
కష్టాల మీద కష్టాలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ పార్లమెంటు సభ్యుల దీక్ష రూపంలో కొత్త కష్టం వచ్చిపడింది. సొంత పార్టీకి చెందిన తెలంగాణ పార్ల మెంటు సభ్యులు దీక్షకు దిగడంతో పాటు, కేసుల ఎత్తివేతలో ఎంపీలు తన నిర్లక్ష్యవైఖరిని బహిరంగంగానే విమర్శిం చడం కిరణ్ కుమార్‌రెడ్డిని కొత్త సమస్యల వైపు నెట్టినట్టయింది. తాజా పరిణా మాలన్నీ తెలంగాణ విద్యార్థుల దృష్టిలో ‘సీఎం తెలంగాణ వ్యతిరేకి’గా ముద్ర పడేందుకు కారణమవుతున్నాయన్న వ్యా ఖ్యలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తాను హైదరాబాదీ నేనని ఉస్మానియా విద్యార్థినేనని కిరణ్ ఎన్నిసార్లు చెప్పినా, అవి ప్రస్తుత పరిస్థితిని చల్లార్చేలా కనిపించడం లేదు. తెలం గాణ ఉద్యమంలో విద్యార్థుల మీద పోలీసులు అక్రమంగా బనాయించిన కేసులను బేషరతుగా తొలగించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు దీక్షకు దిగడం సీఎంని రాజకీయంగా ఇరుకున పడవేసింది. ఇది సొంత పార్టీ ఎంపీలనే సీఎం నియంత్రిం చలేకపోయారని, ఇక మామూలు నేతలను ఏం నియంత్రి స్తారన్న సంకేతాలు వెళ్లడమే దానికి కారణం.
ప్రభు త్వంపై ప్రతిపక్షాలు ఒత్తిడి చేసేందుకు దీక్షలు, ఆందోళ నలు చేస్తాయంటే దానిని అర్థం చేసుకోవచ్చని, కానీ సొంత పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే దీక్షకు దిగడం వల్ల ప్రభుత్వం విఫలమయిం దన్న భావన ప్రజల్లో పాతకు పోతే వ్యక్తిగతంగా ఒక సీఎంగా అది తనకే అప్రతిష్ఠగా పరిణమించే ప్రమాదముందని కిరణ్ ఆందోళనలో ఉన్నారు. డిసెంబర్ తర్వాత జరగనున్న పరిణామాలు కఠినంగా ఉంటాయని, అది కూడా టీఆర్ఎస్-టీడీపీ పోటాపోటీ రాజకీయ వ్యూహాల వల్ల పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా ఉంటుందేమోనని అందరూ భావిస్తున్నారు.
అయితే అంతకంటే ముందే ఆ ప్రమాదం సొంత పార్టీ ఎంపీల నుంచే ముంచుకురావడం కిరణ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా పరిణామాలు ఆయనను కలవరపరు స్తున్నాయి. జానారెడ్డి, జైపాల్‌రెడ్డిలో ఒకరు ముఖ్యమంత్రి అయితే ఈ పరిస్థితి ఉండేది కాదని ఎంపీ సర్వే సత్య నారాయణ మీడియా సమక్షంలోనే వ్యాఖ్యానించటం, దానిని మిగిలిన ఎంపీలు బలపరచడం బట్టి.. కిరణ్ కుమార్‌రెడ్డిని తెలంగాణ ఎంపీలు ఆమోదించడం లేదన్న విషయం స్పష్టంగా తెలిసిపోయింది.
కేవలం ముఖ్యమంత్రి మొండివైఖరి వల్లే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చిందని, తాము ఈనెల 20నే సీఎంను కలసి కేసులన్నీ బేషరతుగా ఎత్తివేయాలని స్పష్టం చేసినా కిరణ్ దానిని లెక్కచేయకుండా మాట్లాడారని, అందుకే తాము నిస్సహాయ పరిస్థితిలోనే దీక్ష చేయవలసి వచ్చిం దని దీక్షలో పాల్గొన్న ఎంపీలు బాహాటంగానే మీడియాకు స్పష్టం చేస్తుండటం కూడా ముఖ్యమంత్రికి ఇబ్బంది కరంగా పరిణమించింది. దీనివల్ల కేవలం తన కారణం గానే కేసుల ఎత్తివేత అంశంలో ప్రతిష్ఠంభన ఏర్పడిం దన్న ఎంపీల ఆరోపణలను తిప్పికొట్టలేక ఇబ్బందిపడు తున్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి ముఖ్యమంత్రిని బాధ్యుడిగా చేస్తూ జరుగుతున్న ప్రచారం వ్యక్తిగతంగా కూడా కిరణ్‌కు సైతం రాజకీయంగా నష్టంగానే భావిస్తున్నారు. దీక్ష విరమణకు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, బస్వరాజు సారయ్య, శ్రీధర్‌బాబు వంటి మంత్రులు వెళ్లినా వారి ఎదుట కూడా ఎంపీలు ‘దీనికి కారణం ముఖ్యమంత్రేన’ంటూ సర్వే వంటి ఎంపీలు ముఖం మీదే స్పష్టం చేయడం బట్టి.. తెలంగాణ ఎంపీలు కిరణ్ తీరుపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో తెలుస్తోంది. చివరకు మంత్రులను కూడా ఎంపీలు ఖాతరు చేయక పోవడం ద్వారా ప్రభుత్వానికి-కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల మధ్య దూరం పెరిగిందన్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. కేసులన్నీ ఎత్తివేసేవరకూ చర్చించడం కుదరదని సీడబ్ల్యుసీ సభ్యుడిగా వ్యవహరించి, ఒక రాష్ట్ర ఇన్చార్జిగా పనిచేస్తున్న కేశవరావు వంటి సీనియర్లు కూడా నిర్మొహమాటంగా మాట్లాడటం కిరణ్ సర్కారును చిక్కుల్లో పడవేసింది.
డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తు తాయని, తనకు అధిష్ఠానం కేవలం 3 నెలలు మాత్రమే గడువు విధించిందన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశ మయిన నేపథ్యంలో.. సొంత పార్టీ నుంచే, అదీ తెలం గాణ రూపంలో సెగ తగలడంతో కిరణ్ ఆత్మ రక్షణలో పడిపోయారు. తెలంగాణలో పోలీసు దళాలను మోహరిం చడాన్ని టీఆర్ఎస్-టీడీపీతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా నిరసిస్తున్నారు. వారిని వెనక్కి పంపిస్తే ఆ తర్వాత జరిగే ఘర్షణ పరిస్థితిని నియంత్రిం చడంలో విఫలమవుతే దానిని కారణంగా చూపించి తనను తప్పిస్తా రన్న భయాందోళన కూడా ఆయనలో లేకపోలేదు. బలగాలను మోహరించి, వారితో ఉద్యమాన్ని అణచివేస్తే తెలంగాణ వాదులు రేపే ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడం ఇంకా కష్టమవుతుందన్న ఆందోళన కూడా కనిపిస్తోంది.
సొంత పార్టీ ఎంపీల దీక్ష అనంతర పరిణా మాలు సీఎం్కు- తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మధ్య సమ న్వయం లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ సంకే తాలు ఇప్పటికే క్షేత్రస్థాయికి వెళ్లడం ఆయనకూ ప్రతిష్ఠాత్మ కంగా పరిణమించింది. సీఎం- మంత్రులు చెప్పినా వినని పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సామాన్య ప్రజానీకం లో నెలకొంది. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఇక డిసెంబర్ తర్వాత తలెత్తే రాజకీయ పరిణామాలు ఇంకెంత తీవ్రంగా ఉంటా యోనన్న భయాందోళన అన్ని వర్గాల్లోనూ నెలకొంది. మొత్తానికి ఎంపీలు- శాసనసభ్యులతో సీఎంకు సాన్నిహిత్యం గానీ, సమన్వయం గానీ లేదన్న వాస్తవాన్ని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.






ప్రకృతి వైపరీత్యాలు, అకాల నష్టాలకు గురై బతుకులు అతలాకుతలం అవుతున్న రైతాంగాన్ని కొంతమేరనైనా ఆదుకోవటానికి రాష్ట్ర సర్కార్ ముందుకు వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఆమరణ నిరశన దీక్ష, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 21, 22 తేదీలలో తలపెట్టిన 48 గంటల నిరశన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి గురువారం శాసనసభ శీతాకాల సమావేశాల ముగింపు రోజున రైతులకు కొన్ని తాయిలాలు ప్రకటిం చారు. బ్యాంకు నుంచి రూ.16,500 కోట్ల రుణాలను రైతులు తీసుకున్నారని, వాటిపై వడ్డీని మాఫీ చేస్తున్నామన్నారు.
పారదర్శక పాలనకు ఊత మివ్వండీ... భాద్యతాయుతంగా నిధులు నిర్వర్తించా లి...సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే స్పందించాలం టూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంఓ అధి కారులకు క్లాస్ ఇచ్చారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.వీ.ప్రసాద్ సిఎంవో అధికా రులతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికా రుల పనితీరుతోనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగు తుందని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తన పేషీలో పనిచేస్తున్న అధికారులకు సూచించారు. పారదర్శకతతో, సమర్ధవంత పాలనకు పెద్దపీట వేసి ప్రజలకు చేరువయ్యే విధంగా సుపరిపాల నను అందించి, తద్వారా సంస్కరణలకు పెద్దపీట వేయాల ని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసా గించాలని, ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేవిధంగా విధినిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. 
8 పిహెచ్‌సిలకు రూ.40 లక్ష లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 28 సబ్ సెంట ర్లను, 5 కమ్యూనిటి సెంటర్ల కోసం రూ. 5 లక్షల వంతున మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల అభివృద్ది కోసం ప్రత్యేక ప్లాన్‌ను రూపొందించామని అన్నా రు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఆదిలాబాద్ జిల్లాకు రూ. 25 కోట్లు మంజూరయ్యాయని వచ్చే ఏడాది మరో రూ. 30 కోట్లు మంజురు కానున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక తొలి నిధులు జిల్లాకే వచ్చాయని అన్నారు. జిల్లాలో జల యజ్ఞం కింద 5 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వాటి పనులను వేగవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కృష్ణారావ్ పాల్గొన్నారు. 

ముఖ్యమంత్రిగా రంగారెడ్డి జిల్లాలో జరిపిన తొలి పర్యటనలోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాంతీయ వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. ‘మీకు (రంగారెడ్డి జిల్లా వాసులకు), మాకు (రాయలసీమ వాసు లకు) ఒకటే తేడా. మా ప్రాంతంలో, మీ ప్రాంతంలో నీళ్లు లేవు, రెండు చోట్లా బోర్‌నీళ్లే వ్యవసాయానికి దిక్కు. అయితే, మా దగ్గర ఎకరా రూ.2 లక్షలు ఉంటే, మీ దగ్గర ఎకరా రూ.2 కోట్లు ఉంది’ అని కిరణ్‌కుమార్ వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. జిల్లాపేరును ప్రస్తావించినప్పుడు కూడా మీ రంగారెడ్డి జిల్లా అంటూ సీఎం సంబోధించడం విశేషం. తాండూరులో ఆదివారం ఇందిరమ్మ గృహాల సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో మళ్లీ రెడ్డి రాజ్యం మొదలయింది. పధ్నాలుగు నెలల ముందు వరకూ వైఎస్ రాజ శేఖరరెడ్డి! ఇప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి!! మరి బీసీల గతి? ఏముంది మళ్లీ అధోగతే!!! బీసీలు ఓట్లకే పనికివస్తారు తప్ప, పదవులకు పనికి రారని కాంగ్రెస్ నాయ కత్వం తన చర్యలతో మళ్లీ రుజువు చేసింది. జనాభా దామాషా ప్రకారం దక్కవలసిన పదవులన్నీ రివర్సయిన వైనం కిరణ్ కుమార్‌రెడ్డి సారథ్యంలోని సర్కారులో మరోసారి దర్శన మిచ్చింది. 52 శాతం ఉన్న బీసీలకు వచ్చిన పదవులు పదయితే, జనాభాలో కేవలం 4 శాతమే ఉన్న రెడ్లకు మాత్రం దక్కిన పద వులు పచ్చగా పధ్నాలుగు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి వర్గానికి రెడ్‌కార్పెట్ వేసి, బీసీలను వెనక్కితోసి ముందుకు వెళ్లింది. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధికి ఇదో నిలువెత్తు నిద ర్శనం. కాంగ్రెస్ పార్టీ మరోసారి రెడ్డి సామాజికవర్గానికేపట్టం కట్టి, బీసీలను అణచివే యాలని నిర్ణయిం చుకున్నట్లు బుధ వారం నాటి మంత్రివర్గం స్పష్టం చే సింది. గతంలో 34 మంది ఉన్న మంత్రిమండలిలో 12 మంది రెడ్లకు స్థానం కల్పించగా, ఈసారి 40మంది ఉన్న మంత్రి మండలిలో 14 మందికి స్థానం దక్కడం చూస్తే ఆ వర్గం హవా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవు తోంది.
అదేవిధంగా, గతంలో 11 మంది బీసీ లు న్నారు. కొండా సురేఖ రాజీనామా చేయగా ఆ సంఖ్య 10 మందికి పడింది. రెడ్ల మాదిరి గానే గతానికన్నా ఇప్పుడు బీసీల సంఖ్య పెంచే అవకాశం ఉన్నా ఆ పనిచేయలేదు. ఇప్పుడు 40 మంది మంత్రులున్నా అందులో బీసీల సంఖ్య పది మందే కావడం బట్టి, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో బీసీల అవసరం లేదని చ ెప్పకనే చెప్పినట్టయింది. మంత్రివర్గంలో ఈసారి జనాభా దామాషా ప్రకారం ప దవులు ఇవ్వకపోతే ఆందోళన తప్పదని బీసీ సంఘాలు హెచ్చరించినప్పటికీ, కాంగ్రెస్ దానిని ఏ మాత్రం ఖాతరు చేసినట్లు కనిపించలేదు. చివరకు శాఖల కేటాయింపులో కూడా రెడ్లదే హవా. హోం, సమాచార, భారీ నీటిపారుదల, ఆ ర్థిక, పురపాలక, వ్యవసాయం, ఆరోగ్య, పంచాయతీరాజ్, న్యాయశాఖలు రెడ్డి వర్గానికే దక్కాయి. బీసీలకు ఎకై్సజ్, రెవిన్యూ, రవాణా, ఆర్ అండ్ బి శాఖలు మాత్రమే కీలకమైనవి దక్కాయి. రాయలసీమకు కీలక శాఖలు కేటాయించడం ద్వారా ముఖ్యమంత్రి తన ప్రాంతానికి న్యాయం చేశారు.
రాష్ట్ర రాజకీ యాల్లో ప్రభావితం చేసే పాత్ర పోషించే కమ్మ వర్గానికి దక్కింది ఒక్కటే. దీనిపై నా ఆ వ ర్గీయులు మండిపడుతున్నారు. తమను కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీగా చూ స్తోందని విరుచుకుపడుతున్నారు. తమ వర్గానికి ఎక్కువ శాఖలు ఇ వ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన డిమాండ్‌ను ఎవరూ పట్టిం చుకోలేదని స్పష్టమయింది. కాంగ్రెస్ వైఖరి చూస్తే కమ్మ సామాజిక వర్గం ఓట్లు తమకు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎలాగూ తమ వర్గం టీడీపీ వైపు మొగ్గు పచూ పుతుందన్న ముందుచూపుతోనే తమను పక్కకు పెట్టారని మండిపడుతున్నారు. కాపులలో కూడా అసంతృప్తి రగులుతున్నది. కోస్తాలో కాపులు, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు, తెలంగాణలో మున్నూరు కాపులను కలి పితే మొత్తం కాపులకు 5 పదవులు దక్కినట్లయింది.ే సంఖ్యాపరంగా 5 పదవు లు దక్కినప్పటికీ, ఏ ఒక్కటీ కీలక శాఖ కాకపోవడం కాపుల్లో అసంతృప్తి రాజేసింది.





































