Friday, December 24, 2010

అన్నదాతకు ఆసరా

kirankumar
భారీ వర్షాలతో కళ్ళముందే నోటికాడికొచ్చిన పంటంతా తడిసి నేల పాలు కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి అమలు చేయ బోతోంది. జరిగిన నష్టంనుంచి తేరకునే దారి కనిపించక గుండె పగిలి కొందరు, విషంతాగి మరి కొందరు, గొంతుకు ఉరి బిగించుకుని ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాలనుంచి ఇప్పటివరకు సుమారు రెండు వందల మంది రైతులను పంటనష్టాల రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. ఆరుగాలం చెమటోడ్చి పంటల సాగుద్వారాఅంతో ఇంతో మిగిల్చి కుటుంబాన్ని నెట్టుకొచ్చే పెద్దదిక్కును కోల్పోవంటంతో రైతుల కుటుంబాలు వీధి పాలవుతున్నాయి.

ఉన్న ఒక్కదిక్కును కోల్పో వటం ఒకపక్క, పంటలసాగుకోసం చేసిన పెట్టు బడి ఖర్చులు మిగిల్చిన రుణాల గాయం మరోపక్క రైతుల కుటంబా లను జీవశ్చవాలుగా మారుస్తు న్నాయి. ఈ పరిస్థితుల్లో ఆత్మహత్యలద్వారా ప్రా ణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేం దుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఒక్కో రైతు కుటుంబానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయాలు సహా యం అందించాలని రాష్ట్ర మంత్రులు కొందరు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డికి సూచించారు.

మంత్రుల సూచనపై అధి కారులతో సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి అన్ని కోణాలనుంచి జరిపిన విష్లేషణల అనంతరం ప్రత్యేక పరిహారం అందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమా చారం. మృతి చెందిన రైతుల కుటంబాలకు ఒక్కోక్కరికి లక్షన్నర రూపాయలు అందించేం దుకు అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివ రకూ మృతి చెందిన రైతుల సంఖ్య రెండువందల దాక ఉన్నందువల్ల వీరందరికి లక్షన్నర రూపా యల ప్యాకేజి అందించేందుకు ప్రభు త్వానికి అయ్యే ఖర్చు మూడు కోట్ల రూపాయలకు మించ దని అధికారులు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి కి నివేదించినట్టు సమాచారం.

తడిసిన ధాన్యం ‘గ్రేడ్ల’ ఎత్తివేత!
రాష్ట్రంలో తడిసిన ధాన్యం కొనుగోళ్ళకు సంబం దించి ఉన్న గ్రేడ్ల నిభందనలను పూర్తిగా తొలగిం చాలన్న ప్రతిపాదలకు ప్రభుత్వం సుముఖతతో ఉన్నట్టు సమాచారం. భారీ వర్షాలు వరదల్లో వరిపొలాలు నీట మున గటం, నేల వాలిన వరిపై నీరు నిలిచి పైరుపైనే ధాన్యం మొలకలు వచ్చాయి. కొన్ని జిల్లాల్లో కోత కోసి కుప్పలేసిన వరి ఓదెలు తడిసి పోయాయి. మరికొన్ని జిల్లాల్లో పొలాల మీద ఉన్న ధాన్యపు రాసులే తడిసి మోసులెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం సుమారు 40 లక్షల టన్నులు ఉంటుందని ప్రాథమిక సమా చారాన్ని బట్టి తెలుస్తోంది.

అయితే ఇందులో 20 లక్షల టన్నుల మేరకు ధాన్యం 5నుంచి పదిశాతం తడిసినది ఉంటుందని, మరో పది లక్షల టన్నుల దాకా పదినుంచి 20 శాతం తడిసిన ధాన్యం ఉం టుందని ప్రభుత్వ వర్గాల అంచాలను బట్టి చెబు తున్నారు. ఇక పూర్తిగా తడిసి నల్లబడ్డ ధాన్యం పదిలక్షల టన్నులకు మించదని చెబుతున్నారు. పదిలక్షల ధాన్యం క్వింటాలుకు రూ 6వందలు చెల్లించినా ప్రభుత్వానికి 6వందల కోట్లు రూపా యలకు మించి ఖర్చు కాదం టున్నారు. ప్రతినెలా ఉద్యోగుల జీతాల కింద 2600కోట్ల రూపాయలు చెల్లిస్తున్న ప్రభుత్వానికి మహావిపత్తులో చిక్కి విలవిల లాడుత్ను రైతన్నలను ఆదుకునేందుకు 600 కోట్లు లెక్కలోకే రాదంటున్నారు.

పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వంలో ఉన్న వెసులు బాటునంతా ఉపయో గించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా అధికారులకు గట్టిగానే ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యలోనే ధాన్యంలో తేమశాతం గ్రేడ్లతో నిమిత్తం లేకుండా రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అధికా రులకు సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోళ్ళ గ్రేడింగ్‌ను కూడా తొలగించేందుకు ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ప్రభుత్వం తీసుకునే చర్యలు ఆందోళనతో ఉన్న రైతుల్లో కొంతయినా ధైర్యం నింపుతాయన్న అభి ప్రాయంతో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన హెక్టారుకు 6వేల పెట్టుబడి రాయితీని కూడా 8వేలకు పెం చేందుకు కేంద్రాన్ని ఒప్పించే దిశగా చర్యలు తీసుకో వాలన్న నిర్ణయంతో ఉన్నారు.

No comments:

Post a Comment