Sunday, November 28, 2010

ఆశా ‘కిరణ ’మవుతారా ?

  cm-raise
ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రాణిస్తారా? ఇప్పుడున్న అనేక రకాల ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకునే సత్తా ఆయనకు ఉందా? మొన్నటి వరకూ సాధారణ ప్రజ లకు దూరంగా ఉన్న కిరణ్‌ ఇప్పుడు జనంతో మమే కం కాగలరా? జమిందారీ కుటుంబం నుంచి వచ్చి న ఆయన సామాన్యుల సమస్యలను పరిష్క రించగలరా? మొదటి నుంచి మీడియాకు దూరం గా ఉండే కిరణ్‌.. మీడియా ప్రాధాన్యం పెరిగిన ఈ నేపథ్యంలో ఆ మేరకు వ్యవహరించగలరా?

ప్రధా నంగా.. వైఎస్‌ మాదిరిగా బలమైన ప్రధాన ప్రతి పక్షం తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు, ఆ విషయంలో పార్టీ లోని ఇతరుల సహకారం ఆయనకు అందుతుందా?పార్టీనీ-ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించే ఆశా ‘కిరణ’మవు తారా?.. ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు అన్ని వర్గాల్లో వినిపిస్తున్నాయి.

jai-krianఈ రాష్ట్రానికి 16వ ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నల్లారి వ్యక్తిగత వ్యవహార శైలి, ఇప్పటివరకూ ప్రజలతో ఆయన అనుసరించిన విధానం, ప్రాంత నేపథ్యం వంటి అంశాలు పరిశీలిస్తే.. భవిష్యత్తులో ఆయన తన ముందున్న సమస్యలు, ఇంతకుముందు ఉన్న సీఎంలు ఎదుర్కొన్న మాదిరిగానే కొనసాగుతున్న మరికొన్ని సమస్యలను పరిష్కరించి, అధిగమించగ లరా అన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలయింది. మొదటి నుంచి జమీందారీ కుటుంబమయిన కిరణ్‌కుమార్‌రెడ్డికి నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రజలతో పెద్దగా సంబంధాలు లేవు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, స్పీకర్‌గా ఉన్నా సోదరుడు కిషన్‌కుమార్‌రెడ్డి అంతా చక్కదిద్దుతున్నారు. సాధారణ ప్రజలతో కిరణ్‌ మమేకమయిన సందర్భాలు గానీ, వారితో కలసిపోయే సందర్భాలు గానీ తక్కువన్నది నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. ఒక్కముక్కలో చెప్పాలంటే.. ప్రజలతో ఆయనకు పెద్దగా సంబంధ బాంధవ్యాలు లేవన్నది ఆ జిల్లా, నియోజకవర్గ వాసుల అభిప్రాయం.

kiraaఅయితే, తన అభిప్రాయాలు ముక్కుసూటిగా వ్యక్తం చేసే కిరణ్‌పై అవినీతి ఆరోపణలు లేవు. సిఫారసు లేఖలు ఇచ్చే అలవాటు కూడా లేదు. పని అయితే అవుతుందని, లేకపోతే కాదని ఖరాఖండీగా చెప్పే మనస్తత్వం ఆయనది. తన వద్దకు పనుల కోసం వచ్చిన వారి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు నేరుగా ఫోన్లు చేస్తుంటారు. నేరుగా ప్రజలను కలిసే అలవాటు పెద్దగా లేని కిరణ్‌.. ఇప్పటివరకూ తన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కార బాధ్యతను మండలాలు, గ్రామాల్లో ఉన్న తన ప్రధాన అనుచరులకే అప్పగిస్తూ వస్తున్నారు. అంటే ప్రజలు తమ సమస్యలు వారికి చెప్పుకుంటే, సదరు నేతలు కిరణ్‌కు చెప్పి వాటిని పరిష్కరిస్తుంటారన్న మాట! అంతే తప్ప ఇంటివద్దకు వచ్చిన ప్రజలతో మాట్లాడే అలవాటు పెద్దగా లేదు.

ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన ముఖ్యమంత్రి. సమస్యలు వినిపించేందుకు వివిధ వర్గాల ప్రజలు వందల సంఖ్యలో వస్తుంటారు. సాధ్యం కాని కోరికలు కూడా కోరుతుంటారు. వారికి తగిన సమయం కేటాయించడంతో పాటు, చాలా సహనం-ఓర్పుతో సమాధానం ఇవ్వాల్సి ఉంది. నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోయినా వారిలో నమ్మకం కలిగించాలి. ఎమ్మెల్యే-స్పీకర్‌-చీఫ్‌ విప్‌గా ఉన్నప్పటి మాదిరిగానే వారితో వ్యవహరిస్తే అవి చెడు సంకేతాలుగా వెళ్లి, దుష్ర్పచారంగా మారి ప్రజల్లో విస్తృత ప్రచారమయ్యే ప్రమాదం లేకపోలేదు.

sanmanamఇక ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు, వారి అవసరాలు తీర్చడంలోనే కిరణ్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. వైఎస్‌ తన వద్దకు వచ్చి ఎమ్మెల్యేలందరికీ వారి చెప్పిన పనులన్నీ చేయక పోయినా భుజం తట్టి పంపేవారు. రోశయ్య మాత్రం తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలకు ఒక్క పనికూడా చేసిపెట్టకపోగా, వ్యంగ్యాస్త్రాలు సంధించ డంతో అసలు ఎమ్మెల్యేలు పేషీ ముఖం చూడటమే మానేశారు. సుదీర్ఘకాలం పదవిలో కొనసాగాలంటే ఎమ్మెల్యేలతో సత్సంధాలు పెట్టుకోకపోతే, ఆయన పరిస్థితీ మరో రోశయ్య కాక తప్పదని పార్టీ వర్గాల వ్యాఖ్యానిస్తున్నాయి.

cm-chidabramపేషీలో కూడా సమర్థులను నియమించు కోకపోతే రోశయ్య మాదిరిగానే సమస్యలు, విమర్శ లు ఎదుర్కోవలసి వస్తుంది. రోశయ్య హయాంలో ఆర్థిక శాఖ నుంచి తెచ్చుకున్న తన పాత సిబ్బందినే పీఎస్‌, పీఏ, ఓఎస్‌డీలు నియమించుకున్నారు. వారిలో ఒక్కరికీ ఎమ్మెల్యేలు, మీడియాతో సంబంధాలు లే పోవడంతో ప్రభుత్వమే ఇబ్బందిపడవలసి వచ్చింది. రోశయ్య మాదిరిగానే వారు కూడా సీఎం పేషీకి వచ్చినా ఇంకా ఆర్థికశాఖలో ఉన్నట్టే వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఈ విషయంలో కిరణ్‌ ఆచితూచి వ్యవహరించి, ప్రజా్రపతినిధులు, మీడియాతో సన్నిహిత సంబంధాలున్న వారిని నియమించు కోకపోతే సమస్యలు తప్పవంటున్నారు.

cm-sirస్థానికంగానయినా, చిత్తూరు జిల్లా స్థాయిలో నయినా మీడియాతో మొదటినుంచీ సత్సంబం దాలు తక్కువేనంటున్నారు. హైదరాబాద్‌ స్థాయి లోనూ కొంతమందితో తప్ప మొత్తంగా మీడియా తో సన్నిహిత సంబంధాలు లేవు. ఇప్పుడు రాజకీయాల్లో మీడియా ప్రాధాన్యం పెరిగింది. మీడియాపై ఎన్ని విమర్శలున్నప్పటికీ, దాని ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదన్నది నిర్వివాదం. చీఫ్‌విప్‌, స్పీకర్‌గా పనిచేసిన ఆయనకు అది అనుభవమే.

అయితే, అప్పుడు ఆయనకు మీడియాతో పెద్దగా పనిలేదు. స్పీకర్‌గా ఉన్న సమయంలో అసెంబ్లీలో ఆంక్షలు విధించడం ద్వారా ‘కిరణ్‌ మీడియా వ్యతిరేకి’ అన్న ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో.. మీడియా విషయంలో ఆయన ధోరణి అదేవిధంగా కొనసాగిస్తారా? లేక కాలమాన రాజకీయ పరిస్థితులు, అవసరాలు, మనుగడను దృష్ట్యా పాత ధోరణి మార్చుకుని ఆ ముద్ర తొలగించుకుంటారా అన్నది మరో ప్రశ్న. ఇప్పుడున్న పరిస్థితిలో మీడియా వ్యతిరేక ధోరణి అనుసరిస్తే కష్టమేనంటు న్నారు. రోశయ్య హయాంలో మీడియాలో ఒక వర్గాన్నే ప్రోత్సహించే వారు. వైఎస్‌ హయాంలో మీడియా భేటీల విషయంలో ప్రెస్‌ సెక్రటరీ ద్వారా అపాయింట్‌ మెంట్లు ఇచ్చేవారు.
దానితో ఎలాంటి సమస్యలూ రాలేదు.

cm-huggఈ విషయంలో నిన్నటి వరకూ కొనసాగిన ప్రెస్‌ సెక్రటరీ సఫలీకృతులయ్యారు. రోశయ్య ఆ పద్ధతి మార్చేశారు. నచ్చిన వారినే ప్రోత్సహిం చడం, ప్రెస్‌ సెక్రటరీతో సంబంధం లేకుండా అపాయింట్‌ మెంట్లు ఇవ్వడంతో చాలామంది దూరమయిన పరిస్థితి ఏర్పడింది. మరి కిరణ్‌ కూడా ‘ఆస్థాన విద్వాంసుల’కే పరిమితమవుతారా? లేక అందరివాడవుతారా చూడాలి.ఇక ప్రధానంగా.. ప్రతిపక్షమైన టీడీపీని ఎదుర్కొనే విషయంలో కిరణ్‌ ఎంతవరకూ సఫలమవుతారన్నదీ ఆసక్తికరంగా మారింది. చీఫ్‌ విప్‌గా ఉన్నప్పుడు టీడీపీపై ఒంటికాలుతో విరుచుకుపడిన కిరణ్‌, ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆ మోతాదులో ఎదుర్కోగలరా అన్నదీ మరో ప్రశ్న.


రాష్ట్రంలో ఇప్పటికి ముగ్గురు ముఖ్యమంత్రులు మారి, నాలుగో కృష్ణుడు కూడా రాబోతున్నారన్న అభిప్రాయం, కాంగ్రెస్‌లో మళ్లీ సీఎంలను మార్చే సంస్కృతి ప్రారంభమయిందన్న ప్రచారం మొదలయిన నేపథ్యంలో.. ప్రజల్లో పార్టీపై మళ్లీ 1983 మాదిరిగానే దురభిప్రాయం మొదలవుతుంది. అటు సొంత పార్టీలోని ప్రత్య ర్థులు, ఇటు టీడీపీని ఏకకాలంలో ఎదుర్కోవడం లోనే ఆయన రాణిస్తారా లేదా అన్నది తేలుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

No comments:

Post a Comment