Saturday, November 27, 2010

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్రంలో ప్రధానంగా .... పది సమస్యలు

Kiran-kumar-red
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన, కాంగ్రెస్‌ పార్టీకి గుండెకాయ వంటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పనిచేయడం నిస్సందేహంగా అద్భుతం. అది ఒక కోణం. మరో కోణంలో సమస్యల కొలిమితో కాలుతున్న రాష్ట్రానికి ఈ క్లిష్ట పరిస్థితిలో పగ్గాలు అందుకోవడం మాత్రం కత్తిమీద సాము వ్యవహారమే. వాటిని ఎదుర్కొనేందుకు కిరణ్‌కు ఉన్న అనుభవం ఎంతమేరకు ఉపకరిస్తుందన్న అంశం చర్చనీయాంశమయింది.

ప్రధానంగా.. రాష్ట్రంలో గత కొద్దిరోజుల నుంచి వివిధ వర్గాలు చేస్తున్న ఉద్యమాలు, ఆందోళనలు కాంగ్రెస్‌ ప్రభుత్వా నికి చెమటలు పట్టిస్తున్నాయి. రోశయ్యను వెన్నాడిన ఆ సమస్యలే ఇప్పుడు కిరణ్‌కూ వారసత్వంలా కొనసాగుతు న్నాయి. గతంలో ఏ ప్రభుత్వం ఎదుర్కోని విధంగా అన్ని సమ స్యలూ ఒకదానిపై మరొకటి వచ్చి పడుతుండటంతో కాంగ్రెస్‌ సర్కారు ఉక్కిరిబిక్కిరి బిక్కిరవుతోంది. వివిధ వర్గాలు చేస్తున్న డిమాండ్లలో చాలావరకూ ఆర్థికపరమైన అంశాలే ఉండటంతో క్యాబినెట్‌ సబ్‌ కమిటీలు వేసి చేతులు దులుపేసుకుంటు న్నారు. వాటి నివేదికలు అమలు చేయాలంటే నిధుల సమస్య. ఇవి కాకుండా పావలావడ్డీ, అభయహస్తం పథకాలకు నిధులు కేటాయింపులో నత్తనడక వంటి అంశాలు సర్కారును పీడించే పెను సమస్యలే. మొన్న రోశయ్య, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి.. ముఖ్యమంత్రి మారినా సమస్యలు అవే.

ప్రధానంగా.. పది సమస్యలు కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారును వెన్నాడుతున్నాయి. వాటిని పరిష్కరించడంలోనే ఆయన సామర్థ్యం ఏమిటన్నది తేలుతుంది. వాటి పరిష్కారానికి సీఎం అనుసరించబోయే విధానం, వ్యవహారశైలి, సత్వర నిర్ణయాలు కూడా దోహదం కానున్నాయి. ముఖ్యంగా.. రోశయ్య వంటి ఆర్థికవేత్త, రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌కే సాధ్యం కాని ఈ సమస్యలను గతంలో మంత్రి పదవి కూడా చేపట్టిన అనుభవం లేని కిరణ్‌కుమార్‌ ఏ విధంగా పరిష్కరిస్తారన్నదే ఇప్పుడుఅందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.

తెలంగాణ...ప్రధానం

Jai-Telanganaఇక అన్నింటికన్నా కిరణ్‌ను ఇబ్బందిపెట్టే ప్రధాన అంశం తెలంగాణ సమస్య. రాష్ట్ర ఏర్పా టును డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే టీఆర్‌ఎస్‌ సహా, తెలంగాణ విద్యార్థి, ఉద్యోగ, జేఏసీలు ఉద్యమం చేస్తున్నాయి. ఒకవేళ టీఆర్‌ఎస్‌ను బుజ్జగించడం ద్వారా ఉద్యమం ఆగుతుందని భావించినా ఇప్పుడు ఉద్యమం టీఆర్‌ఎస్‌ చేతిలో లేదు. విద్యార్థులపై కేసుల తొలగింపు మరో సమస్య. మొన్నటి వరకూ స్పీకర్‌గా ఉన్నందున ఏ అంశంపై మాట్లాడకపోయినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఇప్పుడు సీఎంగా తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యపైనా తప్పనిసరిగా స్పందించ వలసి ఉంటుంది. ఆ అంశంపై ప్రత్యర్థులు చే సే విమర్శలకూ స్పందించవలసి ఉంటుంది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణలో నెలకొనే పరిస్థితిని నియంత్రించడంపైనే ఆయన భవితవ్యం ఆధారపడి ఉంది.

సంక్షేమం విస్మరిస్తే సమస్యలే
Ramoorthi-Presidentబడుగు బలహీన వర్గాలకు చెందిన సమస్యలు విస్మరిస్తే కిర ణ్‌ సర్కారుకు చిక్కులు తప్పవు. ప్రధానంగా.. ఫీజుల రీఇంబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిల విడుదలలో చేస్తున్న జాప్యం బడుగులకు ఆగ్రహం కలిగిస్తోం ది. ప్రధానంగా.. వాటికి సంబంధించి ఈనెలలో 800 కోట్లు, వచ్చే నెలలో 1000 కోట్లు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విడుదల చేయవలసి ఉంది.లబ్థిదారులైన విద్యార్థుల సంఖ్యను కుదించడం ద్వారా సర్కారు తన ఖజానాపై పడుతున్న భారాన్ని వదిలించుకోవా లన్న వ్యూహంతో ఉన్న విషయాన్ని బీసీలు గ్రహించారు. అందుకే దానికి నిరసనగా ఉద్యమాలు చేస్తు న్నారు. రాష్ట్రంలో 65 శాతం ఉన్న బీసీలకు వ్యతిరేకమైన నిర్ణ యాలు తీసుకుంటే ప్రభుత్వ మనుగడ కష్టమే.

ఉద్యోగుల ఉగ్రరూపం
corwdకాంగ్రెస్‌ సర్కారు ఉద్యోగులు తొలిసారిగా పిడికిలి బిగించారు. తమకు సంబంధించిన నియ మించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నివేదికలు ఆర్థిక శాఖలో సుఖ నిద్ర పోతుండటం వారిని ఆగ్రహానికి గురిచేస్తోంది. 7 లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 5 లక్షల మంది పెన్షనర్లు ఉద్యమ బాటలో ఉన్నారు. ఇటీవలే సమ్మె కూడా చేశారు. ఇంటఇద్దె భత్యం పెంపు, ప్రత్యేక ట్రస్టు ద్వారా ఆరోగ్య బీమా వంటి 11 ప్రధాన డిమాండ్లతో సర్కారుపై సమరం ప్రకటించారు. టీడీపీ సర్కారును కూల్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురా వడంలో కీలకపాత్ర పోషించిన అదే ఉద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పిడికిలి బిగించడం కొత్త ముఖ్య మంత్రికి ఆందోళన కలిగించే అంశమే.

‘పారా’ హుషార్‌
ladies8,342 మంది పారా మెడి కల్‌ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ వాటర్‌ట్యాంకు, భవనంపై కెక్కి కిరోసిన్‌ బాటి ళ్లతో ఆందోళన నిర్వహిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖామంత్రిగా పనిచేసిన దానం నాగేందర్‌ స్వయంగా వచ్చి వారిని బుజ్జగించి వారం లోగా మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చి నేటితో వారం అయింది. ఈలోగా హామీ ఇచ్చిన దానం నాగేందర్‌ పదవే పోయింది. సీఎం కూడా మారిపోయారు. 8 నెలల నుంచి జీతాలు చెల్లించాలని, 8 ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమను క్రమబద్దీకరించాలంటూ హెల్త్‌ అసిస్టెంటులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఏఎన్‌ఏఎంలు రోడ్డెక్కారు.

సర్కారుకు బీడీ పొగ
bidiరాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 8 లక్షల మంది బీడీ కార్మి కులు ఉద్యమబాటలో ఉధృతం గా పయనిస్తున్నారు. ఎన్నిసార్లు చర్చలు జరిగినా యాజమాన్యా లకు, వారికి అవగాహన కుదరడం లేదు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో ఆసక్తి చూపించడం లేదు. వెయ్యి బీడీలు చుడితే ఇప్పుడు ఇస్తున్న జీతాన్ని 120 రూపాలయకు ఇవ్వాలని, ప్యా కర్ల జీతాలు పెంచాలంటూ ఉద్యమిస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యం వల్ల ఈ వర్గానికి చెందిన దాదాపు 17 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్‌కు దూరమవుతున్నట్టుగానే భావించక తప్పదు.

బెత్తం పట్టిన కాబోయే టీచర్లు
nirasanకామన్‌మెరిట్‌ ప్రకారం ఎంపి కయిన తమకు టీచర్‌ పోస్టులు ఇవ్వాలంటూ బీఎడ్‌ నిరుద్యోగు లు రోడ్డెక్కారు. పోస్టింగుల విష యంలో తమకు అన్యాయం జరు గుతోందంటూ డీఎస్సీ అభ్యర్థులు రెండు రోజుల పాటు బిల్డిం గుపైనే ఉండిపోయారు. అప్పటి మంత్రి మాణిక్యవరప్రసాద్‌ వచ్చి, వారిని బుజ్జగించినా ఇప్పటిదాకా ఫలితం సున్నా.

104 డేంజర్‌ సిగ్నల్స్‌
104aవైఎస్‌కు వ్యక్తిగతంగా, కాంగ్రె స్‌కు కొత్త ఓటు బ్యాంకుగా మా రిన 104లో పనిచేసే సిబ్బంది కూడా ఆందోళన బాట పట్టారు. వారంతా ఈనెల 10 నుంచి ఆందోళన బాటలో ఉన్నారు. ఫలితంగా.. 2.72 లక్షల మంది గ్రామీణులకు వైద్య సేవలు నిలిచిపోయాయి. ఏటా 8 శాతం వేతనాలు పెంచాలని, ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, ఇఎస్‌ఐ, పీఎఫ్‌, సౌకర్యం కల్పించాలన్న వారి డిమాండును అటు యాజమన్యాలు గానీ, ఇటు సర్కారు గానీ తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తాయి.

ప్రాణ సంకటంలా ‘14ఎఫ్‌’
tsహైదరాబాద్‌ ఫ్రీజోన్‌కు సంబం ధించిన 14 ఎఫ్‌ నిబంధన కొత్త సీఎంకు అగ్నిపరీక్ష. శాసనసభలో 9 నెలల క్రితమే ఈ నిబంధన తొలగించాలని తీర్మానించినా ఇప్పటివరకూ దానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి సాధించకపోవడంతో ఆ ప్రభావం ఎసై్స ఉద్యోగాలపై పడి, అది కాస్తా ఉప్పెనలా మారి ఉద్యమరూపం దాల్చింది. ఫలితంగా ఎసై్స రాత పరీక్షను వాయిదా వేయవలసి వచ్చింది. ఇది కొత్త సీఎంకు సవాలే.

మళ్లీ సర్కార్‌పై ‘దండోరా’
mandakrishnamadigaరాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన ఏబీసీడీ వర్గీకరణకు పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించా లంటూ మాదిగలు మరోసారి సర్కారుపై సమరం ప్రకటించా రు. తమ డిమాండ్‌ను వినిపించేందుకు డిసెంబర్‌ 4న యుద్ధభేరి మోగించనున్నారు. ఇప్పటికే వివిధ తీర్మానాలు కేంద్రంలో పెండింగ్‌లొ ఉన్న విషయం తెలిసిందే.

సర్కార్‌పై పోల‘రణం’
Polavaram
కిరణ్‌ సర్కారుకు పోలవరం ప్రాజెక్టు సాధన రాజకీయంగా, ప్రభుత్వ పరంగా కత్తిమీద సా ము. జాతీయ ప్రాజెక్టు హోదాతో పాటు, ప్రస్తుతం ఉన్న అవరోధా లు తొలగించడం పెను సవాలు. ప్రాణహిత-చేవెళ్లకు అను మతి సాధించకుండా ఒక్క పోలవరం ప్రాజెక్టు వైపే మొగ్గు చూపితే అటు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల నుంచి వ్యతిరే కత ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పటికే వారంతా పోలవరానికి వ్యతిరేకంగా చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రోశయ్య ఆయన స్థాయిలో బాగానే కృషి చేశారు. కిరణ్‌ ఈ వ్యవహారంలో కేంద్రంపై పోరాడవలసి ఉంటుంది. అదే సమయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతల ఒత్తిళ్లను కూడా ఎదుర్కోక తప్పదు. ఒకపక్క పోలవరం కోసం పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి తరచూ ప్రధానిని కలుస్తున్నందున, ఆ క్రెడిట్‌ వారికి దక్కకుండా, పార్టీ ఖాతాలో కలవడమూ ప్రధానమే.

No comments:

Post a Comment