Friday, November 26, 2010

పారదర్శకంగా పాలిస్తా.. ! రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీడియా సపోర్ట్‌ కచ్చితంగా ఉండాలి.

 
పథకాల అమలులో లోటుపాట్లు సవరిస్తూ, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తానని నూతన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. దివంగత వైఎస్‌ఆర్‌, కె.రోశయ్య ప్రభుత్వాల హయాంలో ప్రారంభించి అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు. నూతన ముఖ్యమంత్రిగా గురువారం ప్రమా ణ స్వీకారం చేసిన తర్వాత సాయంత్రం శాసనసభ కమిటీ హాల్‌లో కిరణ్‌కుమార్‌ రెడ్డి తొలిసారి పత్రికలు, మీడియా సమావేశంలో మాట్లాడారు.
K.Nagaraju-Mayor

సమావేశం వివరాలు ఆయన మాటల్లోనే...
‘గుడీ వినింగ్‌...ఫస్ట్‌ రిక్వెస్ట్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీడియా సపోర్ట్‌ కచ్చితంగా ఉండాలి. నిన్న స్పీకర్‌గా ఇక్కడే మీడియా సమావేశం పెట్టుకు న్నాం...ఇక్కడినుంచే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్దేశించి మాట్లాడేందుకు అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానం, సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కృతజ్ఞతలు...దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రణబ్‌ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్‌, వీరప్ప మొయిలీ, ఎ.కె.ఆంటోనీకి ధన్య వాదాలు...మొట్టమొదట ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి నేను చెప్పేదేమిటంటే... అన్ని సంక్షేమ కార్యక్రమాలు...కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పెట్టిన, వైఎస్‌ఆర్‌, కె .రోశయ్య మొదలు పెట్టిన పథకాలు కొనసాగేందుకు కృషి చేస్తా...దీంట్లో టాప్‌ ప్రయారిటీ గవర్నెన్స్‌ (పాలన)... కొత్త సిస్టమ్స్‌ పెట్టి ఎవరికి చెందాలో వారికి లీకేజెస్‌ (లోపాలు) లేకుండా పారదర్శకంగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం...

family
ప్రజలకు సంబంధించిన 10-12 ప్రధాన విషయాలను ఎన్ను కొని...పౌర సరఫరాలు...స్కాలర్‌షిప్‌లు...ఉపాధి హామీ లాంటివి కార్యక్రమా లను ప్రధానంగా ఎంచుకుంటాం...రెవెన్యూ ఆఫీసు సర్టిఫికెట్లు పారదర్శకంగా ఉండేలా ప్రతి మూడు మాసాలకు టార్గెట్లు పెట్టి, పూర్తి అవుతున్నాయా లేదా మానిటర్‌ చేస్తాం...ఎవరికి అర్హత ఉందో వారికి చెందాల్సిన అవసరం కచ్చి తంగా ఉంది...మొదలు పెట్టిన కార్యక్రమాలు...జలయజ్ఞం, పారిశ్రామికీకరణ వేగవంతంగా పూర్తి చేసేదానికి ప్రయత్నిస్తా...అన్నిటికన్న ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ డెస్టినేషన్‌ (పెట్టుబడులకు అనుకూల గమ్యం)గా, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా...లా అండ్‌ ఆర్డర్‌లో పీస్‌ఫుల్‌గా ఉంచే ప్రయత్నాలు చేస్తా...వైద్యం, ఆరోగ్యం, విద్య, సంక్షేమ కార్యక్రమాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, మహిళలకు లోపాలు లేకుండా సక్రమంగా చేసే విధంగా ప్రతి మూడు మాసాలకు పర్యవేక్షిస్తాం...

ఇది కాక ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానిక సంస్థల సహకారం తీసుకొని, అన్ని కార్యక్రమాలలో అందరినీ కలుపుకొని పని చేస్తా...రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యంగా ప్రతిపక్షం అందరినీ కలుపుకొని పోయేదానికి, రాష్ట్రానికి సంబంధించినంత వరకు వారి సహకారం అందించాలని నాతో మాట్లాడిన వారితో రిక్వెస్ట్‌ చేశా... ఇవేకాకండా వైఎస్‌ఆర్‌...ఒక ప్రధానమైన కోరిక...చనిపోవడానికి మూడు, నాలుగు రోజుల ముందు చివరి రాజకీయ కోరిక...2014 ఎన్నికల్లో 41 లోక్‌సభ సీట్లు గెలిచి రాహుల్‌ గాంధీ ప్రధానిగా చూడాలన్న కోరిక నెరవేర్చటానికి పూర్తి ప్రయత్నం చేస్తా..

ఇవీ ప్రశ్నలు... జవాబులు...
లోపాలను సవరిస్తామన్నారు...ఆరున్నర సంవత్సరాల పాలనలో లోపాలు అప్పటినుంచే ఉన్నాయా?
ఎవరికైతే స్కీమ్‌ పెట్టామో వారికి చెందాలి...ఇప్పుడూ లొసుగులు న్నాయి...కొత్త విధానాలను అభివృద్ధి చేసి పారదర్శకంగా పని చేస్తాం...
ఆరోగ్యశ్రీ పేషెంట్‌ను చూడటం ద్వారా మీ ప్రభుత్వానికి పేటెంట్‌ హక్కులు పొందాలనుకుంటున్నారా?
నేను మొట్టమొదట ప్రాధాన్యం ఇచ్చాను. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం చక్కగా ఉండాలన్నది లక్ష్యం...వైఎస్‌ పెట్టారు కాబట్టి పక్కకు తోయటం కాదు...ఆరోగ్యం ప్రాధాన్యం అని చెప్పటానికే వెళ్ళా...డబ్బు లేక... వైద్యం లేక...చనిపోకూడదనే ఆరోగ్యాన్ని ప్రజలకు ఇంకా మెరుగ్గా అందించే లక్ష్యం...అన్నిటిలోనూ లోపాలు వెదకవద్దు...(డోంట్‌ సీ ది నెగెటివ్‌ పార్ట్‌ ఆఫ్‌ ఇట్‌)...
కేబినెట్‌ కూర్పు ఎలా ఉంటుంది?
కేబినెట్‌ విషయంలో అధిష్ఠానంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం...
రాహుల్‌ను ప్రధానిగా చేయటంతో పాటు తెలుగుదేశాన్ని ఫినిష్‌ చేయాలన్నది సైతం వైఎస్‌ చివరి కోరికగా చెబుతారు?
మాకు ఎవర్నీ ఫినిష్‌ చేసే రాజకీయాలు అక్కర్లేదు...ప్రతిపక్షం బాగుంటేనే రాజకీయాలు బాగుంటాయి.
జగన్‌ వర్గాన్ని కలుపుకుపోతారా?
అందరినీ కలుపుకుపోతా...సామాన్యుల్లో అభద్రతా భావం ఉంది...
అందుకే మొదట్లోనే చెప్పా...హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ మొత్తం దేశంలోనే అనుకూలమైన గమ్యాలుగా చేస్తానని...శాంతి భద్రతల విషయంలో నా హయాంలో కఠినంగా ఉండటం జరుగుతుంది. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఉంటుంది...
ఇప్పటిదాకా ఎంతమంది ఎమ్మెల్యేలు కలిశారు?
నన్ను కలిసిన వారిలో 99 శాతం మంది శాసనసభ్యులు ఉన్నారు...నా పని తీరే అన్నిటికీ జవాబు...శాంతి భద్రతల సమస్య విషయంలో రాజ్యాంగ హక్కులకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడితే కఠినంగా, కచ్చితంగా వ్యవహరిస్తాం...
ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక రానున్నది...దానిపై స్పందన...
నివేదిక వచ్చిన తర్వాత కదా మాట్లాడాల్సింది...
తొమ్మిది గంటల విద్యుత్‌ ఇస్తారా?
ప్రమాణ స్వీకారం చేసి ఐదారు గంటలే అయింది...
తెలంగాణపై మీ వైఖరి ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఏమి ఆదేశిస్తే అదే అమలు...
అనేక సంఘాలు సమ్మెలు చేస్తున్నాయి...సమస్యలన్నిటికీ చర్చల ద్వారానే పరిష్కారం...వీలు చూసుకుని చేస్తా.. కేబినెట్‌ రావాలి... అన్నీ చూసుకోవాలి...
కేబినెట్‌లో ఎంతమంది ఉండొచ్చు?
మీకు త్వరలోనే తెలుస్తుంది...నేను అందరితోనూ ఇబ్బంది లేకుండానే ఉన్నాను....
మావోయిస్టులపై మీ విధానం ఎలా ఉంటుంది?
మావోయిస్టులు మన రాష్ట్రంలో మాత్రమే లేరు...13, 14 రాష్ట్రాలలో ఉన్నారు...వారికి సంబంధించి ఇప్పటి విధానమే కొనసాగుతుంది.
మీపై భూమికి సంబంధించిన ఆరోపణ ఉంది?
ఆరోపణ ఏమీ లేదు...శ్రీ వెంకటేశ్వర హౌసింగ్‌ సొసైటీ వారు ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే విక్రయిస్తే ఒప్పందం మేరకే కొన్నాను...నాతో పాటు చాలా మందికొన్నారు. అయితే ఒక పత్రిక నాపై కథనాలు రాసింది...దీనితో స్థలాన్ని వెనక్కు ఇచ్చి డబ్బు తీసేసుకున్నా...పోలవరం జాతీయ ప్రాజెక్టు విషయం... పోలవరం, చేవెళ్ళ-ప్రాణహిత రెండింటికీ ప్రయత్నిస్తాం...
జగన్‌ పార్టీ ధిక్కారం వ్యవహారంపై స్పందన?
అది పార్టీకి సంబంధించినది...నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని... క్రమశిక్షణ వ్యవహారం పార్టీ చూసుకుంటుంది...ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు... సహకారం ఇవ్వాలని కోరాను... ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళేదీ మీకు చెప్పే వెళ్తా... థాంక్యూ...

1 comment: