
రాజకీయాలకు ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ది పరుచుకోవా ల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని అర్జున్ గుట్ట వద్ద పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై..ప్రాణహిత నది పుష్కరాలను ప్రారంబించారు. అనంతరం ప్రాణహిత నది ఒడ్డున ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ది అంశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు పార్టీలకతీతంగా అందరు కృషి చేయాలన్నారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదాకై రాష్ట్రంలోని 42 మంది ఎంిపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని.. అందుకు తన సహకారం కూడ ఉంటుందన్నారు. ప్రాణహిత చేవేళ్లతో పాటు పోలవరాన్ని కూడ సాధించుకుందామని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చా రు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు రూ.38 వేల కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నామన్నారు. ఈప్రాజెక్టు కింద 16 లక్షల 60 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందని ఆదిలాబాద్ జిల్లాలో లక్ష 50 వేల హెక్టార్లకు సాగునీరు అందుతుందన్నారు.
జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నా రన్నారు. తెలంగాణలోనే ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటు వల్ల కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. వాటి పరిష్కరానికి తన వంతు సహకారంగా కృషి చేస్తానన్నారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రీమ్స్ కళాశాలను ప్రారంభించారని.. అక్కడ శిక్షణకేంద్రంతో పాటు ఎమ ర్జెన్సీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. జిల్లాలో అనేక ఖాళీలు ఉన్నందున వాటిని భర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అర్జుని గుట్ట వద్ద మందిర నిర్మాణా నిి, చెన్నూర్‌లో బతుకమ్మ వాగుకు వంతెన నిర్మాణానికి రోడ్ల అభివృద్దికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సర్వతోముఖా భివృద్దికి అందరు సహకారం అందించాలని కోరారు. గిరి జనులకు వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు 28 మంది వైద్యులను నియమించామన్నారు. మరో 40 మంది మెడికల్ ఆఫీసర్స్‌తో పాటు 125 మంది నర్సులను నియమిస్తామన్నారు.ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు.

సోమవారం ఉదయం 9.30 గంటలకు కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కరాలను పౌరసరఫరాల శాఖ మాత్యులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రారంభించారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులకు కనీసం మంచినీటి సౌకర్యం కల్పిం చలేని దుస్థితి నెలకొంది. భక్తులకు సరిపడ స్నానఘట్టాలు ఏర్పరచ లేకపోయారు. చలువ పందిళ్ళు సైతం అంతంత మాత్రం గానే ఉన్నాయి. కొద్ది మందికి మాత్రమే బస ఏర్పాట్లు లభ్య మవుతున్నాయి. వేలాది మంది చలిపులిని తట్టుకోవడం కష్ట మే. రోడ్డంతా దుమ్ము, ధూళి. అడుగుతీసి అడుగు వేయలేక పోతున్నారు. క్యూలైన్ వద్ద సైతం గందరగోళం నెలకొంది. భోజన వసతి సైతం కల్పించ లేకపోయారు.
Chitthasuddhi galigi chaesina punyambu
ReplyDeleteKonchamyna nadhiyu kodhuvagaadhu
Vitthanambu marrivrukshambhunaku nentha
Vishwadhaabiraama vinura vaema