ఉదయిస్తున్న కిరణం
అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఏడాది పాలనలో తనదైన ముద్ర వేయటంలో సఫలమయ్యారు. అధికారం పగ్గాలు చేపట్టిన ప్రారంభంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ బయటపడకుండా తనదైన శైలిలో పాలన సాగించిన కిరణ్ ఇప్పుడిప్పుడే పూర్తిగా కుదురుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నారు. అధిష్టానం వద్ద క్రమంగా తన పలుకుబడి పెంచుకుంటూ జటిలమైన సమస్యలను సైతం పరిష్కరించే స్థాయికి కిరణ్ ఎదిగారు. ఈ ఏడాది పాలనలో ఎక్కడా ఆయనపై అవినీతి ఆరోపణలు రాకపోవటం మరో విశేషం.
రాజకీయ ప్రత్యర్థులే కాకుండా విపక్షాలు సైతం ఈ విషయంలో ఆయనవైపు వేలెత్తి చూపలేకపోయారు. తెలంగాణ వాదం అతి బలంగా ఉన్న సమయంలోనూ 42 రోజులు సాగిన సకల జనుల సమ్మె సందర్భంగా సైతం కిరణ్ ఎక్కడా ఏ విషయంలోనూ రాజీ పడలేదు. ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ అన్ని కేసులనూ ఎత్తివేయటం సాధ్యం కాదని కరాఖండిగా తేల్చి చెప్పారు.
రాజకీయ ప్రత్యర్థులే కాకుండా విపక్షాలు సైతం ఈ విషయంలో ఆయనవైపు వేలెత్తి చూపలేకపోయారు. తెలంగాణ వాదం అతి బలంగా ఉన్న సమయంలోనూ 42 రోజులు సాగిన సకల జనుల సమ్మె సందర్భంగా సైతం కిరణ్ ఎక్కడా ఏ విషయంలోనూ రాజీ పడలేదు. ఉద్యమం సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ఎంతో ఒత్తిడి వచ్చినప్పటికీ అన్ని కేసులనూ ఎత్తివేయటం సాధ్యం కాదని కరాఖండిగా తేల్చి చెప్పారు.
పెరుగుతున్న పలుకుబడి....
మొదట్లో బాలారిష్టాలు...
మొదట్లో మంత్రివర్గం కూర్పు వద్ద నుంచి ఉవ్వెత్తున ఎగిసిన సకల జనుల సమ్మె దాకా అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కిరణ్ మౌనంగా తన పని తాను చేసుకుపోయా రు. అనేక సందర్భాలలో ఢిల్లీ వద్ద తన పలుకుబడిని నిరూపించుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరు సంవత్సరాల పాలనలో ప్రారంభిం చిన పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకా లను అమలు చేయటంలో కిరణ్ విజయం సాధించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయ చాతుర్యం...
వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా జగన్ వర్గానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినప్పటికీ కిరణ్ కంగారు పడలేదు. మౌనంగా అన్ని పరిణామాలను గమనిస్తూనే తన వ్యూహాన్ని అంతర్గతంగా అమలు చేయటం ప్రారంభించారు. ఫలితంగా జగన్ వైపు వెళ్ళిన కొందరు ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని మళ్ళీ కాంగ్రెస్ వైపు దృష్టి సారించారు. ఒకవైపు వ్యూహాలను అమలు పరుస్తూనే మరోవైపు తనదైన శైలిలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి అవసరమైన కార్యక్రమాలను ఆమోదింపజేసుకుంటున్నారు.
తొలి ఘన విజయం14ఎఫ్ రద్దు...
ఇక ఎన్నటికీ జరగదనుకున్న 14ఎఫ్ నిబంధనను కిరణ్ కేంద్రాన్ని ఒప్పించి రద్దు చేయించగలగటంతో ఆయన తొలి విజయం ప్రారంభమైంది. పోలీసు నియామకాలకు సంబంధించిన ఈ వివాదాస్పద నిబంధన తెలంగాణ ప్రాంతంలో చిచ్చు రేపింది. ఎసై్స అభ్యర్థులలో ఎంతో ఆందోళన కలిగించిన ఈ నిబంధన రద్దు కావాలని తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ ఫలితం లేకపోగా కిరణ్ దాన్ని రద్దు చేయించగలిగారు.
నీట్ వాయిదా...
తాజాగా విద్యార్థి లోకానికి ఎంతో ఆందోళన కలిగించిన నీట్ పరీక్షా విధానాన్ని రాష్ట్రానికి సంబంధించినంత వరకు రెండేళ్ళు వాయిదా వేయించటంలో కిరణ్ సఫలమయ్యారు. శుక్రవారం కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో టెలిఫోన్‌లో మాట్లాడి సానుకూలంగా వాయిదా వేయించగలిగారు. దీనివల్ల విద్యార్థి లోకానికి, వారి తల్లిదండ్రులకూ ఎంతో ఊరట చిక్కినట్టే లెక్క.
మద్దతు ధర...
అలాగే ధాన్యానికి రూ.80 హెచ్చించటంతో పాటు రూ.1,200 బోనస్ ప్రకటించటంతో రైతులకు ఊరట కలిగించినట్టయింది. ధాన్యం నిల్వల కోసం గోదాముల నిర్మాణానికి స్థలాలను కేటాయించాలన్న ఆదేశంతో కిరణ్ సర్కార్ రైతులకు మరో మేలు చేకూర్చి నట్టయింది.
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 1960, సెప్టెంబర్ 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన విధ్యాభ్యాసమంతి హైదరాబాద్‌లోనే కొనసాగింది. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాల యాలలో బీకాం, ఎల్‌ఎల్‌బీలను చదివారు.
వ్యక్తిగత జీవితం....
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి 1960, సెప్టెంబర్ 13న నల్లారి సరోజమ్మ, అమరనాథరెడ్డిలకు హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన విధ్యాభ్యాసమంతి హైదరాబాద్‌లోనే కొనసాగింది. నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాల యాలలో బీకాం, ఎల్‌ఎల్‌బీలను చదివారు. నిజాం కళాశాల విద్యార్థి సంఘం నాయకునిగా పనిచేశారు. ఇక రాష్ట్రం తరపున రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. కిరణ్‌కుమార్ రెడ్డి కెప్టెన్‌గా ఉన్నప్పు డు జట్టులోని ప్రముఖులలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టె న్ అజారుద్దీన్, ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే టీం సభ్యులుగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వివాహం రమణా రెఇ్డ కుమార్తె రాధికారెడ్డితో జరిగింది. ఈ దంపతలుకు కుమార్తె నీహారిక,కుమారుడు నిఖిలేష్ ఉన్నారు.
రాజకీయ ప్రస్ధానం...
తండ్రి అమరనాథరెడ్డి 1987లో మృతి చెందిన తరువాత 1988లో వాయల్పాడుఉప ఎన్నికల్లో తల్లినల్లారి సరోజమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయింది. అనంతరం 1989 సాధారణ ఎన్నికల్లో కిరణ్ పోటీ చేసి గెలిచారు.1994లో భారీ తేడాతో ఓటమి చవిచూసినా 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ నమోదుచేశారు. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా, 2009లో అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఇక రాజకీయంగా నేదురుమల్లిజనారద్నరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డిలతో సన్నిహితంగా ఉండేవారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డితో మొదట్లో విరోధమున్నా తర్వాత ఆయనకు సన్నిహితమయ్యారు. ఇక 2010 నవంబర్ 25న కిరణ్‌కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు.
పాత పధకాల కొనసాగింపు....
ఈ కొత్త పథకాలే కాకుండా గత ఏడు సంవత్సరాలుగా అమలవుతున్న రైతులకు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం, ఫీజు రీయంబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ళు, పింఛన్లు, పావలా వడ్డీ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ వంటి పథకాలను సైతం కొనసాగిస్తున్నారు. విమర్శలు ఎదురైనప్పుడు వెనుకడుగు వేయకుండా, ఇటు పాలనా పరంగా, అటు రాజకీయ ఇబ్బందులను సైతం తట్టుకుంటూ కిరణ్ తన పని తాను చేసుకుపోతున్నారన్న ప్రశంసలు ఇప్పుడు ఆయన వైరి వర్గాల నుంచి సైతం అందుతున్నాయి.
ఏడాదిపాలనలో ప్రవేశపెట్టిన పధకాలు....
- దరల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ...ఇది మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో పని చేస్తుంది...
- మీ సేవ...ఐటీ పరిజ్ఞానం ద్వారా సామాన్యుడికి పారదర్శకంగా, సులభంగా, వేగంగా సేవలందించే పథకం...12 సేవలతో ప్రారంభమైన ఈ పథకం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 50 సేవలను అందిస్తుంది.
- రచ్చబండ 1, 2...ఎలాంటి అండ లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా సహాయం అందేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనివల్ల దాదాపు కోటి మంది పేదలకు ప్రయోజనం కలుగుతుంది.
- విద్యా పక్షోత్సవాలు...రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ధ్యేయంతో రూ.3,500 కోట్ల వ్యయంతో గత జూన్ మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- రాజీవ్ యువ కిరణాలు (మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు)...2014 నాటికి 15 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించటం, పబ్లిక్, ప్రైవేట్ రంగాలతో అనుసంధానం చేసి ఉపాధి కల్పించటం, పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా పాఠ్యాంశాలను తీర్చిదిద్దటం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
- ఇందిర జలప్రభ...రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన 10 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావటానికి రూ.1,800 కోట్లతో అక్టోబర్ రెండు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల కుటుంబాలను పేదరికానికి దూరం చేయాలన్నది సంకల్పం.
- రూపాయికే కిలో బియ్యం...రాష్ట్రంలో నిరుపేదలందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలన్న సంకల్పంతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 7.50 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అంచనా.
- స్టేట్ మిల్క్ మిషన్...రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
- సాగురైతుల రక్షణకు చట్టం...కౌలు రైతులకు మేలు చేకూరే విధంగా భూమి లైసెన్సు పొందిన సాగుదారుల ఆర్డినెన్స్‌ను చట్ట రూపంలోకి తెచ్చారు.
- పంట రుణాలకు జీరో వడ్డీ...లక్ష రూపాయల దాకా రుణం తీసుకున్న రైతులు సకాలంలో దాన్ని చెల్లిస్తే జీరో వడ్డీ పథకం వర్తింపజేస్తారు. దీనివల్ల 95 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.
- 1.16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్...వచ్చేనెల చివరికల్లా 1,16,000 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను పూర్తిగా నోటిఫై చేస్తారు. ఏపీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఉపాధ్యాయుల డీఎస్సీ నియామక సంస్థ వంటివి ఉద్యోగాలను భర్తీ చేస్తాయి...
- స్ర్తీనిధి మహిళా బ్యాంక్...మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించకుండా తక్కువ వడ్డీతో 24 వాయిదాలలో తీర్చుకునే వెసులుబాటు కల్పించారు
No comments:
Post a Comment