దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు వైఎస్ జగన్, సతీమణి విజయమ్మల రాజీనామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సాయంత్రం హుటాహుటిన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఇక్కడి లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో సుమారు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి నగరంలో అందుబాటులో ఉన్న తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రాకు చెందిన సుమా రు 60 మంది వరకు హాజరయ్యారు. కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామా లపై సీఎం, ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.
ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకున్న సీఎంకు జగన్, విజయమ్మల రాజీనామా విషయం అక్కడే తెలి సింది. దీంతో ఆయన అక్కడి నుంచి ఫోన్‌లో తన అనుచరులతో మాట్లాడి ఆరా తీసినట్లు సమాచారం. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్న సిఎం, మధ్యా హ్నం రెండుగంటలకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో కలవాలని నగరంలో అందు బాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం పంపించారు. వీరి సమా వేశానికి ముందు సీఎం రాజభవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్‌కు ఆయన మంత్రి వర్గ జాబితాను అందజేసినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.అక్కడి నుంచి ఆయన లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు...రాజీనామా సందర్భంగా జగన్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలు, ఆరోపణలను మీరంతా ముక్తకంఠతో ఖండించాలి. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించండి. అక్కడక్కడ కొందరు జగన్ మద్దతు దారుల ముసుగులో గొడవలకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉంది.
శాంతి భద్రతలను కాపాడటం రాజీ పడబోమని, మీరు కూడా ఇందుకు సహాకరించాలి. సోనియా నాయకత్వాన్ని బలపరూస్తూ ఆమె పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. వైఎస్‌ఆర్‌కు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పదవులు, అవకాశాలిచ్చింది. దాంట్లో భాగంగానే ఆయన కూడా ఉన్నన్ని రోజు లు పార్టీకి విధేయుడిగా పనిచేశారు. కనుక వైఎస్‌ఆర్‌ని మీరు, పార్టీ నేతలు ఎవరు కూడా ఎక్కడ విమర్శించొద్దు. పార్టీ అధిష్ఠానం మనపై (ఆంధ్రాపై) ఎన్నో ఆశలుపెట్టుకుంది. సోనియా, ప్రధాని మన్మోహన్, చిదంబరం, ఆంటోని రాష్ట్రా న్ని అగ్రగ్రామిగా చూడాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని అగ్రగ్రామిగా అభివృద్ధి చేయడానికి తమ పూర్తి సహాకారం ఉంటుందని ప్రధాని హమీ ఇచ్చారు. ఎప్పుడు వచ్చినా మీ కోసం ద్వారాలు తెరచి ఉంటాయన్నారు.
మంత్రి పదవులు అందరికీ ఇవ్వలేను. అందుకే రాని వారు నిరాశపడొద్దు. పదవులు రానంత మాత్రానా అసమర్ధులు కాదని, వారు అవకాశం రాని వారు మాత్రమే. నేను కూడా మంత్రి కాకుండానే సీఎం అయ్యాను. అందరికి ఇలాగే గుర్తింపు వస్తుంది. నియోజ కవర్గాలకు మీరే హీరోలు. మీరు చెప్పినట్లే అన్ని జరుగుతాయి. అక్కడ పార్టీ, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది, అని కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. సిఎం వ్యాఖ్యలను బలపరు స్తూ కె.జానారెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆమోదించారు.
మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డి. శ్రీధర్‌బాబు, ఆనం రామ నారాయణరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దానం నాగేందర్, బాలరాజు, సబితా ఇంద్రారెడ్డి, శత్రుచర్ల, జె.గీతారెడ్డి, డొక్క మాణిక్య వర ప్రసాద్, గల్లా అరుణకుమారి, డి.కె.అరుణ, ధర్మాన ప్రసాద్‌రావు, వట్టి వసంత కుమార్, ఆర్.వెంకట్‌రెడ్డి, పితాని సత్యనారాయణ, విశ్వరూప్, గాదె వెంకట్ రెడ్డి, సునీతా లకా్ష్మరెడ్డి, జెసి. దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రవీణ్ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, బి.బిక్షమయ్య గౌడ్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీలు తదిత రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన వారందరు పార్టీ అధిష్ఠాన నిర్ణయానికి తాము కట్టు బడి ఉంటామని సీఎంకు భరోసా ఇచ్చారు.
చిరుతో భేటి వాయిదా?
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం అనంతరం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో పీఆర్పీ అధినేత చిరంజీవితో భేటీ కానున్నట్లు వార్తలు వచ్చాయి. మంత్రివర్గంలో చేరే విషయంతో పాటు జగన్ పరిణామాల పై చిరు, సీఎం మధ్య చర్చ జరిగే అవకాశాలున్నట్లు వినిపించింది. అయితే అనివార్య కారణాల వల్ల చిరు భేటి వాయిదా పడింది. మంగళవారం చిరుతో సీఎం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త మంత్రివర్గంలో పీఆర్పీని తీసుకునే అవకాశాలు లేవని స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. మంత్రివర్గం ఏర్పాటు అనంతరం పరిణామాలను బేరీజు వేసుకుని రెండవ విడత చేపట్టే మంత్రివర్గ విస్తరణలో పీఆర్పీని చేర్చుకునే అవకాశాలుంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

No comments:
Post a Comment