Thursday, November 25, 2010

కిరణ్‌కు కిరీటం

kriana
అనుకున్నదే జరిగింది. ఉత్కంఠ వీడింది. చిత్తూరు జిల్లాకు చెందిన యువనేత, స్పీకర్‌ కిరణ్‌కు మార్‌రెడ్డి రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కాంగ్రెస్‌లో శరవేగంగా జరిగిన పరిణామాలు చిట్టచివరకు కిరణ్‌కుమార్‌రెడ్డినే వరించాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి-కిరణ్‌ మధ్య సీఎం పదవిపై జరిగిన దోబూచులాటకు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెరదించారు. వాయల్పాడు, ఆ తర్వాత పీలేరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన వైఎస్‌ హయాంలో చీఫ్‌ విప్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ప్రణబ్‌ముఖర్జీ, గులాబ్‌నబీ ఆజాద్‌, మొయిలీ, ఆంటోనీ సమక్షంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో.. కొత్త ముఖ్యమంత్రి ఎంపికను పార్టీ అధినేత్రి సోనియాకు అప్పగిస్తూ తీర్మానించింది.

ఆ తర్వాత సీను లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌కు మారింది. అక్కడకు రాత్రి పదిన్నర తర్వాత కిరణ్‌ ప్రత్యక్ష మయ్యారు. దానితో ఆయన పేరు సీఎం పదవికి దాదాపు ఖాయమయింది. అప్పుడే అధినేత్రి ఫోన్‌ కోసం వేచిచూస్తున్న ప్రణఫ్‌కు సోనియా నుంచి ఫోన్‌ రానే వచ్చింది. కిరణ్‌ పేరు ఖరారు చేస్తూ ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మీడియాతో భేటీ అయిన ప్రణబ్‌.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌రెడ్డి పేరును అధినేత్రి సోనియాగాంధీ నిర్ణ యించినట్లు ప్రకటించారు. గురువారం కిరణ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. ఆ ప్రకారంగా ఆయన ఉదయం 12.05 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా.. రాష్ట్రంలో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాయకుడిగా కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆయనకు ప్రస్తుతం 50 సంవత్సరాలు. హైదరాబాద్‌లో పుట్టి, హైదరాబాద్‌లోనే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న కిరణ్‌ మంచి క్రికెటర్‌ కూడా.

చిత్తూరు జిల్లా నుంచి రెండో సీఎం
ఇదిలా ఉండగా... చిత్తూరు జిల్లా నుంచి రెండవ ముఖ్యమంత్రి. రాయలసీమ నుంచి 5వ సీఎంగా కిరణ్‌ కుమార్‌రెడ్డి రికార్డుకెక్కారు. చిత్తూరు జిల్లా నుంచి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. రాయలసీమ నుంచి అంతకుముందు.. నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇప్పుడు ఆ జాబితాలో కిరణ్‌కుమార్‌రెడ్డి చేరారు.

కొత్త సీఎం+ ఐదుగురు నేడు ప్రమాణం !
నేడు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయనున్న కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత వారం రోజుల్లోగా మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అంటున్నారు.
పేరు :  నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
 తల్లి :  నల్లారి సరోజమ్మ
 తండ్రి :  నల్లారి అమరనాధరెడ్డి(మాజీ మంత్రి)
 పుట్టిన తేది: 13-సెప్టెంబర్‌-1960
 స్వస్థలం : నగిరిపల్లి,కలికిరి మండలం,చిత్తూరు జిల్లా
 చదువు : బికాం,ఎల్‌ఎల్‌బి.
 క్రీడలు :క్రికెట్‌ క్రీడాకారుడుగా మాజీ భారత జట్టు కెఫ్టెన్‌అజారుద్దీన్‌తో కలసి రంజీ జట్టులో ఆడారు.

చేపట్టిన పదవులు:
  • మొదటగా 1979లో నిజాం కళాశాల యూనియన్‌ నాయకుడిగా అప్పటి కేంద్ర మంత్రి శివశంకర్‌ కుమారుడు సుధీర్‌పై గెలుపొందారు.
  • మొదటి సారి ఎమ్మెల్యేగా 1989లో చింతల రామచంద్రారెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు.
  • రెండవ సారి 1994లో జరిగిన ఎన్నికలలో మళ్ళీ చింతల రామచంద్రారెడ్డిపై ఓటమి చవిచూశారు.
  • తిరిగి 1999లో చింతల రామచంద్రారెడ్డిపై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలు పొందారు.
  • 2004 ఎన్నికలలో టిడిపి అభ్యర్థి ఇంతియాజ్‌ అహ్మద్‌పై గెలుపొందారు. అనంతరం చీఫ్‌విప్‌గా నియమితులయ్యారు.
  • 2009 సార్వత్రిక ఎన్నికలలో టిడిపి అభ్యర్థి ఇంతియాజ్‌ అహ్మద్‌,పిఆర్‌పి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిలపై గెలుపొందారు. 2009 నుండి స్పీకర్‌గా సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారు.
  • సమస్యల తోరణం రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్ట బోతున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి పదవీ ముళ్లకిరీటమేనని రాజకీయ పరిశీలకు లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడు తున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్న ఆయన పాలనాదక్షతకు పరీక్ష. సీఎం గా బాధ్యతలు చేపడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి సమస్యల తోరణం స్వాగతం పలక నుంది. రాష్ట్ర విభజనకు ఆందోళనలు ఓ పక్క మరో పక్క ఉద్యోగుల సమస్యలు పరి ష్కరించేందుకు సమ్మెబాట పట్టిన నేపథ్యంలో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరిం చటం ఆయనకు ముళ్లబాటే. రాష్ట్ర విభజనకు జరుగుతున్న ఉదృత పోరుతో పాటు ప్రాంతాల మధ్య రోజురోజుకు పెరుగుతున్న అంతరాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన కొనసాగించాల్సి ఉంది. సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు పట్టిన సమ్మెబాట, కోస్తాంధ్రలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు, వాయిదా పడ్డ ఎస్‌.ఐ రాత పరీ క్షలు నిర్వహించటం తదితరాలు ఆయనకు స్వాగతం పలుకనున్నాయి. రాష్ట్ర ప్రభు త్వ ఆర్థిక పరిస్థితిని పరిపుష్టిచేయాల్సి ఉంది. హైదరాబాద్‌ ఫ్రీ జోన్‌ అంశం తేల్చడం ఆయనకు గుదిబండ కానుంది. నత్తనడకగా నడుస్తున్న అనేక ఆర్థికపరమైన సంక్షే మ పథకాలను తిరిగి గాడిన పడేయడం ఆయన రాజకీయ జీవితానికి పరీక్షగా మా రనుంది. ఇవన్నీ ఒకేత్తయితే ఆయన మంత్రివర్గంలో సభ్యుల ఎంపిక మరో ఎత్తు.

No comments:

Post a Comment