వట్టి వసంత రాజీనామా, అర్ధరాత్రే సీఎంకు
వట్టి ఇంట్లో బొత్స, పొన్నాల, కన్నా, ధర్మాన మంతనాలు
దానం, ముఖేష్, శంకరరావు, కాసు, డొక్కా, దామోదర్‌ల్లోనూ అసంతృప్తి
చిల్లర శాఖలు మాకు... కీలక శాఖలు మీకా? ఇదెక్కడి న్యాయం?
తలో ముక్క పడేశారా? రగిలిన సీనియర్లు, ఇతర వర్గాలు
ఔను, దారుణంగా ఉంది.. అవసరమైతే రాజీనామా చేస్తా: బొత్స
రాష్ట్ర కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. కొలువుదీరీ తీరక ముందే కొత్త కేబినెట్‌లో కలహాల కుంపటి రగిలింది. 'సామాజిక' యుద్ధం మొదలైంది. శాఖలు కేటాయించిన కొన్ని గంటల్లోనే సచివుల్లో అసంతృప్తి భగ్గుమంది. 'ఇదేనా మాకిచ్చే ప్రాధాన్యం?' అంటూ కొందరు... 'కీలక శాఖలన్నీ మీ వర్గానికేనా?' అని మరికొందరు... 'మీకూ ఒక ముక్క అంటూ చిల్లర శాఖను పడేస్తారా?' అని ఇంకొందరు! దాదాపు అందరిలోనూ అదే అసంతృప్తి, అసమ్మతి! కొందరు లోలోపల రగిలిపోతుండగా... మరికొందరు ఇప్పటికే బయటపడ్డారు. సాయంత్రం చిన్నగా మొదలైన అసంతృప్తి... అర్ధరాత్రి సమయానికి ఆగ్రహజ్వాలగా మారింది.
బుధవారం రాత్రి బాగా పొద్దుపోయాక... కోస్తా ప్రాంతానికి చెందిన సీనియర్ నేతలు వట్టి వసంతకుమార్, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, బొత్స సత్యనారాయణతోపాటు తెలంగాణ ప్రాంత నేత పొన్నాల లక్ష్మయ్య... వట్టి నివాసంలో సమావేశమయ్యారు. "శాఖల కేటాయింపులో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ... బీసీలను, ఇతర వర్గాలను పట్టించుకోని కేబినెట్‌లో కొనసాగడం అవసరమా?'' అని తమను తాము ప్రశ్నించుకున్నారు. వీరంతా అక్కడి నుంచే సీఎంతో మాట్లాడారు. శాఖల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందని ఆయన చెప్పినట్లు తెలిసింది.
దీనిపై సీఎం స్పందన మాత్రం తెలియరాలేదు.అయితే.. తామంతా భేటీ అయిన మాట నిజమేనని, శాఖల కేటాయింపుపై అసంతృప్తిగా ఉన్నామని బొత్స స్పష్టం చేశారు. అవసరమైతే తామూ రాజీనామా చేస్తామని తేల్చిచెప్పారు. మరోవైపు... గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి పర్యాటకానికి మారిన వట్టి వసంతకుమార్ ఒక అడుగు ముందుకు వేసి అర్ధరాత్రి సమయంలో తన రాజీనామాను ముఖ్యమంత్రికి పంపించినట్లు తెలుస్తోంది. ఐటీ కోల్పోయి మౌలిక సదుపాయాలు దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా ఇచ్చేందుకు రెడీ అయ్యారు. భారీ నీటిపారుదల నుంచి ఐటీకి మారిన పొన్నాల లక్ష్మయ్య కూడా ఇదే యోచనలో ఉన్నారు.
ఒక ముఖ్యమంత్రి, 39 మంది మంత్రులు! మొత్తంగా నలభై మంది! చాలా ఏళ్ల తర్వాత రాష్ట్రంలో 'జంబో కేబినెట్' ఏర్పాటైంది. మంత్రులుగా ఎంపికైన వాళ్లకు బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నుంచి పిలుపులు వెళ్లాయి. అభినందనలు అందాయి. గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్‌లో 39 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సాయంత్రానికి... శాఖలూ ఖరారయ్యాయి. అంతే... అనేక మందికి షాక్‌లు తగిలాయి. ఉదయం పదవి దక్కిందన్న ఆనందం... సాయంత్రానికి ఆవిరయ్యింది. ప్రాధాన్యం తగ్గిందని కొందరు, చిల్లర శాఖలు కేటాయించారని మరికొందరు, ఇష్టంలేని శాఖలు కట్టబెట్టారని మరికొందరు... రగిలిపోవడం మొదలైంది.
మరీ ముఖ్యంగా... కీలక శాఖలన్నీ ఒకే వర్గానికి కట్టబెట్టారనే ఆగ్రహం భగ్గుమంది. కేబినెట్‌లోని బెర్తుల్లో సింహభాగం సొంతం చేసుకున్న వర్గానికే... కీలక శాఖలూ దక్కాయనే అసంతృప్తి రగిలింది. తమ వారికి మంచి శాఖలు ఇచ్చుకుని, ఇతరులకు చిల్లరమల్లర శాఖలు కేటాయించారనే అభిప్రాయం నెలకొంది. "మేం హోం మంత్రిగా పనికిరామా? ఆ బాధ్యతలు నిర్వహించలేమా? ఏం జరుగుతుందో వేచి చూడండి!'' అంటూ ఒక మంత్రి తీవ్రంగా వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న మంత్రుల్లో కొందరు నేరుగా ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిసి తమ అసంతృప్తి వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరిద్దరు ఇప్పటికే సీఎంకు ఫోన్ చేసి ఆగ్రహం వెళ్లగక్కినట్లు సమాచారం.
'నల్లగొండ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేని జానారెడ్డికి పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు. ఎంపీతో సహా అనేకమందిని గెలిపించిన నాకు చిల్లర శాఖలు అప్పగించారు. తెలంగాణలో పోర్టులు ఎక్కడున్నాయి? ఆ శాఖతో నేను ఏం చేసుకోవాలి? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రాజీనామా చేయాలనే యోచన కూడా ఉంది. కార్యకర్తలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటాను''
- కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మాకు ముక్కలేనా?
అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం కుదరనట్లే... అందరికీ మంచి శాఖలు కేటాయించడం కూడా కుదరదు! కానీ... ప్రాధాన్యాల మేళవింపులోనే సమతుల్యత లోపించిందని పలువురు మంత్రులు వాపోతున్నారు. వైఎస్ జగన్ వెంట వెళ్లే అవకాశమున్న రెడ్డి, ఎస్సీ వర్గాలకు పెద్ద పీట వేయడం, తద్వారా యువనేత ప్రాబల్యానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా శాఖల కూర్పు జరిగిందని చెబుతున్నారు. అయినప్పటికీ... ఈ 'లాజిక్'తో మంత్రులు సంతృప్తి చెందలేకపోతున్నారు. వైఎస్ హయాంలో ముక్కలైన శాఖలను మళ్లీ అతికించి ఒక్కరికే కట్టబెట్టడం... అప్పుడు ఒక్కటిగా ఉన్న శాఖలను ముక్కలు చేసి తలా ఒకటి పంచడంలో హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నారు.
"గతంలో మూడు ముక్కలుగా ఉన్న వైద్య, ఆరోగ్యాన్ని ఇప్పుడు ఒకటి చేసి డీఎల్ రవీంద్రా రెడ్డికి అప్పగించారు. అదే సమయంలో... అంతకుముందు కలిసి ఉన్న చిన్న శాఖలను ముక్కలు చేసి మాలాంటి వాళ్లకు పంచారు'' అని ఒక మంత్రి ఆగ్రహించారు. ఉదాహరణకు గతంలో వైద్య, ఆరోగ్యశాఖను మూడుగా విభజించి ముగ్గురు మంత్రులకు కేటాయించగా... ఇప్పుడు ఈ శాఖలన్నింటినీ డీఎల్ రవీంద్రారెడ్డికి అప్పగించారు. అదే సమయంలో... భూగర్భ గనులతో కలిసి ఉన్న చేనేత, జౌలిశాఖను తీసి శంకర్‌రావుకు అప్పగించారు.
నష్టాల్లో ఉన్న ఆప్కో మినహా ఈ శాఖలో మిగిలిందేమీ లేదు. పదవి ఇవ్వకుంటే నానా గందరగోళం చేస్తారనే ఉద్దేశంతో, ఇచ్చామంటే ఇచ్చామంటూ ఇలా 'ముక్కల శాఖలు' అప్పగించారని భావిస్తున్నారు. వివిధ సమీకరణాల రీత్యా మంత్రి పదవులు ఇవ్వక తప్పని వారికి ఆషామాషీ శాఖలతో సరిపుచ్చారని చెబుతున్నారు. దీనిపై శంకర్‌రావు గురువారమే మీడియా ముందుకో, నేరుగా సీఎం వద్దకో వెళ్లి తన అసంతృప్తి వెళ్లగక్కే అవకాశముందని చెబుతున్నారు. ఇక... గ్రామీణాభివృద్ధి శాఖదీ అదే పరిస్థితి. నిజానికి ఇది కీలక శాఖే. కానీ... ఇందులో అత్యంత కీలకమైన ఇందిరా క్రాంతిపథం, స్వయం సహాయ బృందాలను తప్పించి సునీతా లక్ష్మారెడ్డికి అప్పగించారు.
కేవలం గ్రామీణాభివృద్ధి శాఖ, ఉపాధి హామీని మాణిక్య వరప్రసాద్‌కు అప్పగించారు. కేంద్ర నిధులతో నడిచే ఉపాధి హామీ పథకం, కీలక విభాగాలు లేని గ్రామీణాభివృద్ధి శాఖతో మాణిక్యవరప్రసాద్ చేసేదేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. విద్యాశాఖ మంత్రిగా కీలక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్న మాణిక్య వరప్రసాద్‌కు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిందిపోయి...అసలుకే మోసం చేయడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్‌కు కార్మిక శాఖ, ముఖేశ్ గౌడ్‌కు మార్కెటింగ్ అప్పగించారు. 'రాష్ట్ర రాజధానికి చెందిన వీరికి కీలక శాఖలు అప్పగించకుంటే... నగరాభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది?' అంటూ ఒక మంత్రి ప్రశ్నించారు.
నిజానికి... ముఖేశ్ గౌడ్ తనకు మున్సిపల్ శాఖ వస్తుందని ఆశించారు. దానం కూడా ప్రాధాన్య శాఖపైనే ఆశలు పెట్టుకున్నారు. శాఖల వెల్లడి తర్వాత వీరిద్దరి అనుచరుల్లోనూ అసంతృప్తి మొదలైంది. మొత్తం మీద... అనుభవంలేని వారికి, గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారికే ప్రాధాన్య శాఖలు లభించాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇదేనా ప్రాధాన్యం?
గతంలోకంటే ఇప్పుడు తమ ప్రాధాన్యం పెరుగుతుందని భావించిన పలువురు సీనియర్లకూ శాఖల కేటాయింపులో షాక్ తగిలింది. పొన్నాల లక్ష్మయ్య మొత్తం కేబినెట్‌లోకే పెద్ద వయస్కుడు. తెలంగాణలో సీనియర్ నాయకుడు. కానీ... ఆయనకు 'భారీ' కుదుపు తప్పలేదు. దాదాపు ఆరున్నరేళ్లుగా ఆయన నిర్వహిస్తున్న భారీ నీటిపారుదల శాఖను తప్పించారు. ఐటీ శాఖ అప్పగించారు. కీలకమైన ఇరిగేషన్ శాఖను నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి ఇచ్చారు.
ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఒక నేత సిఫారసు మేరకే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. అంతగా సామర్థ్యం, చురుకుదనం లేదనే పేరున్న సుదర్శన్ రెడ్డికి ఇంత కీలక శాఖ దక్కడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి తర్వాత అంతటి కీలకమైన రెవెన్యూ మంత్రిగా చక్రం తిప్పిన ధర్మాన ప్రసాదరావుకు ఇప్పుడు రోడ్లు, భవనాలను అప్పగించారు. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న, ఉత్తరాంధ్రలో కీలక నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణను పంచాయతీరాజ్ నుంచి తప్పించి రవాణా శాఖ అప్పగించారు.
కన్నా లక్ష్మీ నారాయణ (గృహ నిర్మాణం) కూడా తన ప్రాధాన్యం తగ్గినట్లు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మానుగుంట మహీధర్ రెడ్డికి ఎలాంటి అనుభవం లేకపోయినా కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను కేటాయించడం విశేషం. ఇక... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడు కావడంవల్లే రఘువీరా రెడ్డికి వ్యవసాయం నుంచి 'రెవెన్యూ'కు ప్రమోషన్ లభించినట్లు చెబుతున్నారు. అనూహ్యంగా రగిలిన అసంతృప్తి సెగలను చల్లార్చేందుకు సీఎం కిరణ్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో శాఖల కేటాయింపుపై చర్చించుకుందామని ఆయన మంత్రులకు సర్దిచెబుతున్నట్లు తెలుస్తోంది.

‘రెడ్డి’ కార్పెట్
రాష్ట్రంలో మళ్లీ రెడ్డి రాజ్యం మొదలయింది. పధ్నాలుగు నెలల ముందు వరకూ వైఎస్ రాజ శేఖరరెడ్డి! ఇప్పుడు కిరణ్‌కుమార్ రెడ్డి!! మరి బీసీల గతి? ఏముంది మళ్లీ అధోగతే!!! బీసీలు ఓట్లకే పనికివస్తారు తప్ప, పదవులకు పనికి రారని కాంగ్రెస్ నాయ కత్వం తన చర్యలతో మళ్లీ రుజువు చేసింది. జనాభా దామాషా ప్రకారం దక్కవలసిన పదవులన్నీ రివర్సయిన వైనం కిరణ్ కుమార్‌రెడ్డి సారథ్యంలోని సర్కారులో మరోసారి దర్శన మిచ్చింది. 52 శాతం ఉన్న బీసీలకు వచ్చిన పదవులు పదయితే, జనాభాలో కేవలం 4 శాతమే ఉన్న రెడ్లకు మాత్రం దక్కిన పద వులు పచ్చగా పధ్నాలుగు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి వర్గానికి రెడ్‌కార్పెట్ వేసి, బీసీలను వెనక్కితోసి ముందుకు వెళ్లింది. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధికి ఇదో నిలువెత్తు నిద ర్శనం. కాంగ్రెస్ పార్టీ మరోసారి రెడ్డి సామాజికవర్గానికేపట్టం కట్టి, బీసీలను అణచివే యాలని నిర్ణయిం చుకున్నట్లు బుధ వారం నాటి మంత్రివర్గం స్పష్టం చే సింది. గతంలో 34 మంది ఉన్న మంత్రిమండలిలో 12 మంది రెడ్లకు స్థానం కల్పించగా, ఈసారి 40మంది ఉన్న మంత్రి మండలిలో 14 మందికి స్థానం దక్కడం చూస్తే ఆ వర్గం హవా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవు తోంది.అదేవిధంగా, గతంలో 11 మంది బీసీ లు న్నారు. కొండా సురేఖ రాజీనామా చేయగా ఆ సంఖ్య 10 మందికి పడింది. రెడ్ల మాదిరి గానే గతానికన్నా ఇప్పుడు బీసీల సంఖ్య పెంచే అవకాశం ఉన్నా ఆ పనిచేయలేదు. ఇప్పుడు 40 మంది మంత్రులున్నా అందులో బీసీల సంఖ్య పది మందే కావడం బట్టి, కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో బీసీల అవసరం లేదని చ ెప్పకనే చెప్పినట్టయింది. మంత్రివర్గంలో ఈసారి జనాభా దామాషా ప్రకారం ప దవులు ఇవ్వకపోతే ఆందోళన తప్పదని బీసీ సంఘాలు హెచ్చరించినప్పటికీ, కాంగ్రెస్ దానిని ఏ మాత్రం ఖాతరు చేసినట్లు కనిపించలేదు. చివరకు శాఖల కేటాయింపులో కూడా రెడ్లదే హవా. హోం, సమాచార, భారీ నీటిపారుదల, ఆ ర్థిక, పురపాలక, వ్యవసాయం, ఆరోగ్య, పంచాయతీరాజ్, న్యాయశాఖలు రెడ్డి వర్గానికే దక్కాయి. బీసీలకు ఎకై్సజ్, రెవిన్యూ, రవాణా, ఆర్ అండ్ బి శాఖలు మాత్రమే కీలకమైనవి దక్కాయి. రాయలసీమకు కీలక శాఖలు కేటాయించడం ద్వారా ముఖ్యమంత్రి తన ప్రాంతానికి న్యాయం చేశారు.
రాష్ట్ర రాజకీ యాల్లో ప్రభావితం చేసే పాత్ర పోషించే కమ్మ వర్గానికి దక్కింది ఒక్కటే. దీనిపై నా ఆ వ ర్గీయులు మండిపడుతున్నారు. తమను కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీగా చూ స్తోందని విరుచుకుపడుతున్నారు. తమ వర్గానికి ఎక్కువ శాఖలు ఇ వ్వాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన డిమాండ్‌ను ఎవరూ పట్టిం చుకోలేదని స్పష్టమయింది. కాంగ్రెస్ వైఖరి చూస్తే కమ్మ సామాజిక వర్గం ఓట్లు తమకు అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో ఎలాగూ తమ వర్గం టీడీపీ వైపు మొగ్గు పచూ పుతుందన్న ముందుచూపుతోనే తమను పక్కకు పెట్టారని మండిపడుతున్నారు. కాపులలో కూడా అసంతృప్తి రగులుతున్నది. కోస్తాలో కాపులు, ఉత్తరాంధ్రలో తూర్పు కాపు, తెలంగాణలో మున్నూరు కాపులను కలి పితే మొత్తం కాపులకు 5 పదవులు దక్కినట్లయింది.ే సంఖ్యాపరంగా 5 పదవు లు దక్కినప్పటికీ, ఏ ఒక్కటీ కీలక శాఖ కాకపోవడం కాపుల్లో అసంతృప్తి రాజేసింది.
మంత్రి మండలం
ఒక ముఖ్యమంత్రి, 39 మంది మంత్రులు! మొత్తంగా 40 మందితో కేబినెట్ ఏర్పాటైంది.
- మంత్రుల్లో 11 కొత్త ముఖాలే. వీరిలో ఏడుగురికి తొలిసారిగా మంత్రి పదవులు.
- తెలంగాణ (16)కు ప్రాధాన్యం పెరిగింది. గతంలోకంటే ఈసారి మూడు మంత్రి పదవులు పెరిగాయి.
- కోస్తా నుంచి 15 మంది, సీమ నుంచి 8 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
- సంఖ్యాపరంగా గుంటూరుదే అగ్రస్థా నం.ఈసారీ జిల్లాలో నలుగురికి చోటు.
- హైదరాబాద్, మెదక్, కడపలకు ప్రాధాన్యం. ఈ జిల్లాల నుంచి ముగ్గురేసి మంత్రులు.
- ఆదిలాబాద్‌కు మరోసారి రిక్తహస్తం.
- 39 మందిలో 13 మంది.. అంటే మూడోవంతు మంది రెడ్డి వర్గీయులే.
- కేబినెట్‌లో బీసీలు 10, ఎస్సీలు 6, ఎస్టీలు 2, కాపు వర్గానికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, క్షత్రియుల నుంచి ఒక్కొక్కరికి చాన్స్.
- జగన్ వర్గీయులైన బాలినేని, పిల్లి సుభాష్, శిల్పా మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డిలకు ఉద్వాసన.
- మహిళా మంత్రుల పదవులు పదిలం.
- ఒకరికి మంత్రిపదవి రావడం ఖాయమనుకున్నారు. కానీ.. రాలేదు. ఆయన.. జేసీ దివాకర్ రెడ్డి. ఇంకొకరిని తొలగిస్తారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ, తొలగించారు. ఆయన.. గాదె వెంకటరెడ్డి. ఇక.. ఒకరికి పదవి వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. వచ్చింది. ఆయన.. కాసు వెంకట కృష్ణా రెడ్డి.
- ఎమ్మెల్సీల్లో ఒకే ఒక్కరికి అవకాశం! అంతా ఊహించినట్లుగా వైఎస్ వివేకానందరెడ్డికి అందలం. అబ్బాయ్‌తో విభేదించి వచ్చిన బాబాయ్‌కి ఆయనకు ఇష్టమైన వ్యవసాయ శాఖను కేటాయించారు.

No comments:
Post a Comment