Thursday, November 25, 2010

రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రమాణస్వీకారం

N.Kirankumarreddy

సోనియా, మన్మోహన్‌లకు సీఎం కృతజ్ఞతలు
తనపై విశ్వాసముంచి సీఎం పదవికి ఎంపిక చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ, సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌లకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ర్టప్రజలకు సేవ చేసేందుకు కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుంటానని చెప్పారు.
తెలంగాణపై కేంద్ర నిర్ణయమే నా నిర్ణయం : సీఎం
తెలంగాణ విషయంలో తన స్వంత నిర్ణయమేది ఉండదని, కేంద్రప్రభుత్వ నిర్ణయమే తన నిర్ణయమని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తాను చిత్తూరు జిల్లానుంచి ప్రాతినిథ్యం వహించినా పట్టి పెరిగింది హైదరాబాదులోనేనని, హైదరాబాదుతో తన అనుబంధం విడదీయలేనిదని, తాను పక్కా హైదరాబాదీనని కొత్త సీకం నిన్నరాత్రి మీడియాతో అన్న విషయం తెలిసిందే.

అందరి సహకారం తీసుకుంటా : కిరణ్‌కుమార్‌రెడ్డి
 రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన ప్రతి ఒక్క మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల సహకారం తీసుకుంటానని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకాన్ని అమలు చేయడానికి కృషి చేస్తానని అన్నారు. హైదరాబాద్‌ను పెట్టుబడులకు స్వర్గదామంగా మారుస్తానని సీఎం చెప్పారు.
సుపరిపాలనకే పెద్దపీ : సీఎం

సుపరిపాలనకే పెద్దపీట వేస్తాను... ప్రతిపక్షాలను కలుపుకుని పోతాను... రాష్ట్ర అభివృద్ధికి మీడియా సపోర్టు సహకరించాలి... అని కొత్త సీఎం కిరణ్‌కుమార్‌ అన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గురువారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలులో లీకేజీని (పక్కదారిపట్టడం) అరికట్టి లబ్దిదారులకు చేరే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడి హైదరాబాద్‌ను, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతానని సీఎం చెప్పారు. రాహుల్‌ ప్రధాని కావాలన్న వైఎస్‌ చివరి కోరికను తీర్చడానికి శాయశక్తిలా కృషి చేస్తానని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని అన్నారు. ప్రతిపక్షాలు సత్ప్రవర్తన కలిగి ఉంటేనే ప్రభుత్వం సజావుగా సాగి ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి సాధ్యమవుతుందని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

No comments:

Post a Comment