Friday, December 10, 2010

పారదర్శక పాలనకు ఊత మివ్వండీ... భాద్యతాయుతంగా నిధులు నిర్వర్తించా లి...సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే స్పందించాలి. * సీఎంఓ అధికారులకు సీఎం క్లాస్‌

Kiran-kumar-reddyపారదర్శక పాలనకు ఊత మివ్వండీ... భాద్యతాయుతంగా నిధులు నిర్వర్తించా లి...సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే స్పందించాలం టూ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంఓ అధి కారులకు క్లాస్‌ ఇచ్చారు. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వీ.ప్రసాద్‌ సిఎంవో అధికా రులతో ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికా రుల పనితీరుతోనే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలుగు తుందని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తన పేషీలో పనిచేస్తున్న అధికారులకు సూచించారు. పారదర్శకతతో, సమర్ధవంత పాలనకు పెద్దపీట వేసి ప్రజలకు చేరువయ్యే విధంగా సుపరిపాల నను అందించి, తద్వారా సంస్కరణలకు పెద్దపీట వేయాల ని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు నిరాఘాటంగా కొనసా గించాలని, ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేవిధంగా విధినిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.

సాధారణ ప్రజానీకం నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరిం చడానికి అధికప్రాధాన్యం ఇవ్వాలని, అందుకనుగుణంగా రానున్న రోజుల్లో ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ కాగలమన్నారు. ఇందుకు గతంలో కంటే భిన్నంగా ఓ ప్రత్యేక విధానాన్ని అమలులోకి తీసుకరావాల్సి ఉందని, అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ పధకాలు చేరినప్పుడే సార్ధకత చేకూరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలౌతున్న పలు పధకాలను సిఎం సమీక్షించారు. సిఎంవో అధికారులు పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు ఇందుకు ఆయా శాఖల ప్రత్యేకప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, విభాగా ధిపతులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కాగా గతంలో ముఖ్యమంత్రి కార్యాలయాల్లో నిర్వహించి న విధానాలను కాకుండా కొత్తవిధానాలను ప్రవేశపెట్టాల ని, తద్వారా అధికారుల విధులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహించే కార్యక్రమాలకు కొత్త విధి విధా నాలు అమలుచేయనున్నారు. ఇందులో కొన్ని ముఖ్యాశాంలు.

- సమయ పాలన
- సమావేశాల నిర్వహణ *సందర్శకుల ఫిర్యాదులు, సమస్యలు పరిష్కారం
-ప్రజలనుంచి వచ్చిన ఫిర్యా దులకు జవాబుదారీతనం

-ఫైళ్ళ నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా నిర్వహించే సమావేశాలు లేన ప్పుడు ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి చర్య లు తీసుకోవాలన్నారు. ఇందులో ప్రభుత్వం అమలు చేసు ్తన్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకూ వర్తిస్తాయి. ము ఖ్యంగా ముఖ్యమంత్రికి వచ్చే అభ్యర్ధనలు కేంద్ర ప్రభు త్వం పంపించే లేఖలు,.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, జిల్లా నాయకులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు ప్రజలు, ప్రతిపక్షాలు అందించే లేఖలను పరిశీ లించేందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలన్నా రు. అంతేకాకుండా వాటి పరిష్కారం దిశగా అధికారులు ఏమేరకు చర్యలు తీసుకున్నారో సంబంధిత వ్యక్తులకు జవాబు లేఖలు పంపాలన్నారు.

అంతా పారదర్శకంగా ఉండాలి....
ప్రజలకు నిత్యం అవసరమయ్యే పలు ప్రభుత్వ విభా గాలు అమలు చేస్తున్న సంక్షేమకార్యక్రమాలు ఇ-గవర్నెన్స్‌ విధానంలో ఉండాలని ఇందులో ప్రజా పంపిణీ వ్యవస్ధ, ఫించన్లు, రిజిస్ట్రేషన్‌, రవాణ, భూ రికార్డులు పొందుపర చాలని అధికారులను ఆదేశించారు. రానున్న జిల్లాస్ధాయి లో గ్రామాలకు సందర్శించాలని ముఖ్యమంత్రి యోచిస్తు న్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను అధికా రులు సిద్దంచేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు.

No comments:

Post a Comment