Sunday, December 19, 2010

కిరణ్‌ను చుట్టుముడుతున్న సవాళ్లు

krianaa నూతన సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డికి రోజుకో సమస్య ఆయనను ఊపరి పీల్చుకోకుండా చుట్టుముడుతున్నాయి. ఒకవైపు జగన్‌ సెగ, మరోవైపు రైతు సమస్యలు, ప్రతిపక్షాలు నిరహార దీక్ష లకు తోడు.. డిసెంబర్‌ తొలిత క్యాబినేట్‌ కూర్పులోనే మంత్రి పదవుల పంపకంలో సమతూకం గాడి తప్ప డంతో... సీనియర్లు ఆయనపై భగ్గున మండిపడుతు న్నారు. పైకి అసంతృప్తి వ్యక్తం చేయనప్పటికీ.. లోలోపల మాత్రం తమకి జరిగిన అన్యాయం వారికి ఎంతమాత్రం మింగుడు పడడంలేదు. దీంతో వారు సీఎంకి అంటీ అంట నట్లు ఉంటున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రకృతి కూడా ఏమాత్రం కనికరించడంలేదు. తాము ఈ భారాన్ని ఇక భరించలేమని.. ఇప్పటికే పెద్ద సం ఖ్యలో రైతులు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. కొత్త సీఎం తమను ఆదుకోవాలని రైతులు ఎదురుచూస్తున్నారు.

సర్కార్‌ నిర్లక్ష్యంపై బాబు కన్నెర్ర
ఇటీవల సీఎం అసెంబ్లీలో తుపాన్‌ ప్రభాంతో దెబ్బతిన్న బాధిత రైతులను ఆదుకోవడానికి ప్రకటించిన ప్యాకేజీ కొంతమేరకు వారికి ఊరట కలిగించిందనే చెప్పుకోవాలి. మరోవైపు ప్రతిపక్షాలు ఈ సాయం మరింత పెంచాలని, ఇన్‌పుట్‌ సబ్సిడీ హెక్టారుకి రూ. 10 వేలకి పెంచాలని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రభుత్వం తీరును నిరసిస్తూ .. 17వ తేదీ నుంచి నిరవదిక నిరహాదీక్షను చేపట్టారు. ఆయన చేపట్టిన దీక్ష కూడా రెం డో రోజుకి చేరుకున్నది.

21 నుంచి సీన్‌లోకి జగన్‌...
మరోవైపు జగన్‌ త్వరలో ప్రకటించనున్న కొత్త పార్టీలోకి వెళ్లడానికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, మాజీలు తెరవెనుక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు జగన్‌కి మద్దుతు ప్రకటిస్తున్న విష యం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్య మంత్రి నూతన ఎమ్మెల్యేలతో విందు సమావేశాలను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు జగన్‌ కూడా రైతులకి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఎంత మాత్రం చాలదని, తక్షణం ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎకరానికి రూ. 5 వేలకి పెంచాలని ఆయన డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 21,22 తేదీల్లో నిరహారదీక్షలను చేపడుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర బాబు నిరహార దీక్ష నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు ఊపందుకున్నాయి. జగన్‌ కూడా అదే దారిపడితే.. ప్రభు త్వానికి మరిన్ని సమస్యలు తప్పవని రాజకీయ వర్గాలు బలంగా అభిప్రాయపడుతున్నాయి.

తాడోపేడో తేల్చుకుంటాం: ఉద్యోగ సంఘాలు
ఈ నెల 20 తేదీ నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు సర్కార్‌కి తుది గడువు ప్రకటించారు. తమ డిమాండ్లు అంగీకరించకపోతే.. 20 తేదీ నుంచే తమ నిరసన ప్రద ర్శనలను ప్రారంభిస్తామని, తొలిదశలో పెన్‌డౌన్‌.. ఆ తర్వాత దశల వారీగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. తాము ప్రభుత్వం ముందుంచిన.. 11 డిమాండ్లలో కొనై్న నా అంగీకరిస్తేనే.. 20 డెడ్‌లైన్‌ నుంచి తప్పుకుంటా మని, లేకపోతే.. సర్కార్‌తో తాడోపేడో తేల్చుకుంటామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు దేవాదాయ ఉద్యోగులతో పాటు. ఇతర పీఆర్సీ అమలుకు నోచుకోని శాఖలు కూడా తమకి కూడా 9వ పీఆర్సీని వర్తింప చేయాలని ప్రభు త్వంపై ఒత్తిడి చేస్తు న్నారు. కాగా ఉద్యోగసంఘాలు గతంలో ప్రకటించిన డెడ్‌లైన్‌ ఈ నెల 20తో ముగియనుంది.

No comments:

Post a Comment