనుకబాటు వల్ల కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. వాటి పరిష్కరానికి తన వంతు సహకారంగా కృషి చేస్తానన్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి రీమ్స్‌ కళాశాలను ప్రారంభించారని.. అక్కడ శిక్షణకేంద్రంతో పాటు ఎమ ర్జెన్సీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. జిల్లాలో అనేక ఖాళీలు ఉన్నందున వాటిని భర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అర్జుని గుట్ట వద్ద మందిర నిర్మాణా నిి, చెన్నూర్‌లో బతుకమ్మ వాగుకు వంతెన నిర్మాణానికి రోడ్ల అభివృద్దికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సర్వతోముఖా భివృద్దికి అందరు సహకారం అందించాలని కోరారు. గిరి జనులకు వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు 28 మంది వైద్యులను నియమించామన్నారు. మరో 40 మంది మెడికల్‌ ఆఫీసర్స్‌తో పాటు 125 మంది నర్సులను నియమిస్తామన్నారు.ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు.

pushakaralu8 పిహెచ్‌సిలకు రూ.40 లక్ష లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 28 సబ్‌ సెంట ర్లను, 5 కమ్యూనిటి సెంటర్ల కోసం రూ. 5 లక్షల వంతున మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల అభివృద్ది కోసం ప్రత్యేక ప్లాన్‌ను రూపొందించామని అన్నా రు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆదిలాబాద్‌ జిల్లాకు రూ. 25 కోట్లు మంజూరయ్యాయని వచ్చే ఏడాది మరో రూ. 30 కోట్లు మంజురు కానున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక తొలి నిధులు జిల్లాకే వచ్చాయని అన్నారు. జిల్లాలో జల యజ్ఞం కింద 5 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వాటి పనులను వేగవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కృష్ణారావ్‌ పాల్గొన్నారు.

సోమవారం ఉదయం 9.30 గంటలకు కరీంనగర్‌ జిల్లా మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కరాలను పౌరసరఫరాల శాఖ మాత్యులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు కనీసం మంచినీటి సౌకర్యం కల్పిం చలేని దుస్థితి నెలకొంది. భక్తులకు సరిపడ స్నానఘట్టాలు ఏర్పరచ లేకపోయారు. చలువ పందిళ్ళు సైతం అంతంత మాత్రం గానే ఉన్నాయి. కొద్ది మందికి మాత్రమే బస ఏర్పాట్లు లభ్య మవుతున్నాయి. వేలాది మంది చలిపులిని తట్టుకోవడం కష్ట మే. రోడ్డంతా దుమ్ము, ధూళి. అడుగుతీసి అడుగు వేయలేక పోతున్నారు. క్యూలైన్‌ వద్ద సైతం గందరగోళం నెలకొంది. భోజన వసతి సైతం కల్పించ లేకపోయారు.

Monday, December 6, 2010

సంక్షేమం, అభివృద్ధి నాకు రెండు కళ్లు * ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం..

 

సంక్షేమం, అభివృద్ధి నాకు రెండు కళ్లు
ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తాం..

అన్ని పథకాలను అమలు చేస్తాం
పథకాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష..
అర్హులకు మాత్రమే ఫలాలు
ఉద్యమాలతో ఖజానాకు రూ.6వేల కోట్ల గండి..
త్వరలోనే ఇబ్బందులు అధిగమిస్తాం
ముఖ్యమంత్రి కిరణ్ ప్రకటన..
తాండూరులో తొలి పర్యటన
ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు. అదేసమయంలో... పథకాలను పూర్తిస్థాయిలో సమీక్షించి, లొసుగులను సవరించి అర్హులకు న్యాయం చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాక... తొలిసారిగా ఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు.

తాండూరులో ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన హౌసింగ్ కాలనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. "అభివృద్ధి, సంక్షేమం నాకు రెండు కళ్ల వంటివి. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలను, వైఎస్ చేపట్టిన పథకాలను కొనసాగిస్తాం. ప్రత్యేక, సమైక్య ఉద్యమాల వల్ల రూ.6 వేల కోట్ల ఆదాయానికి గండి పడింది. ఆర్థిక ఇబ్బందులున్నాయి.

రెండు మూడు నెలల్లో పరిస్థితిని గాడిన పెడతాం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, అన్ని పథకాలకు సక్రమంగా నిధులు మంజూరు చేస్తాం'' అని ప్రకటించారు. రెండు రూపాయలకు కిలోబియ్యం, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అభయ హస్తం, రాజీవ్ ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీటి ప్రాజెక్టులు తదితర పథకాల కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని కిరణ్ పేర్కొన్నారు.

ప్రాణహిత అంత ఈజీ కాదు: పోలవరం, చేవెళ్ల -ప్రాణహితలకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని కిరణ్ కుమార్ తెలిపారు. చేవెళ్ల- ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించడం అంతసులువు కాదని అభిప్రాయపడ్డారు. "చెప్పడానికి బాగానే ఉంటుంది.

కానీ... ఈ ప్రాజెక్టులో ఎన్నో కష్టాలు ఉన్నాయి. రంగారెడ్డితో పాటు తెలంగాణలోని జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించదలిచిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 38వేల కోట్లుగా అంచనా వేశారు. ప్రాజెక్టు రూపకల్పనకే రెండేళ్లు పట్టింది. కష్టాలు ఉన్నప్పటికీ... ఈ పనులు త్వరగా చేపట్టేందుకు కృషి చేస్తాం'' అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
మీ ఎకరా 2 కోట్లు మాది 2 లక్షలు
DWARACRA ముఖ్యమంత్రిగా రంగారెడ్డి జిల్లాలో జరిపిన తొలి పర్యటనలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాంతీయ వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. ‘మీకు (రంగారెడ్డి జిల్లా వాసులకు), మాకు (రాయలసీమ వాసు లకు) ఒకటే తేడా. మా ప్రాంతంలో, మీ ప్రాంతంలో నీళ్లు లేవు, రెండు చోట్లా బోర్‌నీళ్లే వ్యవసాయానికి దిక్కు. అయితే, మా దగ్గర ఎకరా రూ.2 లక్షలు ఉంటే, మీ దగ్గర ఎకరా రూ.2 కోట్లు ఉంది’ అని కిరణ్‌కుమార్‌ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. జిల్లాపేరును ప్రస్తావించినప్పుడు కూడా మీ రంగారెడ్డి జిల్లా అంటూ సీఎం సంబోధించడం విశేషం. తాండూరులో ఆదివారం ఇందిరమ్మ గృహాల సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

నిరుపేదలకు ఇళ్ల పట్టాలను, స్వయం సహాయక సంఘాలకు రుణాలను ఈ సభలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్‌ పథకాల అమలుకు ఎన్నికోట్ల రూపాయలైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత తరుణంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, మరో రెండుమూడు నెలల్లో కాస్త కోలుకోగానే సోనియా, వైఎస్‌ నాయకత్వాల్లో అమలుచేసిన అన్ని పథకాలను కొనసాగించేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ర్టంలోని అట్టడుగు ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో పథకాల అమలుకోసం పెద్దమొత్తంలో ప్రభుత్వం ఖర్చుచేస్తోందని తెలిపారు. 1983 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 47 లక్షల ఇళ్లను నిర్మిస్తే, ఆరేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వహయాంలో 51 లక్షల ఇళ్లను నిర్మించామని, మరో 14 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇంకో 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి 25 లక్షల మంది రైతులకు ఉచిత కరెంటును అందజేశామని, టీడీపీ హాయంలో వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టాల పాలైతే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 12వేల కోట్ల బకాయిలు మాఫీచేయడమే కాకుండా రూ. 1400 కోట్ల సాయాన్ని అందజేశామని తెలిపారు. ప్రస్తుతం పావలావడ్డీకి రైతులకు 35వేల కోట్ల పంటరుణాలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకో గా, ఇప్పటివరకు 25వేల కోట్ల రుణాలను అంద జేశామని,మిగిలిన 10వేల కోట్ల రుణాలను త్వర లోనే పంపిణీ చేస్తామన్నారు.

గతంలో 18 లక్షల మంది వృద్ధులకు నెలకు 75 రూపాయల పింఛన్‌ ను అందజేస్తే తాము 72 లక్షల మందికి నెలకు రూ.200 చొప్పున పింఛన్‌లను అందజేస్తున్నామని తెలిపారు. 8 లక్షల మంది వికలాంగులకు రూ. 500 చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే మహిళలు మరింత అభివృద్ధి సాధిస్తారని ఆశించి స్వయం సహాయక సంఘాలకు పావలావడ్డీకి 25వేల కోట్ల రుణాలను అందజేశామ న్నారు. 2003లో వైఎస్‌ ఈ పథకం అమలుకు హామీ ఇస్తే తన సొంతగ్రామమైన కలికిరిలో ఆశ్చ ర్యపోయామని, కంతులు(కిస్తీలు) ఎలా కడతారని అనుకున్నామని, అధికారంలోకి రాగానే వైఎస్‌ ఈ పథకాన్ని అమలుచేసి చూపించగా, 99 శాతం రుణాలను చెల్లించారని సీఎం గుర్తుచేశారు.

యేడా ది 280 కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ణయించగా, ఇంకా కావాలని అడుగుతున్నారన్నారు. అంతేకా కుండా 39 లక్షల మందికి అభయహస్తం కార్యక్ర మం కింద 360 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. కేవలం డబ్బులేక చదువుకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతో సోనియా, వైఎస్‌లు ఫీజురియంబర్స్‌ మెంట్‌ను అమలుచేశారని, త్వరలోనే ఈ పథకం కింద స్కాలర్‌షిప్పులను, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను చెల్లిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 5.30 లక్షల మందికి 2400 కోట్ల రూపాయలు వెచ్చిం చామని, చదువులు, ఆపరేషన్‌లు, రుణాలకోసం ఏ ప్రభుత్వం వెచ్చించనివిధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ, సీమాంధ్ర గొడవల కారణంగా ప్రభుత్వ ఖజానాకు రావల్సిన సుమారు 6వేల కోట్లు నష్టపోయామని, ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని, మరో రెండుమూడు నెలల్లో పూర్తిగా కోలుకుంటామని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో అన్నిపథకాలకు నిధులను అందజేస్తామని, స్కాలర్‌షిప్పులకు, ఫీజు రియంబర్స్‌మెంట్‌కు అవసరమైన మేరకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్‌లు కల్పించేందుకు వైఎస్‌ కృషిచేశారని, కోర్టులో ఇబ్బందులు తలెత్తాయని, దీన్ని త్వరలోనే అధిగమిస్తామని సీఎం తెలిపారు. ఐకేపీలో చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నాయని, 12500 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలను అందజేస్తే, మైక్రో ఫైనాన్సులు 7500 కోట్ల రుణాలను అందజేశాయని, మైక్రో ఆగడాలను అరికట్టేందుకు ఆర్డినెన్స్‌ కూడా తీసుకువచ్చామ న్నారు. 1.20 కోట్ల మందికి తెల్లరేషన్‌కార్డులు అందించి రూ.3వేల కోట్ల సబ్సిడీలను భరిస్తున్నా మని సీఎం తెలిపారు. పలు శాఖల్లో లొసగులు ఉన్నాయని, త్వరలోనే వాటన్నింటినీ గుర్తించి సరిచేస్తానని సీఎం పేర్కొన్నారు.

ప్రభుత్వ పథ కాలను అర్హులైన వారందరికీ అందజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందుకోసం ఎన్ని వ్యయప్రయాసలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనులను ప్రారంభిం చినంత సులువుగా, ప్రాజెక్టును పూర్తిచేయలేమని, పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టులను కేంద్ర ప్రాజెక్టులుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు. మొద టిసారిగా జిల్లాకు వచ్చిన తనను ఆశీర్వదించిన తాండూరు ప్రజలకు రుణపడివుంటానని, జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు తగుచర్యలు తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా పాలనలో పారదర్శకతను పాటిస్తా మన్న సీఎం ఈక్రమంలోనే ఐదుమంది నిరుపేద లకు ఇళ్లపట్టాలను అందజేయగా, మిగిలిన 2659 పట్టాలను ఎన్‌సీసీ క్యాడెడ్ల ద్వారా పంపిణీ చేశారు. పొదుపు సంఘాలకు రూ.45.50 కోట్ల రుణాలను సీఎం పంపిణీ చేశారు.

1056 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా వైఎస్‌, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. ఇదిలా వుండగా, సమావేశ వేదిక వద్ద తెలంగాణ వాదులు తెలంగాణకు మద్దతుగా నినాదాలు చేయడంతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. హెలీప్యాడ్‌ వద్ద, గురుకుల పాఠశాల వద్ద విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు వ్యక్తంచేశారు.మంత్రులు పి.సబితారెడ్డి, కన్నా లక్ష్మినారాయణ, సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, ఆకుల రాజేందర్‌, కూనశ్రీశైలంగౌడ్‌, బిక్షపతియాదవ్‌, కలెక్టర్‌ ఎం.దానకిశోర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

త్వరలో రచ్చబండ
క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు వైఎస్ తలపెట్టిన 'రచ్చబండ' కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని కిరణ్ తెలిపారు. పథకాల్లో లొసుగులు తెలుసుకుని, అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేస్తామన్నారు.

మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు. రాజీవ్ గృహకల్ప, పట్టణ గృహ నిర్మాణ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మేలు చేసేందుకు జీవో 42ను అమల్లోకి తెస్తామని తెలిపారు. దీని వల్ల రెండున్నర లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని కిరణ్ తెలిపారు.

వైఎస్ విగ్రహావిష్కరణ
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తాండూరులో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన కాలనీని ప్రారంభించారు. సబ్ స్టేషన్‌తోపాటు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితారెడ్డి , కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు.